- Home
- Entertainment
- సౌందర్య వస్తుందని అన్నీ రెడీ చేసుకుని కూర్చున్న బాలకృష్ణ, అంతలోనే పెద్ద షాక్, అదే చివరి సినిమా
సౌందర్య వస్తుందని అన్నీ రెడీ చేసుకుని కూర్చున్న బాలకృష్ణ, అంతలోనే పెద్ద షాక్, అదే చివరి సినిమా
బాలకృష్ణ, సౌందర్య కాంబినేషన్‌లో ఒకే ఒక్క మూవీ వచ్చింది. మరో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ మూవీ షూటింగ్‌లో ఏం జరిగిందనేది చూస్తే

balakrishna, soundarya
సౌందర్య సౌత్‌తోపాటు అన్ని హిందీలోనూ నటించింది. దాదాపు అందరు టాప్ హీరోల సరసన జత కట్టింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో ఎక్కువసార్లు మూవీస్ చేసింది. కానీ బాలయ్యతో మాత్రం రెండే సినిమాలు చేసింది. ఒకటి పూర్తి మూవీ అయితే, మరోటి మధ్యలోనే ఆగిపోయింది.
బాలకృష్ణతో సౌందర్య మొదటిసారి `టాప్ హీరో` సినిమాతో జోడీ కట్టింది. 1994లో ఈ చిత్రం విడుదలైంది. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆమని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత పదేళ్ల వరకు వీరిద్దరి కాంబోలో సినిమాలు రాలేదు.
కానీ 2004లో పౌరాణిక చిత్రం `నర్తనశాల`లో నటించారు. ఈ మూవీతో బాలకృష్ణనే దర్శకుడిగా మారారు. ఇందులో ద్రౌపదిగా నటించింది సౌందర్య. ఇందులో బాలకృష్ణ మూడు రోల్స్ చేశారు. అర్జునుడు, బృహన్నల, కీచకుడు పాత్రలు పోషించారు.
లేట్ శ్రీహరి కూడా ఇందులో భీముడు పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా మార్చి 1న షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. సౌందర్య కూడా పాల్గొంది.
narthanasala
ఏప్రిల్ 17న షూటింగ్ కోసం బాలకృష్ణ రెడీ అయ్యాడు. సెట్ అంతా రెడీ చేశాడు. ఆ రోజు సౌందర్య షూటింగ్‌కి రావాల్సి ఉంది. ఆమెకోసమే బాలయ్యతో సహా టీమ్ అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ అంతలోనే గుండె పగిలే వార్త బయటకు వచ్చింది. సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిందనే వార్త విని అంతా షాక్ అయ్యారు.
యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, యావత్ ఇండియన్ సినీ లవర్స్, సాధారణ జనం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. సౌందర్య మరణించిందనే వార్తతో షాక్‌లోకి వెళ్లారు. అది `నర్తనశాల` టీమ్‌కి సైతం పెద్ద షాకిచ్చే వార్త. సౌందర్య మరణంతో ఆ మూవీనే ఆపేశారు.
soundarya
అలా బాలయ్య, సౌందర్య కాంబినేషన్‌లో రెండో సినిమా ఆగిపోయింది. అయితే అప్పటికే కొంత పార్ట్ షూట్ చేశారు. దాన్ని ఎడిటింగ్ చేస్తే 17 నిమిషాల ఫూటేజ్ వచ్చింది. దాదాపు 16ఏళ్ల తర్వాత బాలకృష్ణ ఆ ఫూటేజీ ఎడిటింగ్ చేయించి ఓటీటీలో రిలీజ్ చేశారు.
వచ్చిన డబ్బులను ఛారిటీకి ఇచ్చారు. అయితే దీనికి పెద్దగా స్పందన రాలేదు. అది అప్పటికే చాలా ఏళ్లది కావడం, కంటెంట్ సరిగా లేకపోవడంతో ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సౌందర్య నటించిన చివరి మూవీ కూడా ఇదే కావడం గమనార్హం.
read more: రామ్ చరణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏం చేశాడో తెలుసా? చిరంజీవి కూడా షాక్ అయిన సందర్భం