MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే

Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించిన అప్‌ డేట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంలో బాలయ్య పెద్ద రిస్క్ చేస్తున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 25 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలకృష్ణ వారసుడి ఎంట్రీపై సస్పెన్స్
Image Credit : X/NBKCult

బాలకృష్ణ వారసుడి ఎంట్రీపై సస్పెన్స్

నందమూరి తారక రామారావు నటన వారసుడిగా నందమూరి బాలకృష్ణ రాణిస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా ఉన్నారు. అయితే ఆయన వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలంగా చర్చ జరుగుతుంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ త్వరలో ఉంటుందని గత మూడునాలుగేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో `సింబా` పేరుతో మూవీని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇది ఆగిపోయింది. కొత్తగా మరే అప్‌ డేట్‌ రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదిత్య 999 మ్యాక్స్ తో మోక్షజ్ఞ ఎంట్రీ
Image Credit : our own

ఆదిత్య 999 మ్యాక్స్ తో మోక్షజ్ఞ ఎంట్రీ

ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు మరో అప్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందట. క్రిష్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్ `ఆదిత్య 999 మ్యాక్స్` పేరుతో దీన్ని రూపొందించనున్నారు. `ఆదిత్య 369`కి సీక్వెల్‌గా దీన్ని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్ర కథని బాలయ్యనే తయారు చేశారు. దీన్ని తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ గా భావించారు. తానే దర్శకత్వం వహించాలనుకున్నారు, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారట. క్రిష్‌కి ఆ పగ్గాల అప్పగించారట.

35
క్రిష్‌ విషయంలో బాలయ్య రిస్క్ చేస్తున్నారా?
Image Credit : Facebook/Krish Jagarlamudi

క్రిష్‌ విషయంలో బాలయ్య రిస్క్ చేస్తున్నారా?

బాలయ్య వారసుడి కోసం ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈ మూవీని ప్రారంభించే అవకాశం ఉందనే వార్తలు వినిస్తున్నాయి. ఇది నందమూరి అభిమానుల్లో కొంత జోష్‌ నింపింది. అయితే ఇక్కడే మరో డౌట్‌ కొడుతుంది. బాలయ్య రిస్క్ చేస్తున్నారనే  కామెంట్స్ వస్తున్నాయి. క్రిష్‌ ఇటీవల కాలంలో దర్శకుడిగా సక్సెస్‌ కాలేకపోతున్నారు. ఆయన తీసిన `కథానాయకుడు` ఆడలేదు. `కొండపొలం` తేడా కొట్టింది. `హరి హర వీరమల్లు` నుంచి మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతోపాటు ఇటీవల అనుష్క ప్రధాన పాత్రలో `ఘాటి` అనే మూవీని రూపొందించారు. ఇది కూడా డిజాస్టర్‌ అయ్యింది. ఈ క్రమంలో ఒక కొత్త హీరోని, పైగా భారీ అంచనాలు ఉన్న హీరోని ఆయన చేతిలో పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. అభిమానులను ఇది కలవరానికి గురి చేస్తోంది.

45
సినిమాల్లోకి రావడం మోక్షజ్ఞకి ఇష్టం లేదా?
Image Credit : facebook.com/moksha9999

సినిమాల్లోకి రావడం మోక్షజ్ఞకి ఇష్టం లేదా?

ఇదిలా ఉంటే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించి గత కొన్నేళ్లుగా డిలే కావడానికి మరో కారణం కూడా ఉందట. ఆయనకు సరైన మూవీ సెట్‌ కాకపోవడమే కాదు, మోక్షజ్ఞకి ఆసక్తి లేదని సమాచారం. ఆయనకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని, బాలయ్య బలవంతంగా ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌ నడుస్తుంది. హీరో అంటే లుక్‌ పరంగా, బాడీ లాంగ్వేజ్‌ పరంగా, నటన, డాన్సుల పరంగా పర్‌ఫెక్ట్ గా రెడీ కావాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు. ఈ విషయంలో మోక్షజ్ఞ వెనకడుగు వేస్తూ వస్తున్నారని, వీటిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ డిలే అవుతుందని టాక్‌.

55
బాలయ్యని భయపెడుతున్నది ఇదే
Image Credit : facebook.com/moksha9999

బాలయ్యని భయపెడుతున్నది ఇదే

ఏదేనా వారసత్వం, తండ్రి ఇమేజ్‌ మొదటి సినిమాకే పని చేస్తుంది. నటుడిగా తనకు తాను మాత్రమే నిరూపించుకోవాలి. లేదంటే ఫేడౌట్‌ అయిపోతారు. ఇదే ఇప్పుడు బాలయ్యని తన వారసుడి విషయంలో భయపెడుతుందని టాక్‌. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇక బాలకృష్ణ చివరగా `అఖండ 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇది బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shriya Saran: రెడ్‌ శారీలో శ్రియా శరణ్‌ అదిరిపోయే లుక్‌.. చూడ్డానికి రెండు కళ్ల చాలవు
Recommended image2
Vivek Oberoi: క్యాన్సర్‌ను జయించి హీరోయిన్ అయిన దత్తపుత్రిక.. ఎమోషనల్ అయిన వివేక్ ఒబెరాయ్
Recommended image3
The Paradise: నాని చివరి సినిమా కలెక్షన్స్ 120 కోట్లు, ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే.. 3 రోజుల్లోనే తేలిపోద్ది
Related Stories
Recommended image1
Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్
Recommended image2
Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved