MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Nilave Review: `నిలవే` మూవీ రివ్యూ.. ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?

Nilave Review: `నిలవే` మూవీ రివ్యూ.. ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?

Nilave Review: కొత్త కుర్రాళ్లు కలిసి చేసిన మూవీ `నిలవే`. సౌమిత్‌ రావు, శ్రేయాసి సేన్‌ జంటగా నటించారు. ఇంట్రెస్ట్, పొయెటిక్‌ లవ్‌ స్టోరీగా సాగే ఈ మూవీ ఎలా ఉందంటే? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Feb 13 2026, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నిలవే మూవీ రివ్యూ
Image Credit : Asianet News

నిలవే మూవీ రివ్యూ

సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించిన చిత్రం ‘నిలవే’. ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతా కొత్త టీమ్ కలిసి ఈ మూవీని రూపొందించింది. టీజర్‌, ట్రైలర్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. దీనికితోడు సింగర్‌ సునీత, ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సపోర్ట్ చేయడంతో మూవీకి హైప్‌ ఏర్పడింది. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం(ఫిబ్రవరి 13న) విడుదలైన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నిలవే మూవీ కథ
Image Credit : Asianet News

నిలవే మూవీ కథ

అర్జున్‌(సౌమిత్ రావు)కి ఎవరూ లేరు, ఒక అనాథ. ఫ్రెండ్‌ (వైవా హర్ష)తో కలిసి ఉంటాడు. ఓ యాడ్‌ ఏజెన్సీలో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. అనాథ కావడంతో చిన్నప్పట్నుంచి ఒంటరిగానే ఉంటాడు.  అమ్మాయితోడు కావాలని కోరుకుంటాడు. కానీ ఆయన జీవితంలోకి ఏ అమ్మాయి రాదు, ఎన్ని ప్రయత్నాలు చేసిన బెడిసి కొడతాయి. దీంతో మానసికంగా కుంగిపోతాడు. ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలోనే ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో నుంచి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అతిథి(శ్రేయాసి సేన్). చూసి ఫిదా అవుతాడు. ఆమెని చూడగానే తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. క్రమంగా ఆమెకి దగ్గరవుతాడు. అతిథి కూడా అర్జున్‌తో ఫిజికల్‌గా కలిసిపోతుంది. రొమాన్స్ లో పీక్‌లోకి వెళ్లిపోతారు. కానీ ప్రేమని, పెళ్లిని అంగీకరించదు. దానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్‌బ్యాక్‌ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీని కోరుకున్న అర్జున్‌ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్‌లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్‌, అతిథిల ప్రేమ కథ ఎలా ముగిసిందనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Related image2
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
36
నిలవే మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

నిలవే మూవీ విశ్లేషణ

ప్రస్తుతం యాక్షన్‌ మూవీస్‌, రూట్‌ లెవల్‌లో ఉండే చిత్రాలు, గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలు, థ్రిల్లర్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. అదే సమయంలో బోల్డ్ లవ్‌ స్టోరీలు కూడా బాగానే ఆడుతున్నాయి. అలాంటి చిత్రాలు వస్తున్నాయి. కానీ వాటికి భిన్నంగా ఇంటెన్సిటీ, ప్రేమలో డెప్త్ ని, ఎమోషన్స్ ని ఆవిష్కరించిన మూవీ `నిలవే`. ప్యూర్‌ లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ మూవీ. ప్రేమికుల రోజుకి పర్‌ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేటితరం కుర్రాళ్లు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. అదే సమయంలో చాలా నిజాయితీగా చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు. కొత్త టీమ్‌ అయినా ఎంతో శ్రమించి రూపొందించారు, ఒక పెద్ద సినిమా స్థాయిలో తెరకెక్కించారు. ఎక్కడా చిన్న సినిమా అనే భావన రావు. క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. చాలా మెచ్యూర్ గా మూవీ ఉందని చెప్పొచ్చు. ఇక సినిమాగా చూసినప్పుడు ప్రారంభంలో హీరో తాను అనాథ అని బాధపడటం, ఆ బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, అదే సమయంలో హీరోయిన్‌ కనిపించడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని ఆమెకి దగ్గరయ్యే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో సక్సెస్‌ కావడం ఇలా సాగిపోతుంటుంది. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఇద్దరు ప్రేమలో పడ్డాక ప్రేమ, రొమాన్స్ ఇలా ఇంటెన్సిటీతో మూవీని నడిపించారు. ఆయా సన్నివేశాలు ఆద్యంతం కట్టిపడేస్తాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ప్యూర్‌ లవ్‌ని ఆవిష్కరించిన చిత్రమిది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. ఫస్టాఫ్‌ వరకు ఇలా రొమాంటిక్‌ లైఫ్‌ని ఆవిష్కరించారు. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఇక సెకండాఫ్‌లో ప్రేమని పెళ్లిగా మార్చుకునేందుకు హీరో ప్రయత్నించడం, దాన్ని లవర్‌ తిరస్కరించడం, దానికి ఆమెకి ఒక ఫ్లాష్‌ బ్యాక్‌ ఉండటం, ఆ తర్వాత సినిమా మొత్తం ఎమోషనల్‌ సైడ్‌ తీసుకుంటుంది. మరోవైపు హీరోహీరోయిన్ల మధ్య సంఘర్షణ, వాదనలు, బాధ, ఆవేదన ఇలాంటి ఎమోషన్స్ తో ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ లో ఆ ఎమోషన్స్ పీక్స్ లోకి వెళ్లాయి. గుండెని బరువెక్కిస్తాయి. సినిమాలో సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది. అదే మూవీని తీసుకెళ్లిపోతుంది. ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది.

