కొత్త కారు కొన్న ఏ.ఆర్.రెహమాన్ , కాస్ట్ ఎంతో తెలుసా?
ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ కొత్త కారు కొన్నారు. తన లగ్జరీ కారుకు సబంధించిన ఫోటోలతో పాటు వివరాలను ఆయన తన సోషల్ మీడియాలో శేర్ చేశారు. ఇంతకీ రెహమాన్ కొన్న కారు ఏంటి? దాని కాస్ట్ ఎంతో తెలుసా?

సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, ఇలా మల్టీ టాలెంట్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్ళిన వ్యక్తి ఏ.ఆర్. రెహమాన్. భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమాలో కూడా పేరు గాంచిన వ్యక్తి. ఇండియాన్ సినిమాతో పాటు అంతర్జాతీయ సినిమాల్లో అడుగుపెట్టారు రెహమాన్.
Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
థగ్ లైఫ్ సినిమా పాట:
ఒక సినిమాకి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారంటే ఆ పాట మాత్రమే కాదు, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చాలా మంది దర్శకులు, నిర్మాతలు నమ్ముతారు. 'రోజా' సినిమా నుండి 'థగ్ లైఫ్' సినిమా వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద వివాదాన్ని సృష్టించారు. జూన్ 5న విడుదల కానున్న థగ్ లైఫ్ సినిమాకి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.
జింగుచా పాట:
ఈ సినిమాలోని 'జింగుచా' అనే పాట, మొదటి సింగిల్ ట్రాక్‌గా విడుదలై సోషల్ మీడియాలో అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. కొద్ది రోజుల క్రితం, తమిళ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తమిళ భాషకు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించనున్నట్లు రెహమాన్ ప్రకటించారు. తమిళ భాషపై అంత ఇష్టం కలిగిన వ్యక్తి ఏఆర్ రెహమాన్.
ఏ.ఆర్. రెహమాన్ కొత్త కారు
తాజాగా రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో కొత్త కారుతో ఆయన కనిపించార. కొత్త Mahindra XUV900 ఎలక్ట్రిక్ కారును తను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఎరుపు రంగులో ఉన్న ఈ కారు ధర 30 లక్షల వరకు ఉంటుందని అంచనా.