- Home
- Entertainment
- వామ్మో వాయ్యో.. ఫస్ట్ మాస్ సాంగ్ ఇదే, రెస్పాన్స్ కి గాల్లో తేలిపోతున్న ఆషిక.. క్రేజీ ఫోటోస్ వైరల్
వామ్మో వాయ్యో.. ఫస్ట్ మాస్ సాంగ్ ఇదే, రెస్పాన్స్ కి గాల్లో తేలిపోతున్న ఆషిక.. క్రేజీ ఫోటోస్ వైరల్
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిత్రాలలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW) చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రంలోని వామ్మో వాయ్యో సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ పై హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్రేజీ కామెంట్స్ చేశారు.

సంక్రాంతి సినిమాలు
ఈ సంక్రాంతికి ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మాస్ మహారాజ్ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW), నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల తర్వాత రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సౌండ్ బాగా వినిపిస్తోంది.
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW) మూవీ
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన వామ్మో వాయ్యో అనే మాస్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీత దర్శకుడు. ఊర మాస్ బీట్ తో ఉన్న ఈ పాటలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ గ్లామర్ ప్రదర్శిస్తూ డ్యాన్స్ తో రెచ్చిపోయారు.
వామ్మో వాయ్యో సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్
దీనితో ఈ పాటకి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కుతున్నాయి. వామ్మో వాయ్యో సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ తో హీరోయిన్ ఆషిక రంగనాథ్ గాల్లో తేలిపోతోంది. ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో వామ్మో వాయ్యో సాంగ్ లొకేషన్ ఫోటోలని అభిమానులతో పంచుకుంది.
ఆషికకి ఫస్ట్ మాస్ సాంగ్ ఇదే
ఆషిక తన పోస్ట్ లో.. తెలుగులో నాకు తొలి మాస్ సాంగ్ ఇదే. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో అనారోగ్యంతో ఉన్నప్పటికీ వెనకడుగు వేయలేదు. ఎంతో కష్టపడి మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేశాను. ఈ సాంగ్ కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టం మొత్తం వర్త్ అని అనిపిస్తోంది.
థ్యాంక్యూ చెప్పిన ఆషిక
మీ అందరి ప్రేమకి థాంక్యూ. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్, ఆయన టీం కి థ్యాంక్స్. రవితేజ, డింపుల్ హయతితో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతగానో ఎంజాయ్ చేశాను అని ఆషిక పోస్ట్ చేసింది.
BMW సెట్స్ లో చిరంజీవి
ఈ సాంగ్ షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి సెట్స్ లో సందడి చేశారు. ఆ దృశ్యాలని కూడా ఆషిక పోస్ట్ చేసింది. ఆషిక చిరంజీవితో కలిసి విశ్వంభర మూవీలో నటిస్తోంది.

