బిగ్ బాస్ కంటెస్టెంట్లు హీరోలుగా సక్సెస్ కాకపోవడానికి కారణమిదే.. మాజీ రన్నరప్ చెప్పిన షాకింగ్ నిజాలు
బిగ్ బాస్ కంటెస్టెంట్లు హీరోగా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి? ఆడియెన్స్ టేస్ట్ ఎలా ఉంటుందనేది షాకింగ్ నిజాలను బయటపెట్టాడు మాజీ రన్నరప్ అఖిల్ సార్థక్.
బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మందికి లైఫ్ ఇస్తుంది. పెద్దగా జనాలకు తెలియని వారిని కోట్లాది మందికి తెలిసేలా చేస్తుంది. ఈషో ద్వారా మామూలు వ్యక్తులు కూడా పాపులర్ అవుతారు, సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు. పల్లవి ప్రశాంత్, మణికంఠ, గౌతమ్, ఆదిరెడ్డి, టేస్టీ తేజ, అరియానా, సోనియా, సోహైల్, అఖిల్ వంటి వారే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
అయితే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీ చాలా మందికి సినిమా అవకాశాలు తీసుకొస్తుంది. మిగిలిన భాషల్లో అయితే హీరోలుగా సక్సెస్ అయ్యారు. తమిళం, హిందీలో బిగ్ బాస్ విన్నర్స్, టాప్ కంటెస్టెంట్లు హీరోగా సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు.
కానీ తెలుగులో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. సోహైల్, వీజే సన్ని, కౌశల్ వంటి వారు హీరోలుగా సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోతున్నారు. సినిమా అవకాశాలు వచ్చినా హిట్ రాకపోవడం, ఆడియెన్స్ నుంచి ఆదరణ దక్కకపోవడం ఆశ్చర్యపరుస్తుంది.
దీనిపై మాజీ బిగ్ బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్ స్పందించారు. అఖిల్ బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన షాకింగ్ నిజాలు బయటపెట్టారు. హీరోగా సక్సెస్ కాకపోవడానికి కారణం తెలిపారు. ఇతర భాషల ఆడియెన్స్ టేస్ట్ వేరు, మన ఆడియెన్స్ టేస్ట్ వేరు అన్నారు.
బిగ్ బాస్ షోలో వంద రోజులు ఒక వ్యక్తి ఏంటనేది మన ఆడియెన్స్ గమనిస్తారు, 360 డిగ్రిల్లో మనుషులను స్కాన్ చేస్తారు, ఎవరు ఏంటనేది ఓ క్లారిటీకి వస్తారు. వాళ్లు ఇంట్లో ఎలా ఉంటారో ఈ షో ద్వారా తెలుస్తుంది. వాళ్ల రియాలిటీ తెలుస్తుంది. దీంతో వారిపై ఆసక్తి తగ్గిపోతుందన్నారు అఖిల్.
ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నా చాలా మంది స్టార్స్ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు. వాళ్లవి అంతా ప్రైవేట్ లైఫ్స్. ఇంట్లో ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారనేది తెలియదు. బయటపెద్దగా కనిపించరు. అందుకే వారిపై ఆసక్తి ఉంటుంది. వారిని తెరపై చూసేందుకు ఇష్టపడతారు. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఏంటనేది తెలిసిపోవడంతో వాళ్లని హీరోగా చూడటానికి అంత ఈజీగా ఇష్టపడరు అని తెలిపారు అఖిల్.
దానికి చాలా టైమ్ పడుతుందని, ఐదేళ్లు, పదేళ్లు అయినా పట్టొచ్చు అని, నెమ్మదిగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మన స్థాయిని పెంచుకుంటూ వెళ్లాలని, తాను అదే చేస్తున్నానని, చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలిపారు. సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోస్ ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ వెళ్తున్నట్టు తెలిపారు అఖిల్.
Bigg boss telugu 8
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో తన రివ్యూ చెప్పాడు. ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశం ఎవరికి ఉందో తెలిపారు. గౌతమ్ విన్ అవుతాడని తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పాడు. ఏషియానెట్ తెలుగు ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం పంచుకున్నారు.
మరో ఇంటర్వ్యూలో చెబుతూ, నిఖిల్‌ని విన్నర్‌ని చేసే అవకాశం ఉందని చెప్పాడు. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరనేది మరో 24 గంటల్లో తేలనుంది. ఇక అఖిల్ ప్రస్తుతం `వేరే లెవల్ ఆఫీస్` అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇది `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది.
read more: కీర్తిసురేష్ తల్లితో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? విలన్‌గా చేసినా సూపర్ హిట్
also read: శోభన్‌బాబుపై అందరి ముందే అరిచిన నిర్మాత.. సెట్‌లో హీరోయిన్‌తో ఆయన చేసిన పనికి సోగ్గాడు షాక్