MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే

Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే

ప్రేమికుల రోజు లవ్‌ స్టోరీస్‌, కామెడీ చిత్రాలు బాగా ఆడతాయని భావిస్తారు. కానీ యాక్షన్‌ మూవీస్‌ కూడా ఆడతాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా బాలయ్య మూవీకి చుక్కలు చూపించారు రాజశేఖర్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 08 2026, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాలయ్య మూవీకి చుక్కలు చూపించిన రాజశేఖర్‌
Image Credit : Telugu stop

బాలయ్య మూవీకి చుక్కలు చూపించిన రాజశేఖర్‌

బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. పెద్ద పండుగల సమయంలో ఈ పోటీ ఎక్కువగా ఉంటుంది. అలా వాలెంటైన్స్ డే స్పెషల్‌గానూ చాలా సినిమాలు పోటీపడుతుంటాయి. ఈ వారం కూడా గట్టిపోటీ ఉంది. అయితే 2007లో ప్రేమికుల రోజు స్పెషల్‌ గా కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. అందులో రాజశేఖర్‌తో పోటీ పడి బాలయ్య సినిమా చిత్తైపోయింది. పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే కాదు, ఏకంగా మూడు సినిమాలు అడ్రస్‌ లేకుండా పోయాయి.

26
బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `ఎవడైతే నాకేంటి` మూవీ
Image Credit : prime video

బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `ఎవడైతే నాకేంటి` మూవీ

2007లో ప్రేమికుల రోజు స్పెషల్‌ వచ్చిన రాజశేఖర్‌ చిత్రం `ఎవడైతే నాకేంటి`. వి సముద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంవృతా సునీల్‌ హీరోయిన్‌గా నటించింది. రఘువరన్‌, భాను చందర్‌, కళాభవన్‌ మణి, ముమైత్‌ ఖాన్‌తోపాటు భారీ తారాగణం నటించింది. సామా చంద్రశేఖర్‌ రెడ్డి, రాజశేఖర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదలైంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌ గా వచ్చింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. చాలా రోజులుగా విజయాలు లేని రాజశేఖర్‌కి కమ్‌ బ్యాక్‌ అయ్యేలా చేసింది. అప్పటి రాజకీయాలపై సెటైరికల్‌గా రూపొందిన చిత్రమిది. ఇందులో రాజశేఖర్‌ మేజర్‌గా, రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మూవీతో పోటీ పడ్డ సినిమాల్లో ఒక్కటి తప్ప అన్ని చిత్రాలు పరాజయం చెందాయి.

Related Articles

Related image1
Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం
Related image2
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
36
డిజాస్టర్‌గా నిలిచిన బాలయ్య `మహారథి`
Image Credit : sun nxt

డిజాస్టర్‌గా నిలిచిన బాలయ్య `మహారథి`

రాజశేఖర్‌ `ఎవడైతే నాకేంటి`తో పోటీ పడ్డ చిత్రాల్లో బాలయ్య హీరోగా నటించిన `మహారథి` మూవీ కూడా ఉంది. యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి పీ వాసు దర్శకుడు. వాకాడ అప్పారావు నిర్మించారు. బాలయ్య సరసన మీరా జాస్మిన్‌, స్నేహ, నవనీత్‌ కౌర్‌ వంటి హీరోయిన్లు నటించారు. జయప్రద, నరేష్‌ కీలక పాత్రలు పోషించారు. `ఎవడైతే నాకేంటి` కంటే ముందే ఈ చిత్రం విడుదలైంది. ఫిబ్రవరి 1న దీన్ని రిలీజ్‌ చేశారు. అయితే ప్రారంభం నుంచి డల్‌గా సాగింది. నెక్ట్స్ వీక్‌ రాజశేఖర్‌ మూవీ రావడంతో, దాని దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయింది. దీంతో బాలయ్యకి పెద్ద డిజాస్టర్ పడింది.

46
వంశీ `అనుమానాస్పదం` కూడా పరాజయం
Image Credit : sun nxt

వంశీ `అనుమానాస్పదం` కూడా పరాజయం

`ఎవడైతే నాకేంటి` సినిమాతో పోటీ పడ్డ మూవీ `అనుమానాస్పదం`. వంశీ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రమిది. అర్యన్‌ రాజేష్‌, హంసా నందిని జంటగా నటించారు. ఈ మూవీ  ఫిబ్రవరి 10న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. వంశీ మూవీ అంటే మంచి అంచనాలుంటాయి. కానీ వాటిని అందుకోలేకపోయింది. రాజశేఖర్‌ మూవీకి హిట్‌ టాక్‌ రావడంతో ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

56
కల్యాణం రామ్‌ `లక్ష్మీ కల్యాణం`పై గట్టి దెబ్బ
Image Credit : sun nxt

కల్యాణం రామ్‌ `లక్ష్మీ కల్యాణం`పై గట్టి దెబ్బ

రాజశేఖర్‌ `ఎవడైతే నాకేంటి` మూవీకి వారం తర్వాత ఫిబ్రవరి 15న విడుదలైన మరో సినిమా `లక్ష్మీ కల్యాణం`. కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ జంటగా నటించగా తేజ దర్శకత్వం వహించారు. కే మహేంద్ర నిర్మించారు. ఈ మూవీ సైతం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. `ఎవడైతే నాకేంటి` ముందు తేలిపోయింది. మరీ డిజాస్టర్‌ కాకుండా ఓ మోస్తారుగా మెప్పించింది.

66
రాజశేఖర్‌ మూవీని తట్టుకొని నిలబడ్డ `మధుమాసం`
Image Credit : suresh productions

రాజశేఖర్‌ మూవీని తట్టుకొని నిలబడ్డ `మధుమాసం`

ఇక `ఎవడైతే నాకేంటి` మూవీకి పోటీగా వచ్చిన మరో సినిమా `మధుమాసం`. సుమంత్‌, స్నేహ జంటగా నటించారు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన చిత్రమిది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కింది. కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్ కావడంతో దీన్ని ఆడియెన్స్ బాగానే చూశారు. `ఎవడైతే నాకేంటి` యాక్షన్‌ఫిల్మ్, దానికి భిన్నంగా `మధుమాసం` ఉండటంతో లవర్స్‌ కి ఈ మూవీ మంచి ఛాయిస్‌గా మారింది. దీంతో ఇది కూడా బాగానే ఆడింది. కానీ ప్రేమికుల రోజు స్పెషల్‌గా వచ్చిన చిత్రాల్లో మాత్రం రాజశేఖర్‌ దే విజయం అని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఓటీటీలోకి క్రేజీ హీరో జీవా సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Recommended image2
45 రోజుల్లో 1500 కోట్ల బిజినెస్.. అంచనాలు పెంచేస్తున్న 6 పాన్ ఇండియా సినిమాలు, లిస్ట్ ఇదే
Recommended image3
కింగ్ ఖాన్ షారుక్ డ్యూయెల్ రోల్ లో నటించిన సినిమాలు ఎన్నో తెలుసా ? వాటిలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఇవే
Related Stories
Recommended image1
Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం
Recommended image2
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved