MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'డాకు మహారాజ్' OTT లో ఎప్పుడు వస్తుంది?

'డాకు మహారాజ్' OTT లో ఎప్పుడు వస్తుంది?

బాలకృష్ణ నటించిన 'డాకూ మహారాజ్' సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాలో బాలయ్య యాక్షన్ అదిరిపోయిందని, కథ ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా ఓటిటి వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 12 2025, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


   
గత సంక్రాంతికి  2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు సరైన బజ్ క్రియేట్ కాలేదు.  ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది

కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి.  అయితే రిలీజ్ అయ్యాక బాబి...తమ హీరో బాలయ్య అదిరిపోయేలా చూపించారనే టాక్ వినిపిస్తోంది. సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి వివరాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


'డాకు మహారాజ్' సినిమాలో సీతారాం పాత్రలో బాలకృష్ణ నటించారు. ఆయనకు జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించారు. 'డాకు మహారాజ్' సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ యువ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకం‌ మీద సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. ఈ సంస్థల్లో రూపొందిన సూపర్ హిట్ సినిమాలు చాలా వరకూ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ తీసుకుంది. ఇప్పుడు కూడా ఆ సంస్థకే 'డాకు మహారాజ్' వెళ్ళటం జరిగింది.
 

35

డాకూ మహారాజ్  థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలో సినిమా వస్తుంది? అంటే...ఏ స్దాయి హిట్ అనే దానిపై ఆధారపడుతుంది అంటున్నారు. చాలా  సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో వస్తున్నాయి.

'డాకు మహారాజ్' విషయంలో కూడా అదే జరగవచ్చని అంటున్నారు. ఫిబ్రవరి రెండవ వారంలో ఈ సినిమా ఓటిటికు రావచ్చు అని తెలుస్తోంది. అయితే పెద్ద సక్సెస్ అయితే మాత్రం 45 రోజుల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది. 
 

45


చిత్రం కథ ఏంటి


కథ  1996లో జరుగుతూంటుంది. మదనపల్లి హిల్ స్టేషన్ లో   ఓ పెద్ద కోటీశ్వరుల కుటుంబం. ఆ కుటంబానికి చెందిన ఎస్టేట్ లీజుకు తీసుకుని అందులో అక్రమాలు చేస్తూంటారు  లోకల్ పొలిటీషన్ (రవికిషన్).  ఆ విషయం తెలిసి ఆ కుటుంబ పెద్ద అడ్డుపడితే ...  ఆ కుటుంబంలోని ఓ పాపని వాళ్ళు టార్గెట్ చేస్తారు.   ఆ పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒకరికి  ఫోన్ రావడంతో ఆ చిన్నారి దగ్గరకు  బాలయ్య బయిలుదేరతాడు. ప్రమాదంలో ఉందని ఫోన్ వచ్చిన ఆ పాప ఇంటిలో బాలయ్య డ్రైవర్‌గా చేరారు. తనను నానాజీగా పరిచయం చేసుకుంటాడు.  అక్కడ పాపని కంటికి రెప్పలా కాపాడుతూంటాడు. ఆ కుటంబానికి దగ్గర అవుతూంటాడు. 
 

55

 మరో ప్రక్క ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ (మలయాళ నటుడు షైన్ టామ్ చాకో)  'డాకు ఎక్కడ?' అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు. ఇక పాపను, కుటుంబాన్ని రవికిషన్ ఏమీ చెయ్యలేకపోవటంతో, వాళ్ళను  ఎలాగైనా అంతమొందించి, అక్కడ ఎస్టేట్ లో ఉన్న తమ మాల్ ని తీసుకెళ్లాలని ఠాకూర్( మెయిన్ విలన్ బాబీ డియోల్)  ఎంట్రీ ఇస్తాడు.

అప్పుడు బాబీడయోల్ కు బాలయ్య గురించిన ఓ నిజం తెలుస్తుంది. అలాగే ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ కు సైతం బాలయ్య ఎవరో తెలుస్తుంది. అతను మరవరో రాదు డాకూ మహారాజ్ అని గుర్తిస్తాడు. అసలు ఈ డాకూ మహారాజ్ ఎవరు...ఆ పాప కుటుంబానికి, అతనికి సంభందం ఏమిటి...ఆ స్దాయి వ్యక్తి ఓ డ్రైవర్ గా వాళ్ల ఇంట్లో చేరాల్సిన అవసరం ఏమిటి, బాబీ డయోల్ కు బాలయ్యకు మధ్య ఉన్న వైరం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నందమూరి బాలకృష్ణ
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రపంచాన్ని కుదిపేసిన హారర్ లవ్ స్టోరీ ఓటీటీలోకి, పండగ చేసుకోండి.. ఈ వారం రిలీజయ్యే మూవీస్ ఇవే
Recommended image2
Baahubali Facts: మొదటి రోజే 70 కోట్ల నష్టం, రాజమౌళి బాధ అంతా ఇంతా కాదు.. బాహుబలికి ఎదురైన పెను సంక్షోభం
Recommended image3
Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved