MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Wedding of Virosh : ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అభిమానులకు ఓ సర్ ప్రైజ్ కూడా

Wedding of Virosh : ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అభిమానులకు ఓ సర్ ప్రైజ్ కూడా

ఎట్టకేలకు పెళ్ళిపై అఫీషియల్ గా ప్రకటన చేశారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. తమ పెళ్లి ఈవెంట్ కు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు కూడా పెట్టారు. దానికి కారణం ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 22 2026, 11:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మోస్ట్ క్రేజీ కపుల్‌ విజయ్ రష్మిక
Image Credit : GA2 Pictures

మోస్ట్ క్రేజీ కపుల్‌ విజయ్ - రష్మిక

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేశారు. గత కొన్నేళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటూ వచ్చిన వీరిద్దరు.. ఎప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మీడియా, అభిమానులు ఎన్ని రకాలుగా ప్రత్నించినా.. వీరు ఈ విషయంలో స్పందించలేదు. 

ఇక ఎట్టకేలకు తాజాగా పెళ్లిపై స్పందించారు విజయ్ , రష్మిక. సోషల మీదియాలో స్పందిస్తూ.. తమ పెళ్లి ప్రకటన కూడా చేశారు. అఫీషియల్ గా పెళ్లి కార్డును షేర్ చేసిన ఈ ప్రేమ జంట.. తమ వెడ్డింగ్ ఈవెంట్ కి విరోష్ అనే పేరు కూడా పెట్టారు. తమ పెళ్లి ఈవెంట్ కు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్టు తెలిపింది స్టార్ జంట.

24
వెడ్డింగ్ ఆఫ్ విరోష్ కి అర్ధం ఏంటి?
Image Credit : Asianet News

వెడ్డింగ్ ఆఫ్ విరోష్ కి అర్ధం ఏంటి?

వెడ్డింగ్ ఆఫ్ విరోష్ గురించి విజయ్ దేవరకొండ తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో క్లారిటీ ఇచ్చాడు. '' మేం ఏదైనా ప్లాన్ చేసుకునే ముందు, ఏదైనా చేయాలి అనుకునే ముందు.. అభిమానులే ఆ పనిచేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా ప్రేమగా మా జంటకు ఓ పేరు పెట్టారు. 

మమ్మల్ని అభిమానులు ప్రేమగా విరోష్ అని పిలుస్తున్నారు. అందుకే అభిమానుల కోసం మా పెళ్లి వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టాము'' అని విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు పెళ్లి కార్డును కూడా వారు పోస్ట్ చేశారు.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?
Related image2
Rashmika Mandanna Diet : రష్మిక డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా..? నేషనల్ క్రష్ ఇష్టంగా తినే ఫుడ్ ఇదే ?
34
గీత గోవిందంతో మొదలైన బంధం..
Image Credit : GA2 Pictures

గీత గోవిందంతో మొదలైన బంధం..

'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి పరిచయం 'డియర్ కామ్రేడ్' నాటికి ప్రేమబంధంగా మారింది. ఈ సీనిమాలో వారి డీప్ లిప్ లాక్ చూసిన ఆడియన్స్ కు వీరిద్దరి మధ్య సమ్ థింగ్, సంమ్ థింగ్ అని టాక్ మొదలయ్యంది. కానీ వారు మాత్రం తమ బంధంపై ఎప్పుడ స్పందించలేదు. అధికారికంగా స్పందించని ఈ జంట, వెకేషన్ ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా వీరి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

44
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?
Image Credit : stockPhoto

విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?

ఈ నెల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకోబోతున్నారు. హిస్టారికల్ కోటలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైపూర్‌లో పెళ్లి పనులను ఈ జంట దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.అంతే కాదు పెళ్లి రహస్యంగా ఉంచేందుకు పెద్ద మొత్తంలో సెక్యురిటీ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రేమ కోసం ఎవరిముందైనా అడుక్కుంటా.. విజయ్ ఆంటోనీ సంచలన కామెంట్స్..
Recommended image2
పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?
Recommended image3
రష్మిక మందన్న పెళ్లిపై చీప్ కామెంట్స్.. స్టార్ నటుడిపై అభిమానుల ఫైర్
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?
Recommended image2
Rashmika Mandanna Diet : రష్మిక డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా..? నేషనల్ క్రష్ ఇష్టంగా తినే ఫుడ్ ఇదే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved