MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Baashha: బాషాలోని సూపర్ హిట్ పాటను రిజెక్ట్ చేసిన రజనీకాంత్‌.. డైరెక్టర్‌ భార్య మాట విని ఏం చేశాడంటే?

Baashha: బాషాలోని సూపర్ హిట్ పాటను రిజెక్ట్ చేసిన రజనీకాంత్‌.. డైరెక్టర్‌ భార్య మాట విని ఏం చేశాడంటే?

Baashha: 'బాషా' సినిమాలో సూపర్‌ హిట్‌ సాంగ్‌ని రజనీకాంత్ వద్దన్నారు. కానీ, డైరెక్టర్ పట్టుబట్టడంతో ఆ పాటను సినిమాలో పెట్టి, అది సూపర్ హిట్ అయింది. ఆ పాటేంటి? దాని వెనుక ఉన్న కథేంటి? అనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇండస్ట్రీ రికార్డులు తిరగదాసిన `బాషా` మూవీ
Image Credit : our own

ఇండస్ట్రీ రికార్డులు తిరగదాసిన `బాషా` మూవీ

1995లో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'బాషా' సినిమా అప్పట్లోనే తమిళ ఇండస్ట్రీలో కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. తెలుగులో కూడా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రజనీకాంత్ మాస్ యాక్షన్ హీరోగా అదరగొట్టారు. ఈ చిత్రంలో నగ్మా, విజయకుమార్, జనకరాజ్, శరణ్ రాజ్ లాంటి వాళ్లు ముఖ్య పాత్రలు పోషించారు. దేవా సంగీతం అందించిన పాటలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.

27
డాన్ గా రజనీకాంత్‌.. ఆడియెన్స్ కి పూనకాలు
Image Credit : stockPhoto

డాన్ గా రజనీకాంత్‌.. ఆడియెన్స్ కి పూనకాలు

ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. మొదట మామూలు మనిషిలా కనిపించే హీరో, ఆ తర్వాత పవర్‌ఫుల్ డాన్‌గా మారడమే. ఫస్టాఫ్‌లో ఆటో డ్రైవర్‌గా సైలెంట్‌గా ఉండే హీరో, సెకండాఫ్‌లో తన అసలు స్వరూపాన్ని చూపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, గెటప్ ఈ సినిమాను ఒక మాస్టర్‌పీస్‌గా నిలబెట్టాయి.

Related Articles

Related image1
బాలకృష్ణ క్లాప్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిరంజీవి.. బిగ్గర్‌ దెన్ బచ్చన్‌ని చేసిన మూవీ ఏంటంటే?
Related image2
Peddi Cast Remuneration: పెద్ది మూవీ ఆర్టిస్ట్‌ ల పారితోషికాలు
37
ఒక్క డైలాగ్ తో సినిమా మరో లెవల్‌
Image Credit : twitter

ఒక్క డైలాగ్ తో సినిమా మరో లెవల్‌

"నేను ఒక్కసారి చెప్తే.. వంద సార్లు చెప్పినట్టు" లాంటి డైలాగులు ఇప్పటికీ పాపులరే. ఈ డైలాగే సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లింది. 'బాషా' సినిమాకు మరో పెద్ద బలం దేవా అందించిన సంగీతం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు "స్టైలు స్టైలు రా", "తంగమగన్", "ఆటో చూడు` లాంటి పాటలన్నీ ఊర్లన్నీ ఊపేశాయి.

47
పాట వెనక స్టోరీ
Image Credit : twitter

పాట వెనక స్టోరీ

అయితే ఈ సినిమాలో ఓ పాపులర్ సాంగ్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని డైరెక్టర్ సురేష్ కృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. "నీ నడంతల్ నడై అళగు" (తెలుగులో 'నువ్వు నడిస్తే నడకల రాణి') పాట రికార్డింగ్ పూర్తయ్యాక, దాన్ని సినిమాలో పెట్టాలా వద్దా అనే కన్ఫ్యూజన్ వచ్చిందట.

57
పాటని రిజెక్ట్ చేసిన రజనీకాంత్‌
Image Credit : SRI SATHYA SAI

పాటని రిజెక్ట్ చేసిన రజనీకాంత్‌

ఒకరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు బ్రేక్‌లో డైరెక్టర్, రజనీకాంత్ ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్ దేవా స్టూడియోకి వెళ్లి రికార్డ్ చేసిన పాటను విన్నారట. పాట ట్యూన్, రిథమ్ అందరినీ ఆకట్టుకున్నాయి. అక్కడ ఉన్నవాళ్లంతా పాటను మెచ్చుకున్నారు. కానీ, ఊహించని విధంగా రజనీకాంత్ ఆ పాటను సినిమాలో పెట్టొద్దని చెప్పారట.

67
రజనీ నిర్ణయంపై దేవా అప్‌సెట్‌
Image Credit : Asianet News

రజనీ నిర్ణయంపై దేవా అప్‌సెట్‌

సినిమాలో ఇప్పటికే రెండు డ్యూయెట్ సాంగ్స్ ఉన్నాయని, ఇంకో పాట పెడితే కథ ఫ్లో దెబ్బతింటుందని రజనీ చెప్పారట. అందుకే ఈ పాటను కేవలం ఆడియో రూపంలో రిలీజ్ చేద్దామని అన్నారట. రజనీకాంత్ ఈ నిర్ణయం చెప్పగానే దేవా చాలా అప్సెట్ అయ్యారు.

77
దర్శకుడి భార్య మాటకి ప్రయారిటీ ఇచ్చిన రజనీకాంత్‌
Image Credit : Asianet News

దర్శకుడి భార్య మాటకి ప్రయారిటీ ఇచ్చిన రజనీకాంత్‌

కానీ డైరెక్టర్ సురేష్ కృష్ణ మాత్రం ఆ పాట సినిమాకు చాలా ముఖ్యమని, కచ్చితంగా పెట్టాలని బలంగా నమ్మారట. ఈ విషయం రజనీకి ఎలా చెప్పాలో తెలియక ఆయన టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతుంటే, రజనీకాంత్ గమనించి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సురేష్ కృష్ణ భార్యను అడిగారట. ఆమె ఈ పాట ఉండాలని తన కోరిక చెప్పడంతో, రజనీ ఆమె మాటకు విలువిచ్చి ఓకే చెప్పి ఆ పాటలో నటించారు. ఆ తర్వాత ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
Recommended image2
Brahmastra 2: వార్ 2 డైరెక్టర్ మరో భారీ ప్లాన్, ఈ మీటింగ్‌తో పెరిగిన ఊహాగానాలు
Recommended image3
VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
Related Stories
Recommended image1
బాలకృష్ణ క్లాప్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిరంజీవి.. బిగ్గర్‌ దెన్ బచ్చన్‌ని చేసిన మూవీ ఏంటంటే?
Recommended image2
Peddi Cast Remuneration: పెద్ది మూవీ ఆర్టిస్ట్‌ ల పారితోషికాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved