14 దేశాల్లో మంచు విష్ణు భార్య విరానికా చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసా?
మోహన్ బాబు నట వారసత్వాన్ని తీసుకుని మంచు విష్ణు హీరోగా సినిమాలు చేస్తుంటే.. ఆయన భార్య విరానికా మాత్రం బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్నారు. దాదాపు 14 దేశాల్లో మంచువారి కోడలు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
మంచువారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విష్ణు.. హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనిపించాడు. కాని స్టార్ హీరో స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా హీరోగా సాలిడ్ సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు విష్ణు.
ఈక్రమంలో తనను తాను నిరూపించుకోవడం కోసం భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాను చేస్తున్నాడు విష్ణు. 100 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కించారు. మరి ఈసినిమాతో అయినా మంచు హీరో సాలిడ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
అయితే మంచు విష్ణు ఇండస్ట్రీలో ఇలా ప్రయత్నం చేస్తుంటే మరో వైపు ఆయన భర్య మాత్రం ఇంటర్నేషనల్ రేంజ్ లో బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్నారు. వ్యాపార, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన విరానికా.. అదే రంగంలో తన సత్తా చాటారు.
మైజన్ అవా (Maison Ava) పేరుతో విరానికా చిన్నపిల్లల క్లాత్ బ్రాండ్ ను స్థాపించి దూసుకుపోతున్నారు. ఈ వ్యాపారంలో ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక తన భార్య వ్యాపారల గురించి, అందులో ఆమె ఎలా విజయం సాధిస్తున్నారు అనే విషయంపై రీసెంట్ గా మాట్లాడారు మంచు విష్ణు.
రీసెంట్ గా కన్నప్ప సినిమా ప్రమోషన్‌లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు తన భార్య బిజినెస్ సక్సెస్ గురించి వెల్లడించారు. విష్ణు మాట్లాడుతూ, "నా భార్య 2022లో మైజన్ అవా అనే బ్రాండ్‌తో చిన్నపిల్లల క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించింది.
ఈ బ్రాండ్ కంపెనీ 14 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను విక్రయిస్తుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ 14 దేశాల్లో వ్యాపారం చేస్తోంది. ఇటలీ మిలాన్‌లో మైజన్ అవా హెడ్ ఆఫీస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైజన్ అవాకు మొత్తం 48 స్టోర్లు ఉన్నాయి" అని చెప్పారు.
ఇక మంచు విష్ణు చెప్పిన వివరాల ప్రకారం విరానికాకు ఓ రికార్డ్ కూడా ఉంది. లండన్‌లోని 175 ఏళ్ల చరిత్ర కలిగిన హోరోడ్స్ స్టోర్‌లో బ్రాండ్ స్టోర్ ప్రారంభించిన మొదటి భారతీయ ఫ్యాషన్ డిజైనర్ విరానికానే. అంతే కాదు విష్ణు మాట్లాడుతూ.. ఆమె నాకన్నా ఎక్కువగా చదివింది. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్‌లో చదువు పూర్తి చేసిందని అన్నారు.
విరానికాకు జ్యువెల్లరీ డిజైన్, జెమాలజీ ,ఫ్యాషన్ మార్కెటింగ్‌లో డిగ్రీ ఉంది. పెళ్లి తర్వాత మంచు వారి కుటుంబం లో అందరికి స్పెషల్ గా డిజైన్లు చేయడం మొదలుపెట్టింది విరానికా .మొదట ఇండియాలో "విరానికా" అనే బొటిక్ నడిపిన ఆమె, కరోనా తరువాత లండన్‌లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించి, అక్కడి నుంచి వ్యాపారాన్ని విస్తరించారు. అంతే కాదు ఆమె తన బ్రాండ్‌కు సంబంధించిన వివరాలు, కొత్త కలెక్షన్లకు సబంధించిన ప్రతీ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ల ద్వారా పంచుకుంటూ వస్తున్నారు.
నలుగురు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది విరానికా. మొత్తంగా, విరానిక మంచు స్థాపించిన మైజన్ అవా బ్రాండ్ చిన్నపిల్లల ఫ్యాషన్ మార్కెట్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తూ, భారతీయ డిజైనర్లకు కొత్త గౌరవం తీసుకువచ్చింది.