Allu Arjun: `మెగా` కాదు, `అల్లు`నే ఫస్ట్.. ఎన్టీఆర్‌తో పోల్చడం వెనకాల బన్నీ ఉద్దేశ్యం అదేనా?
అల్లు అర్జున్, అల్లు అరవింద్ బ్యాక్ టూ బ్యాక్ నందమూరి ఫ్యామిలీ గురించి, ఎన్టీఆర్ గురించి, అల్లు రామలింగయ్య గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ తరం నుంచి అల్లు వారి ఫ్యామిలీ ఉందనే విషయాన్ని, ఎన్టీఆర్‌కి అల్లు రామలింగయ్య సమకాలీకులు అనే విషయాన్ని చెబుతున్నారు.
అల్లు అర్జున్(Alliu Arjun) నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన బాలకృష్ణ `అఖండ`(Akhanda) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాలయ్యపై, నందమూరి ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `నందమూరి ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఇప్పటిది కాదు. ఎన్టీ రామారావు, మా తాత అల్లు రామలింగయ్య గార్ల నుంచి మా మధ్య రిలేషన్ ఉంది. మా తాతగారికి ఎన్టీఆర్ విసయంలో ఎంతో చనువు ఉండేది. వాళ్ల వంటింటికి వెళ్లిపోయేవారు. మా నాన్న అల్లు అరవింద్, బాలకృష్ణగార్లు ఒకేసారి కెరీర్‌ని ప్రారంభించారు. నేను చిరంజీవి, బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి బాలయ్య సినిమా ఫంక్షన్‌కి, నా ఫాదర్ లాంటి వ్యక్తి సినిమాకి నేను గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది` అని చెప్పారు బన్నీ.
ఇదే విషయాన్ని బాలయ్య సైతం మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడే కాదు, `ఆహా`లో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్` షో ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లలోనూ బాలకృష్ణ, అటు అల్లు అరవింద్.. సైతం తమ ఫ్యామిలీల మధ్య ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్, అల్లు రామలింగయ్యలు ఎంత చనువుగా ఉండేవారో వెల్లడించారు. అల్లు ఫ్యామిలీ ఆ తరం నుంచి ఇండస్ట్రీలో ఉందనే విషయాన్ని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఇప్పుడు దాన్ని పరోక్షంగా ఐకాన్ స్టార్ కూడా వెల్లడించడం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
ఇక్కడ మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. గతంలో తన సినిమాల ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేస్తూ జై పవర్‌స్టార్ అనిపించే ప్రయత్నం చేయగా, `చెప్పను బ్రదర్` అంటూ అసహనం వ్యక్తం చేశారు బన్నీ. ఇదే పరిస్థితి రెండు మూడు సార్లు ఎదురైంది. తనకు చిరంజీవి అంటే ఇష్టమని, ఆ తర్వాత రజనీకాంత్‌ని ఇష్టపడతానని తెలిపారు బన్నీ. కానీ `అఖండ` ఈవెంట్‌లో మాత్రం బాలయ్య అభిమానుల కోరిక మేరకు చివరల్లో `జై బాలయ్య` అన్నారు. దీంతో ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది.
అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యల వెనకాల మరో అర్థం దాగుందని అంటున్నారు క్రిటిక్స్. సోషల్ మీడియాలోనూ కొత్త వాదన మొదలైంది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి పక్కకి జరుగుతున్నారని, మెగా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్‌ని ఇక మోయకూడదని నిర్ణయించుకుంటున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. అది బన్నీ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారని. మెగా ఇమేజ్‌ని నుంచి బయటపడి తనే సొంతంగా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నారట.
ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై అయినా మరో ఎత్తు అనేలా, ఇకపై కొత్త అల్లు అర్జున్‌ని చూస్తారని, తనను నెక్ట్స్ లెవల్ సినిమాలు వస్తాయని బన్నీ `అల వైకుంఠపురములో` ఏడాది సెలబ్రేషన్ మీట్‌లో వెల్లడించారు. అందులో భాగంగా `మెగా`కి అతీతంగా తను కూడా స్వతహాగా ఓ `మెగా` బ్రాండ్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగా ఇప్పుడు వరుసగా బన్నీ ఇతర సినిమాల ఈవెంట్లకి గెస్ట్ గా వెళ్తున్నారు. వాటిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా టైమ్ కేటాయించి మరీ ఇతర సినిమాల ఈవెంట్లకి గెస్ట్ గా వెళ్లడం ఇప్పుడు అదే చర్చకి తెరలేపుతుంది.
ఒకప్పుడుగానీ, ఇప్పుడుగానీ చిరంజీవి చాలా వరకు అడిగిన సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అదే మాదిరిగా బన్నీ సైతం నెక్ట్స్ ఆ ఇమేజ్‌ని తీసుకోవాలని భావిస్తున్నట్టు
తెలుస్తుంది. అందులో భాగంగా పిలిచిన ప్రతి ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే బన్నీ కేవలం తన సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే వెళ్తున్నారని, `ఆహా` ఓటీటీతో బాలయ్యతో ఏర్పడిన అనుబంధం నేపథ్యంలోనే `అఖండ` ఈవెంట్‌కి వెళ్లారని, అంతకు మించి అందులో మరో ఉద్దేశం లేదని మెగా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న వాదన. ఇండస్ట్రీలో ఇలాంటి సపోర్టింగ్ అనేది సర్వసాధారణంగా జరుగుతుందని, అందులో ప్రత్యేకత ఏం లేదని అంటున్నారు. అదే సమయంలో మెగా ఫ్యామిలీతో బన్నీకి రిలేషన్ కంటిన్యూనే అవుతుందని, ఇటీవల దీపావళి సందర్భంగానూ అది నిరూపితమైందని, అవసరమైనప్పుడు మెగాఫ్యామిలీ కలిసే ఉంటుందంటున్నారు.
also read: Akhanda: ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత బాలయ్యనే: బన్నీ ప్రశంసలు.. రెండు రాష్ట్రాలకు బాలకృష్ణ రిక్వెస్ట్