- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ప్రియకు వార్నింగ్ ఇచ్చిన బసవయ్య.. తులసి నందుని చూసి కుళ్ళుకుంటున్న లాస్య?
Intinti Gruhalakshmi: ప్రియకు వార్నింగ్ ఇచ్చిన బసవయ్య.. తులసి నందుని చూసి కుళ్ళుకుంటున్న లాస్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్లో ప్రియ విక్రమ్ కి కాఫీ తీసుకొని వెళుతుండగా బసవయ్య దొంగచాటుగా తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడు విక్రం ఎవరికీ ఈ కాఫీ అన్నంతో మీకే అనగానే నేను అడగలేదు కదా అనడంతో ఇవ్వాలనిపించింది అని అంటుంది ప్రియ. అప్పుడు బసవయ్య నీ చెంప అనిపిస్తుంది మా అక్కకు ఈ విషయం తెలిస్తే గువ్వ గుయ్యిమనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది అత్తారిల్లు అనగా బాగానే ఉంది అనడంతో నీ ముఖం చూస్తే అలాగా అనిపించలేదు ఏదో కోల్పోయిన దానిలా ఉంటున్నావు అని అంటాడు విక్రమ్.
అప్పుడు ప్రియ ఒక మాట చెప్పనా కళ్ళకు కనిపించే ఇవన్నీ నిజాలు కావు కనిపించని అబద్ధాలు కావు అని అంటుంది. అప్పుడు విక్రమ్ నాది మా అమ్మ పెంపకం నిజం అబద్ధం తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు అని అంటాడు. మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నావు అనగా దివ్యని మీరే రక్షించాలి అని అంటుంది దివ్య. అప్పుడు కావాలనే బసవయ్య వస్తువు కింద పడేసి కోపంగా చూడడంతో ప్రియ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ప్రియ అక్కడి నుంచి వెళుతుండగా ఏంటి ఏదో చెప్పి వెళ్ళిపోతున్నావు అని అంటూ అబద్ధాలు చెప్పి ప్రియ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది.
అప్పుడు బసవయ్య దెబ్బలు తింటున్న బుద్ధి రావడం లేదా అని ప్రియకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు తులసి వాళ్ళందరూ కలిసి బట్టలు కొనడానికి షాపింగ్ కి వెళ్తారు. అప్పుడు విక్రమ్ ఫోన్ చేసి నేను వస్తున్నాను అని చెప్పడంతో దివ్య వద్దు అంటుంది నువ్వు వద్దు అనగానే నేను రావడం మానేస్తానా వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. మరోవైపు తులసి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్లి బట్టలు సెలక్షన్ చేస్తూ ఉంటారు. అప్పుడు దివ్య ఎంట్రన్స్ వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు తులసి నందుకు ఇద్దరు ఒకే చోట కూర్చొని చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండగా అది చూసి దివ్య సంతోష పడుతూ ఉంటుంది.
అప్పుడు పరంధామయ్య వాళ్ళు కూడా తులసి వారిని చూసి సంతోష పడుతూ ఉంటారు. ఇదే మొదటిసారి ఇదే చివరిసారి అంటూ వాళ్ళ ముగ్గురు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ తర్వాత తులసి నందు ఇద్దరు కలిసి ఒకే చీర సెలెక్ట్ చేయడంతో అప్పుడు షాప్ లో అతను నా ఇన్నేళ్ల అనుభవంలో భార్య భర్తలకు ఇద్దరికీ ఒకటే చీర నచ్చడం చాలా రేర్ గా చూశాను ఇది ఎనిమిదో వింత అని అంటూ ఉండగా అది చూసి దివ్య సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు తులసి నందు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మేము భార్యాభర్తలం కాదు స్నేహితులం అనడంతో అతను అక్కడి నుంచి జంప్ అయిపోతాడు.
ఆ తర్వాత అనసూయ పరందామయ్య బాగుంది అని పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి షాప్ అతను వెళ్లి వాళ్ళిద్దరూ స్నేహితులు కదా అనడంతో వాళ్ళిద్దరూ నా కొడుకు కోడలు అనగా అతడు అయోమయంలో పడతాడు. మరోవైపు దివ్య విక్రం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ తర్వాత సుందరం లాస్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ల గురించి నోటికొచ్చిన విధంగా గొప్పగా మాట్లాడుతూ ఉండగా ఇంకొకసారి వాళ్ళిద్దరూ భార్యాభర్తలా అన్నావంటే పీక పిసికేస్తాను ఆయన నా భర్త ఆమె పెళ్లికూతురు తల్లి అనడంతో సిల్క్ సుందరం అర్థం కాక జుట్టు పట్టుకుని తెగ ఆలోచిస్తూ ఉంటాడు.
సుందరం మళ్లీ దివ్య దగ్గరికి వెళ్లి నా దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి అవి క్లియర్ చేస్తావా మీ అమ్మ ఎవరు అనగా తులసి వైపు చూపిస్తుంది దివ్య. అప్పుడు దివ్య కూడా కన్ఫ్యూజన్ చేసినట్టు మాట్లాడటంతో పోమ్మా నువ్వు కూడా నన్ను కన్ఫ్యూజన్ చేశావు అని తల గీక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సిల్క్ సుందరం. తర్వాత తులసి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెగ ఆలోచిస్తూ ఉంటాడు సిల్క్ సుందరం. ఆ తర్వాత విక్రమ్ దొంగచాటుగా షాపింగ్ మాల్ కి వస్తాడు. అప్పుడు దివ్యకి సైగలు చేస్తుండగా దివ్య పట్టించుకోకపోవడంతో అక్కడే ఉన్న పువ్వు తీసుకొని విసర్గ అది కాస్త వెళ్లి అనసూయకు తగులుతుంది.
అప్పుడు అనసూయ ఆ పువ్వు పరంధామయ్య విసిరాడు అనుకోని సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత విక్రమ్ మళ్ళీ ఇంకొక సారి పువ్వు విసరగా వెళ్లి పరంధామయ్యకు తగలడంతో పరంధామయ్య చేతిలో పట్టుకోగా అది చూసి మళ్ళీ సిగ్గుపడుతూ ఉంటుంది అనసూయ. అప్పుడు విక్రమ్ మళ్ళీ పువ్వు విసరగా అది వెళ్లి దివ్యకు తగలడంతో పక్కకు రమ్మని సైగలు చేస్తూ ఉంటాడు.