ఫైనల్ ఎపిసోడ్ లో ఆ రెండూ చూపించలేదు, రాంచరణ్ వాళ్ళ అమ్మ గురించి చెప్పి షాకిచ్చారు..గౌతమ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నారు. కానీ సీజన్ 8 గౌతమ్ కి మంచి క్రేజ్ తీసుకువచ్చింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నారు. కానీ సీజన్ 8 గౌతమ్ కి మంచి క్రేజ్ తీసుకువచ్చింది. సీజన్ 7లో ట్రోలింగ్ కి గురైన గౌతమ్ ఇప్పుడు అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో గౌతమ్ ఫైనల్ ఎపిసోడ్ గురించి, రన్నరప్ గా నిలవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ ఫైనల్ వరకు చేరుకున్నాడంటే అందుకు కారణం మణికంఠ అని ప్రచారం జరుగుతోంది. దీనిపై గౌతమ్ స్పందిస్తూ మణికంఠ నన్ను ఒక్క వారంలో సేవ్ చేశాడు. మిగిలిన అన్ని వారాలు స్వయంకృషితో, కష్టపడి గేమ్ ఆడి ఈ స్థాయికి చేరుకున్నా అని గౌతమ్ తెలిపారు.
నిఖిల్ ని విజేతగా ప్రకటించిన వెంటనేఅతడికి కంగ్రాట్స్ చెప్పా. కానీ ఫైనల్ ఎపిసోడ్ లో అది చూపించలేదు. భవిష్యత్తులో నేను చరిత్ర సృష్టించే స్థాయికి ఎదుగుతానని నాగార్జున గారు అభినందించారు. అది కూడా చూపించలేదు. గత సీజన్ లో నన్ను ట్రోల్ చేసిన వారే ఈ సీజన్ లో మెచ్చుకోవడం సంతోషంగా అనిపించింది అని గౌతమ్ తెలిపారు.
ఫైనల్ ఎపిసోడ్ లో రాంచరణ్ గారు గెస్ట్ గా రావడం సంతోషంగా అనిపించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అంటే నాకు అమితమైన ఇష్టం. ఫినాలేలో ఆఫ్ ది రికార్డ్ లో ఒక సంఘటన జరిగింది. నేను రన్నరప్ అని అనౌన్స్ చేయగానే నేను కొంచెం నిరాశ చెందాను. చరణ్ అన్న నా దగ్గరకి వచ్చి.. గౌతమ్ మా అమ్మ నీకు పెద్ద ఫ్యాన్. ప్రతి రోజు ఆమె బిగ్ బాస్ చూస్తుంది. నేను షూటింగ్ నుంచి రాగానే నీ గురించి చెబుతూ ఉంటుంది.
ఫైనల్ లో కూడా నువ్వే విన్నర్ అని ఆశించింది. రన్నర్ గా నిలిచావు. అయినా ఏం పర్వాలేదు అంటూ రాంచరణ్ అన్న ఓదార్చినట్లు గౌతమ్ తెలిపాడు. తాను త్వరలోనే మెగా ఫ్యామిలీని కలుస్తానని గౌతమ్ తెలిపారు.