MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బాలకృష్ణతో విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ ముద్దులాట.. `డాకు మహారాజ్‌` సక్సెస్‌ పార్టీలో రెచ్చిపోయిన హీరోలు

బాలకృష్ణతో విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ ముద్దులాట.. `డాకు మహారాజ్‌` సక్సెస్‌ పార్టీలో రెచ్చిపోయిన హీరోలు

బాలకృష్ణ, విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ ముద్దులాట ఇప్పుడు చాలా ఫేమస్‌గా మారింది. వైరల్‌ అవుతుంది. మరోవైపు బాబీకి కూడా ముద్దు పెట్టాడు బాలయ్య. ఇదే హైలైట్‌గా నిలిచింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 12 2025, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌ కి ఖాతా ఓపెన్ చేశాడు. తాజాగా ఆయన `డాకు మహారాజ్‌`తో హిట్‌ టాక్‌ని అందుకుంటున్నారు. నేడు విడుదలైన ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉందని అంటున్నారు. కొన్ని మైనస్‌లు ఉన్నా పండక్కి నడిచిపోయే మూవీ అవుతుందంటున్నారు. ప్రెస్‌ మీట్‌లో కూడా టీమ్‌ తమ సంతోషాన్ని వెల్లడించారు. పెద్ద రేంజ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ కాబోతుందని అన్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ నేపథ్యంలో `డాకు మహారాజ్‌` టీమ్ తాజాగా సక్సెస్‌ పార్టీ నిర్వహించింది. ఆదివారం రాత్రి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో టీమ్‌తోపాటు బాలయ్య సన్నిహితులు, యంగ్‌ హీరోలు కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం. ఈ నేపథ్యంలో గట్టిగా పార్టీ చేసుకుంటూ బాలయ్యతో కలిసి సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు విశ్వక్ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ. 
 

36

అయితే ఇందులో ఈ ముగ్గురు హీరోలు కలిసి ముద్దులాట హైలైట్‌గా నిలిచింది. `డాకు మహారాజ్‌` సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తూ, `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్‌` అని విశ్వక్‌ సేన్‌ అనగా, థ్యాంక్యూ లైలా అంటూ విశ్వక్‌ సేన్‌కి ముద్దు పెట్టాడు బాలయ్య. నా సక్సెసే మీ సక్సెస్‌ అని, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్‌ అని పేర్కొన్నారు. అనంతరం బాలయ్యకి కిస్‌ పెట్టాడు విశ్వక్‌ సేన్‌. ఇంతలో సిద్దు జొన్నలగడ్డ వచ్చాడు. 
 

46

నాకు పెట్టలేదు(కిస్‌) అనగా, సిద్దుకి ముద్దు పెట్టాడు బాలయ్య. అనంతరం బాలయ్యకి ముద్దు పెట్టాడు సిద్దు. ఇలా ముగ్గురు ముద్దులతో రెచ్చిపోయారు. హీరోయిన్లని పక్కన పెట్టి హీరోలే ఇలా ముద్దులు పెట్టుకోవడం, దాన్ని సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవడం హైలైట్‌గా నిలిచింది.
 

56

మరోవైపు దర్శకుడిగా బాబీకి కూడా కిస్‌ పెట్టారు బాలయ్య. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. పార్టీ మూడ్‌లో ఇలా రెచ్చిపోవడంతో ఇది పెద్ద వైరల్‌గా మారింది. పెద్ద రేంజ్‌లో రచ్చ అవుతుంది. ఈ వీడియోలో అంతా పార్టీ మూడ్‌లో ఉన్నారు. పాటల సందడితో మాంచి కిక్‌ ఇచ్చేలా ఉంది. అందరు మంచి కిక్‌లో ఉన్నారని అర్థమవుతుంది. 

66

ఇక బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్‌` సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైశ్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా, బాబీ డియోల్ నెగటివ్‌ రోల్లో నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా చాలా గ్రాండ్‌గా నేడు ఆదివారం సినిమా విడుదలైంది. ప్రారంభం నుంచే పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. 

అయితే కథ పెద్దగా లేదని, సెకండాఫ్‌ డల్‌గా ఉందని, రొటీన్‌గా ఉందని అంటున్నారు. కానీ బాలయ్య మార్క్ యాక్షన్‌, ఎలివేషన్‌ సీన్లు హైలైట్‌ అని, అవే సినిమాని నిలబెట్టాయని, ఫ్యాన్స్ ఊగిపోయేలా చేస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య `డాకు మహారాజ్‌`తో హిట్‌ కొట్టబోతున్నాడని అర్థమవుతుంది. వరుసగా నాల్గో హిట్‌ కాబోతుంది. 

read more: తల లేని మనిషి కథతో ‘డాకు మహారాజ్‌’ ప్రీక్వెల్‌ ప్రకటన
also read: 'డాకు మహారాజ్' OTT లో ఎప్పుడు వస్తుంది?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image2
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image3
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved