- Home
- Entertainment
- 50 రోజులు ఆడిన బాలయ్య డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా? డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మిన బాలకృష్ణ
50 రోజులు ఆడిన బాలయ్య డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా? డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మిన బాలకృష్ణ
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కెరీర్ లో సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ కామన్. నటసింహం నందమూరి బాలయ్య కూడా ఇలానే దారుణమైన ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా మాత్రం ప్లాప్ అయినా బాలకృష్ణ ఇమేజ్ తో 50 డేస్ ఆడింది. ఇంతకీ ఏంటా సినిమా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
నందమూరి బాలకృష్ణ ఇమేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బాలయ్య ఇప్పికీ ముందు ఉంటారు. 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు బాలకృష్ణ. ప్లాప్ సినిమాలు కూడా బాలయ్య ఇమేజ్ తో నడిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు చూద్దాం.
నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన సినిమా పలనాటి బ్రహ్మనాయుడు. 2003 జూన్ 6న విడుదలైన ఈ సినిమా 22 ఏళ్లు పూర్తిచేసుకుంది. బాలయ్య, బి.గోపాల్ హిట్ కాంబినేషన్ నుండి వచ్చిన ఈ ప్లాప్ మూవీ.. రిలీజ్ కుముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
సమరసింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’ వంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్, ఈ సినిమాతో విమర్శల ఫేస్ చేశారు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన పలనాటి బ్రహ్మనాయుడు మూవీ వారి అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది. ఈసినిమాలో ఓవర్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని ఇబ్బందిపెట్టాయి.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని కూడా విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, కోడి రౌడీని చంపడం, విలన్ కుర్చీని హీరో పిలవగానే ముందుకు రావడం వంటి సంఘటనలు ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోయినా ట్రోలింగ్ కు గురయ్యాయి. నేటికీ మీమ్స్ కు ఆ సీన్స్ ను వాడుతున్నారు నెటిజన్లు.
ఒక ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ, ‘‘తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్తుందా? ఆ సీన్ గురించి ముందు నేను ఆలోచించలేదు.. కాని నాకూ తర్వాత నవ్వొచ్చింది. డైరెక్టర్ చెప్పాడుగా అని చేశాను అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు బి.గోపాల్ ఈ సందర్భంగా స్పందిస్తూ, బాలయ్య బాబు నన్ను గుడ్డిగా నమ్మి చేశాడు. ఆ సినిమా ఫలితం తర్వాత నాకే బాలయ్యని ఫేస్ చేయడం ఇబ్బందిగా అనిపించింది. కానీ అతను ఒక్క మాట నన్ను అనలేదు అని అన్నారు.
ఇక పలనాటి బ్రహ్మనాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలిపోయినా, 92 కేంద్రాల్లో 50 రోజులు, 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇది బాలయ్య యొక్క స్టార్ పవర్‌కు నిదర్శనంగా నిలిచింది. అయితే ప్రేక్షకుల మదిలో మాత్రం ఇది ట్రోలింగ్ మెటీరియల్‌గా చెరగని ముద్ర వేసింది. రీసెంట్ గా పలనాటి బ్రహ్మనాయుడు 22వ వార్షికోత్సవం చేసుకోవడంతో బాలయ్య అభిమానులు ఈసినిమాను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.