MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Simbu Marriage Prediction: శింబు పెళ్లిపై జ్యోతిష్యురాలు సంచలన కామెంట్స్.. అభిమానుల్లో ఆందోళన

Simbu Marriage Prediction: శింబు పెళ్లిపై జ్యోతిష్యురాలు సంచలన కామెంట్స్.. అభిమానుల్లో ఆందోళన

Simbu Marriage Prediction: పదేళ్ల క్రితమే అనిరుధ్ పెళ్లి గురించి కచ్చితంగా చెప్పిన జ్యోతిష్యురాలు జయశ్రీ.. ఇప్పుడు హీరో శింబు పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 24 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శింబు మ్యారేజ్‌ జోస్యం
Image Credit : X

శింబు మ్యారేజ్‌ జోస్యం

తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న శింబు పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో ప్రముఖ జ్యోతిష్యురాలు జయశ్రీ.. శింబు మ్యారేజ్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అనిరుధ్‌, కావ్య ల పెళ్లి వేళ.. జ్యోతిష్యురాలి కామెంట్స్ వైరల్‌
Image Credit : X

అనిరుధ్‌, కావ్య ల పెళ్లి వేళ.. జ్యోతిష్యురాలి కామెంట్స్ వైరల్‌

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు కావ్య మారన్‌ల పెళ్లి నవంబర్ 11న జరగనుంది. అయితే, అనిరుధ్ భార్య ఎలా ఉండబోతోందో జ్యోతిష్యురాలు జయశ్రీ చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. ఆమె చెప్పిన లక్షణాలు కావ్య మారన్‌కు సరిపోవడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే శింబు పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

36
శింబు వరుస బ్రేకప్‌లు
Image Credit : instagram/silambarasantrofficial

శింబు వరుస బ్రేకప్‌లు

తమిళ ఇండస్ట్రీలో శింబు లవ్ స్టోరీల గురించి అందరికీ తెలిసిందే. మొదట నయనతారతో ప్రేమలో ఉన్న ఆయన.. ఆమెనే పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, మనస్పర్థలతో వాళ్లు విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ హన్సికతో ప్రేమలో పడ్డారు. వీళ్లు తమ ప్రేమను అఫీషియల్‌గా చెప్పడంతో పెళ్లి పక్కా అనుకున్నారు. శింబు తండ్రి టి.రాజేందర్ కూడా ఈ పెళ్లి కోసం వెయిట్ చేశారు. కానీ, ఆ ప్రేమ కూడా పెళ్లి పీటలు ఎక్కలేదు. వరుస బ్రేకప్స్ తర్వాత శింబు ఆధ్యాత్మికత వైపు మళ్లారు. తన ఆరోగ్యం, సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.

46
సెకండ్‌ ఇన్నింగ్స్ లో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన శింబు
Image Credit : Asianet News

సెకండ్‌ ఇన్నింగ్స్ లో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన శింబు

సెకండ్ ఇన్నింగ్స్‌లో 'మానాడు', 'వెందు తణిందదు కాడు' లాంటి సినిమాలతో శింబు సూపర్ హిట్స్ కొట్టారు. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన 'థగ్ లైఫ్' మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్‌లో 'అరసన్' అనే సినిమా చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దీని తర్వాత అశ్వత్ మారిముత్తు డైరెక్షన్‌లోనూ నటించనున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న 43 ఏళ్ల శింబు.. తన పెళ్లిపై మాత్రం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

56
శింబు పెళ్లిపై సంచలన జోస్యం
Image Credit : Instagram

శింబు పెళ్లిపై సంచలన జోస్యం

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిష్యురాలు జయశ్రీ.. శింబు మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడారు. పెళ్లిళ్లలో రెండు రకాలు ఉంటాయని, ఒకటి పెద్దలు కుదిర్చిన వివాహం కాగా, రెండోది గాంధర్వ వివాహం అని ఆమె చెప్పారు. గాంధర్వ వివాహం అంటే ఎవరికీ తెలియకుండా ఇద్దరు వ్యక్తులు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడం అని వివరించారు. శింబు ఎక్కువగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండే ఛాన్స్ ఉందని, ఆయనకు సాధారణ పద్ధతిలో పెళ్లి జరగదని ఆమె జోస్యం చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు శింబు ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్నాయి.

66
శింబు పెళ్లి గురించే ఇప్పుడంతా చర్చ
Image Credit : X

శింబు పెళ్లి గురించే ఇప్పుడంతా చర్చ

పదేళ్ల క్రితం అనిరుధ్ పెళ్లి గురించి జయశ్రీ చెప్పిన మాటలు ఇప్పుడు నిజం కావడంతో.. శింబు గురించి ఆమె చెప్పిన జోస్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చాలా కాలంగా బ్యాచిలర్‌గా ఉన్న నటుడు ప్రేమ్‌జీ అమరన్ కూడా రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. దీంతో శింబు పెళ్లి ఎప్పుడనే ప్రశ్న అభిమానుల్లో అలాగే ఉండిపోయింది. జయశ్రీ చెప్పింది నిజమవుతుందేమో అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇది కేవలం జ్యోతిష్యురాలి అంచనా మాత్రమే. తన పెళ్లిపై శింబునే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. సినిమాల్లో వరుస హిట్స్ కొడుతున్న ఎస్‌టీఆర్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fauzi Teaser: ప్రభాస్ వింటేజ్ లుక్ అదిరింది.. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్పైగా డార్లింగ్!
Recommended image2
Garividi Lakshmi 7 Days Collections: గరివిడి లక్ష్మి మూవీకి హిట్‌ టాక్‌, కలెక్షన్లు మాత్రం రివర్స్.. కారణం ఇదే
Recommended image3
Ranabaali Collections: పడిపోతున్న రణబాలి కలెక్షన్స్, విజయ్ దేవరకొండ సినిమా 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 7వ వారం ఓటింగ్‌.. డేంజర్‌లో ఉన్నది వీళ్లే, టాప్‌ ఎవరంటే?
Recommended image2
Top 10 Heroines: టాప్‌కి దూసుకొచ్చిన రష్మిక, పడిపోయిన సాయిపల్లవి, నయనతార.. సమంత, కాజల్‌, త్రిష స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved