- Home
- Entertainment
- Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 7వ వారం ఓటింగ్.. డేంజర్‌లో ఉన్నది వీళ్లే, టాప్ ఎవరంటే?
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 7వ వారం ఓటింగ్.. డేంజర్‌లో ఉన్నది వీళ్లే, టాప్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 10.. 7వ వారం ఓటింగ్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్‌లో ఉన్నారనేది చూస్తే, షాకింగ్ రిజల్ట్ కనిపిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఓటింగ్ రిజల్ట్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. హోస్ట్ నాగార్జున ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఈ సీజన్ చాలా ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. ఆటలు కూడా కొత్తగా ఉంటున్నాయి. టాస్క్ లు విభిన్నంగా ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లతో రన్ అవుతుంది. ప్రస్తుతం ఏడో వారం రన్ అవుతుంది. మరి ఈ వారంలో ఎవరు నామినేషన్‌లో ఉన్నారు? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారనేది చూస్తే.
ఏడో వారం నామినేషన్‌లో ఉన్నది వీరే
బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, స్వేతా నాయుడు, వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆరో వారం షాలిని సీక్రెట్ రూమ్‌కి వెళ్లింది. ఆమె మళ్లీ హౌజ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ఏడో వారం ఎలిమినేషన్ ఒక్కరే అవుతారా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
టాప్‌లో ఉన్నది వీరే
ఈ క్రమంలో ప్రస్తుతం అనధికారికంగా పలువురు బిగ్ బాస్ లవర్స్ నిర్వహించిన ఓటింగ్ రిజల్ట్ బయటకు వచ్చింది. ఎప్పటిలాగానే రోహిత్ టాప్‌లో ఉన్నాడు. అతనికి దాదాపు ముప్పై శాతం ఓటింగ్ పడుతుండటం విశేషం. ఆ తర్వాత త్రిగుణ్ ఉన్నారు. టాప్‌లో వీరిద్దరి మధ్యనే పోటీ నెలకొంది. ప్రతి వారం ఈ ఇద్దరు టాప్‌లో కొనసాగుతున్నారు. ఏడో వారం ఓటింగ్‌లో రామకృష్ణ ఆ తర్వాత స్థానంలో కనిపిస్తున్నాడు. అమన్, సింగర్ ఝాన్సీ, వర్షిణి, సుధీర్, టెంపర్ వంశీ మిడిల్‌లో ఉన్నారు.
డేంజర్‌లో ఉన్నది ఎవరంటే?
స్వేత నాయుడు, నీతూ నటరాజ్, దక్షి, శివకుమార్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. మెయిన్‌గా నీతూ మాస్టర్, దక్షి, శివ, స్వేత నాయుడు ప్రమాదకరంలో ఉన్నారు. అయితే నీతూ మాస్టర్ ఈ వారం టాస్క్ ల ద్వారా సేవ్ అయినట్టు తెలుస్తోంది. ఆమె ఈ వారమే కాదు, వచ్చే వారం కూడా నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యిందట. ఈ నేపథ్యంలో దక్షి, శివకుమార్, శ్వేతా నాయుడు మధ్యనే ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మూడు డబుల్ ఎలిమినేషన్లకి ఛాన్స్
ఇక సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైన `బిగ్ బాస్ తెలుగు 10`లో ప్రస్తుతం రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణ, టెంపర్ వంశీ, సింగర్ ఝాన్సీ, వర్షిణి, సుధీర్, శివ, దక్షి, నీతూ మాస్టర్, స్వేతా నాయుడు, రామ్ ప్రసాద్, నరేష్, ముఖేష్ గౌడ, దేబ్జానీ, షాలిని ఉన్నారు. దాదాపు 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారంతో కలిపి ఇంకా తొమ్మిది వారాలే ఉన్నాయి. టాప్ 5కి ఐదుగురు మాత్రమే వెళ్తారు. ఈ లెక్కన 9 వారాల్లో 12 మంది ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అందులో భాగంగా మూడు వారాలు డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

