- Home
- Entertainment
- టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ మిస్సయినట్లేనా, అఖండ 2 రిలీజ్ వాయిదా ? పవన్ ఓజికి లైన్ క్లియర్
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ మిస్సయినట్లేనా, అఖండ 2 రిలీజ్ వాయిదా ? పవన్ ఓజికి లైన్ క్లియర్
బాలయ్య అఖండ 2, పవన్ ఓజి చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కానుండడంతో బిగ్గెస్ట్ క్లాష్ తప్పదని అనుకున్నారు. కానీ తాజాగా అఖండ 2 రిలీజ్ డేట్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

అఖండ చిత్రం సాధించిన భారీ విజయం తర్వాత బాలయ్య, బోయపాటి ఆ చిత్ర సీక్వెల్ కి శ్రీకారం చుట్టారు. 2021లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న అఖండ చిత్రానికి అఖండ 2 సీక్వెల్ గా రూపొందుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
అఖండ 2 రిలీజ్ కి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం వైరల్ అవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించారు. ఇదే తేదీన పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం OG కూడా విడుదల కానుంది. అయితే తాజా బజ్ ప్రకారం, అఖండ 2 విడుదల వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తికాలేదు అని తెలుస్తోంది. అంతేకాక, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరం అవసరం అవుతోందని సమాచారం. దాంతో చిత్రబృందం రిలీజ్ తేదీని మారుస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేదానిపై అధికారిక సమాచారం లేదు. కానీ అఖండ తరహాలోనే అఖండ 2 డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఇదే కనుక జరిగితే పవన్ ఓజి చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లే. పవన్ ఓజి చిత్రం సోలోగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిరంజీవి విశ్వంభర చిత్రం కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఆ మూవీ కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటు అఖండ 2, అటు ఓజి రెండు చిత్రాలపై అభిమానుల్లో కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఏదో ఒక చిత్రానికి నష్టం తప్పదని ఇండస్ట్రీలో చర్చ జరిగింది. ఇప్పుడు అఖండ 2 వాయిదా పడుతున్నట్లు వార్తలు రావడంతో బిగ్గెస్ట్ క్లాష్ తప్పింది అని అంటున్నారు.