46
నిలవే మూవీలో ప్లస్‌ మైనస్ లు
Image Credit : Asianet News

నిలవే మూవీలో ప్లస్‌ మైనస్ లు

సినిమాలో విజువల్స్ అదిరిపోయాయి. చాలా ఫ్రెష్‌గా, నేచురల్‌గా ఉంటాయి. అలాగే ప్రేమ కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. లవ్‌ స్టోరీ, రొమాన్స్ బాగున్నాయి. కట్టిపడేస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంక్‌ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ల మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్లు హృదయాన్ని కదిలిస్తాయి. క్లైమాక్స్ ఆ భావోద్వేగాలను పీక్‌లోకి తీసుకెళ్తుంది. మ్యూజిక్‌ సినిమాకి ప్రధాన బలం. హీరోహీరోయిన్లు కూడా నటనతో అదరగొట్టారు.

మైనస్‌ ల విషయానికి వస్తే, మూవీ ప్రారంభం నుంచి స్లోగా సాగుతుంది. అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. కొద్దిగా ల్యాగ్‌ అనిపిస్తుంది. అయితే సినిమా మొత్తం సీరియస్‌ లవ్‌, అండ్‌ రొమాన్స్ చుట్టూనే తిరుగుతుంది. దాన్నుంచి రిలీఫ్‌ అయ్యే అంశాలు లేవు. ఫన్ ట్రై చేయాల్సింది. ఓపికగా చూడాల్సిన సినిమా. దీనికితోడు తెలిసిన యాక్టర్స్ లేరు. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే `నిలవే` నిజాయితీతో చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు.

56
నిలవే మూవీ ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

నిలవే మూవీ ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సినిమాలో చాలా వరకు కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. కొత్త వాళ్లు అయినా చాలా బాగా నటించారు. అర్జున్‌ పాత్రలో సౌమిత్‌ రావు చాలా బాగా చేశాడు. ఎమోషన్స్ ని బాగా పలికించాడు. లుక్‌, యాక్టింగ్‌ అదిరిపోయింది. డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు. ఎక్కడా కొత్త నటుడు అనే ఫీలింగ్‌ రాలేదు. చూడ్డానికి బాలీవుడ్‌, హాలీవుడ్‌ హీరోలా కనిపించాడు. ఇక అతిథిగా శ్రేయాసి సేన్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫ్రెష్‌ ఫేస్‌ ఆకట్టుకుంది. అందంగా ఉంది. తొలి సినిమా అయినా బాగా చేసింది. రియల్‌ లైఫ్‌ పాత్రని ఆవిష్కరించింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.

66
నిలవే మూవీలో టెక్నీషియన్ల పనితీరు
Image Credit : Asianet News

నిలవే మూవీలో టెక్నీషియన్ల పనితీరు

టెక్నీకల్‌గా సినిమా అదిరిపోయింది. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. మ్యూజిక్‌ దీన్ని ఎక్కడా చిన్న సినిమా అనే ఫీలింగ్‌ రానివ్వదు. చాలా పెద్ద సినిమా రేంజ్‌లో సంగీతం ఉంది. పాటలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వాటి వెంట మనం పరిగెడతాం. దిలీప్‌ కే కుమార్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కట్టిపడేస్తాయి. ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. సత్య జి ఎడిటింగ్‌ పర్వాలేదు. కాకపోతే కొంత స్పీడ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. బాగా తీశారు. దర్శకులు ప్రాణం పెట్టి సినిమాని రూపొందించారని ప్రతి ఫ్రేములోనూ అనిపిస్తుంది. డైలాగ్‌లు, సీన్లు బాగా రాసుకున్నారు. తెరపై అంతే బాగా ఆవిష్కరించారు. సినిమా తెరపై చాలా సహజంగా అనిస్తుంది. ఆ విషయంలో దర్శకులు సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో ఎమోషన్స్ ని పండించడంలోనూ సక్సెస్‌ అయ్యారు. కాకపోతే స్లోగా సాగడమే సినిమాకి మెయిన్‌ మైనస్‌గా నిలుస్తుంది.

ఫైనల్‌గా:

 ఫ్రెష్‌ లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ మూవీ. మ్యూజికల్‌ ఎమోషనల్‌ రైడ్‌ గా చెప్పొచ్చు.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Recommended image2
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved