- Home
- Entertainment
- Chiranjeevi next movie: `పూనకాలు లోడింగ్`.. చిరంజీవి నెక్ట్స్ సినిమా టైటిల్, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్
Chiranjeevi next movie: `పూనకాలు లోడింగ్`.. చిరంజీవి నెక్ట్స్ సినిమా టైటిల్, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్
Chiranjeevi bobby movie title: మెగాస్టార్ బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలో `పూనకాలు లోడింగ్` అనే టైటిల్‌తో ఆయన సినిమా చేయబోతున్నారట.

Chiranjeevi bobby movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ శ్రీకాంత్ ఓడెలతో సినిమా ఉంటుంది. ఇది త్వరలోనే చిత్రీకరణ స్టార్ట్ కాబోతుంది. అనంతరం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు సెట్ చేశారు చిరు. అనిల్ రావిపూడితో ఓ సినిమా ఉంటుంది. అలాగే బాబీతో మరో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ని లోడ్ చేయబోతున్నారు. క్రేజీ దర్శకులతో ఆయన సినిమాలు చేయబోతున్నారు. బాలయ్య మాదిరిగానే సీనియర్లని పక్కన పెట్టి యంగ్‌డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. తనలోని వింటేజ్‌ని చూపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో చాలా వరకు వింటేజ్ చిరంజీవి కనిపించేలా రూపొందుతున్న చిత్రాలే కావడం విశేషం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర` ఈ సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతోనూ `జగదేక వీరుడు అతిలోక సుందరి` లుక్‌ని తలపించబోతున్నారు చిరు. అనంతరం శ్రీకాంత్ ఓడెల్ మూవీ పూర్తి యాక్షన్ ప్రధానంగా ఉండబోతుందట. తన ఏజ్‌కి తగ్గ రోల్ ఉంటుందని, ఇందులో హీరోయిన్ ఉండదని సమాచారం.
ఇక నెక్ట్స్ అనిల్ రావిపూడి మూవీ ఉంటుంది. ఇది ఈ ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. వచ్చే సంక్రాంతి టార్గెట్ చేసి ఈ మూవీని రూపొందించాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించారు. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా చేస్తే, అది సంక్రాంతికి వస్తే ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో ఇటీవల వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా నిరూపించింది.
ఇది ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు చిరంజీవితో `ఘరానా మొగుడు`, `గ్యాంగ్ లీడర్` లాంటి సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు అనిల్. చిరులోని పూర్తి ఎంటర్టైన్‌మెంట్ చూపిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించాలనుకుంటున్నారు అనిల్ రావిపూడి. ఆ యాంగిల్‌లోనే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.
ఈ మూవీ అనంతరం మరో బ్లాక్ బస్టర్ కాంబోని రిపీట్ చేయబోతున్నారు. రెండేళ్ల క్రితం బాబీతో చేసిన `వాల్తేర్ వీరయ్య` మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ సుమారు రూ. 220కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దాన్ని మించిన మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి మూవీ పూర్తయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకి అదిరిపోయే టైటిల్ అనుకుంటున్నారట. `పూనకాలు లోడింగ్` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఈ మూవీని నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ టైటిల్‌ని ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారట. అది చిరుకోసమే అని తెలుస్తుంది.
ఎందుకంటే `వాల్తేర్ వీరయ్య`లో పూనకాలు లోడింగ్ పేరుతో పాట ఉంటుంది. అది బాగా ఆదరణ పొందింది. కాబట్టి అదే టైటిల్‌ని బాబీ, చిరుల సినిమాకి పెట్టబోతున్నారని సమాచారం. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి చిరు కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారట.