'అఖండ': ఆ రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు

 నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ  అఖండ. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

Akhanda benefit shows in two theaters in Telangana

బాలకృష్ణ(Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అఖండ'(Akhanda) చిత్రం రేపు (డిసెంబరు 2) విడుదల కానున్న సంగతి తెలిసిందే.  శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక  రెండు థియేటర్లలో 'అఖండ' చిత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో 'అఖండ' బెనిఫిట్ షోలకు ఆమోదం లభించింది.

Akhanda' చిత్రంలో బాలకృష్ణ ఆఘోరాగా నటించడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ స్వరపరిచిన పాటలు ప్రజాదరణ పొందాయి. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా అన్ని ఏరియాలకు కలిపి భారీ రేంజ్‌లో బిజినెస్ చేసినట్టు సమాచారం. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న భారీ యాక్షన్ చిత్రం కావడం.. పైగా బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఉన్నాయి.

నిర్మాత మాట్లాడుతూ...అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు టైటిల్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకృతి వాటిపై రియాక్ట్ అవుతుంటారు. అలాంటి కారెక్టర్ రావడం, సమస్యలను పరిష్కరించడమనేది కథ. బోయపాటి గారి కెరీర్‌లో, బాలకృష్ణ గారి కెరీర్‌లో ఇంత వరకు ఇన్ని స్క్రీన్లలో విడుదలైన సినిమా మరొక్కటి లేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో అఖండ రావొచ్చు. ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. మెల్‌బోర్న్‌లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటకే ఫుల్ అయిపోయాయి అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios