MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `డాకు మహారాజ్` ఫస్ట్ సాంగ్‌ రివ్యూ? సినిమా కూడా ఈ రేంజ్‌లో ఉంటే సంక్రాంతి బాక్సాఫీసుకి పూనకాలే

`డాకు మహారాజ్` ఫస్ట్ సాంగ్‌ రివ్యూ? సినిమా కూడా ఈ రేంజ్‌లో ఉంటే సంక్రాంతి బాక్సాఫీసుకి పూనకాలే

బాలయ్య నటిస్తున్న `డాకు మహారాజ్‌` సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. పాట మాదిరిగానే సినిమా ఉంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 14 2024, 11:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న బాలకృష్ణ సినిమాల విషయంలో రూట్‌ మార్చాడు. గత మూడు నాలుగేళ్లుగా ఆయన కొత్త పంథాని ఫాలో అవుతున్నాడు. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలతో ఆ విభిన్నతని చాటి చెప్పాడు. ఇప్పుడు మరో కొత్త కథ, సరికొత్త కథాంశంతో వస్తున్నాడు బాలయ్య.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `డాకు మహారాజ్‌` సినిమాలో నటిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్‌ కార్యక్రమాల జోరు పెంచారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా `డాకు మహారాజ్‌` సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. `ది రేజ్‌ ఆఫ్‌ డాకు` పేరుతో ఈ మొదటి పాటని విడుదల చేశారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సాంగ్‌ అదిరిపోయేలా ఉంది.  'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు.

"డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు. 
 

35

లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఆయన గుర్రంపై స్వారీ చేస్తున్నారు తీరు, యానిమేషన్‌ యాక్షన్‌ సీన్లు మతిపోయేలా ఉన్నాయి. విజువల్ గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది.
 

45

ఇందులో బాలయ్య లుక్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చేయలేదు. పీరియడ్‌, యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు బాబీ. సినిమా రేంజ్‌ ఎలా ఉంటుందో ఇటీవల ట్రైలర్‌లో చూపించారు.

ఇప్పుడు పాటలోనూ అది స్పష్టమవుతుంది. ఈ సంక్రాంతికి బాలయ్య `డాకు మహారాజ్‌`తో అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ విజువల్స్ రేంజ్‌లో సినిమా ఉంటే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పూనకాలే అని చెప్పొచ్చు. 
 

55

ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. 

read more:బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు హీరోలుగా సక్సెస్‌ కాకపోవడానికి కారణమిదే.. మాజీ రన్నరప్‌ చెప్పిన షాకింగ్‌ నిజాలు

also read: కీర్తిసురేష్‌ తల్లితో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? విలన్‌గా చేసినా సూపర్‌ హిట్‌
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్‌ చూపించిన విజయ్‌.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు
Recommended image2
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Recommended image3
OTT: ఓటీటీలో వకీల్ సాబ్ గా హీరో శ్రీకాంత్.. వంద దేవుళ్ళు, ది లెజెండ్ ఆఫ్ కర్ణతో ఈ వారం అసలైన వినోదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved