- Home
- Entertainment
- `బాహుబలి` మళ్లీ థియేటర్లోకి.. రెండు కలిపి ఒకే మూవీగా, స్ట్రెయిట్ సినిమాని తలపించే రేంజ్‌లో రిలీజ్
`బాహుబలి` మళ్లీ థియేటర్లోకి.. రెండు కలిపి ఒకే మూవీగా, స్ట్రెయిట్ సినిమాని తలపించే రేంజ్‌లో రిలీజ్
`బాహుబలి` రెండు పార్ట్ లుగా వచ్చి ఆకట్టుకుంది. సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి ఒకే చిత్రంగా విడుదల చేస్తే. ఇప్పుడే అదే జరుగుతుంది.

భారతీయ సినిమా లెక్కలు మార్చేసిన `బాహుబలి`
దర్శక ధీరుడు రాజమౌళి క్రియేటివిటీ నుంచి పుట్టిన కళాఖండం `బాహుబలి`. తెలుగు సినిమా దశ దిశని మార్చేసిన మూవీ ఇది. ఇండియన్ సినిమా లెక్కలను మార్చిన మూవీ కూడా ఇదే.
పాన్ ఇండియా పేరుతో వచ్చి భాషల మధ్య బౌండరీలను బ్రేక్ చేసింది. సినిమాకి పరిమితులు లేవని చాటి చెప్పింది. `బాహుబలి` మూవీ ఎన్నో చిత్రాలకు కొత్త దారి చూపించింది.
ఎంతో మంది మేకర్స్ ధైర్యాన్నిచ్చింది. డేర్‌గా ముందుకు వెళ్లొచ్చనే భరోసా ఇచ్చింది. మొత్తంగా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
`బాహుబలి` సినిమా ఆడియెన్స్ ముందుకు
`బాహుబలి` మొదటి భాగం 2015లో విడుదల కాగా, రెండో భాగం 2017లో విడుదలైంది. సెకండ్ పార్ట్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ రూ.1800కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డులకు కాలం చెందుతుంది. కొత్త చిత్రాలు ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
అక్టోబర్ 31న `బాహుబలి ఎపిక్`
ఇటీవల రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. గతంలో సూపర్ హిట్ సాధించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. చాలా సినిమాలు ఆడియెన్స్ అని అలరిస్తున్నాయి.
ఇప్పుడు `బాహుబలి`ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే `బాహుబలి 1`, `బాహుబలి 2` రెండు కలిపి ఒకే చిత్రంగా విడుదల చేయబోతున్నారు. రీ ఎడిట్ చేసి రెండు పార్ట్ లను కలిపి ఒకే చిత్రంగా మలుస్తున్నారట.
దీనికి `బాహుబలి ఎపిక్`గా కొత్త పేరు పెడుతున్నారట. ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 31న రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.
రెండు పార్ట్ లు కలిపి ఒకే చిత్రంగా `బాహుబలి`
అయితే ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నైజాం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆంధ్రా,కర్నాటక వారాహి పిక్చర్స్ వాళ్లు, నార్త్ ఇండియా, కొన్ని విదేశాల్లో ఏఏ ఫిల్స్ ఇండియా,
నార్త్ అమెరికాలో డైలన్ మర్చెట్టి, వేరియన్స్ ఫిల్మ్స్, ఫ్రాన్స్ లో కార్లోట్టా ఫిల్మ్స్, జపాన్‌లో మూవీ ట్విన్ 2 వంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు `బాహుబలి ఎపిక్`ని విడుదల చేయబోతున్నారు. ఒక స్ట్రెయిన్ మూవీలా దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతుండటం విశేషం.
ఆడియెన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న `బాహుబలి ఎపిక్` టీమ్
ఇది ఆడియెన్స్ కి పెద్దట్రీట్ అనే చెప్పాలి. రెండు సినిమాలను ఒకేసారి, ఒకే చిత్రంగా విడుదల చేయడం విశేషంగా చెప్పొచ్చు. దీనిపై క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
మరి ఈ మూవీ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. అదే ఆదరణ దక్కితే ఇది భారీ వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉంది. రీ రిలీజ్‌కి సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఇక రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్య రాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల మరోసారి కలుసుకున్నారు. సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగానే ఈ మూవీ థియేటర్ రిలీజ్‌ని కన్ఫమ్ చేశారట.

