MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: నిజం తెలుసుకొని షాకైన బామ్మ.. ఆర్య ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Prema Entha Madhuram: నిజం తెలుసుకొని షాకైన బామ్మ.. ఆర్య ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కారణం తెలియకుండా తనకి దూరమైన భార్యాపిల్లల కోసం తపన పడుతున్న  ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : Jun 08 2023, 07:33 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

ఎపిసోడ్ ప్రారంభంలో ఇక వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతాడు ఆర్య. వెళ్లలేక వెళ్లలేక పాపని చూస్తూ గుమ్మం దాటుతుంటే మేకు తగిలి చేతికి రక్తం కారుతుంది. బాధతో అరుస్తాడు ఆర్య. అది విన్న అను బాధపడుతుంది. బామ్మ కంగారుగా పరిగెత్తుకొని వెళ్లి చేతికి కట్టు కడుతుంది. నొప్పిగా ఉందా బాబు అని అభిమానంగా అడుగుతుంది. లేదమ్మా నాకు అలవాటైపోయింది అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరబోతాడు ఆర్య.
 

29
Asianet Image

 ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదు అంటుంది బామ్మ. అప్పుడు జేబులో నుంచి ఫోన్ తీసి అను ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు ఆర్య. ఫోటో చూసిన బామ్మ షాక్ అవుతుంది. ఆ షాక్ లోనే అనువైపు చూస్తుంది. నిజం చెప్పొద్దు అన్నట్లుగా బ్రతిమాలుతుంది అను. చూడలేదు బాబు.. ఆమె కోసం ఇంత కంగారు పడుతున్నావు నీకు బాగా కావలసిన మనిషా అని అడుగుతుంది బామ్మ.
 

39
Asianet Image

తను నా భార్య అని చెప్పాడు ఆర్య. మరింత షాక్ అవుతుంది బామ్మ. తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. తను వెళ్ళినప్పటి నుంచి నా ప్రాణం పోయినట్లుగా ఉంది. మరింత బాధపడవలసిన విషయం ఏమిటంటే తను ఎందుకు వెళ్ళిపోయిందో నాకు కారణం తెలియదు. ప్రతి మనిషికి చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితి వస్తుందంట ఇప్పుడు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను అని కన్నీరు పెట్టుకుంటాడు ఆర్య.
 

49
Asianet Image

 క్షమించండి నా బాధంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్తాడు ఆర్య. మంచిది బాబు అని చెప్పి లోపలికి వస్తుంది బామ్మ. ఆమెకి కృతజ్ఞతలు చెప్తుంది అను. బామ్మ ఏమి అనకుండా పిల్లలకి పాలు పట్టు అని చెప్తుంది. ఆశ్చర్య పోతుంది అను. నిన్ను ఏవేవో ప్రశ్నలు వేస్తానని అనుకున్నావు కదా.. కానీ అడగను ఎందుకంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తికి నిన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తికి నువ్వు దూరంగా ఉన్నావంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
 

59
Asianet Image

 ఆ తరువాత  కట్టుతో ఇంటికి వచ్చిన ఆర్య ని చూసి ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంది శారదమ్మ. జరిగిందంతా చెప్తాడు ఆర్య. నీ కన్నబిడ్డలతో ఆడుకోవాల్సింది ఆ ఆనందాన్ని వెతుక్కుంటున్నావు భగవంతుడు నీకే ఎందుకు ఇంత శిక్ష వేశాడు అని బాధపడుతుంది శారదమ్మ. నిన్ను బాధపెట్టి తను బాధపడుతూ అను ఎందుకిలా చేస్తుందో అర్థం కావడం లేదు అంటుంది శారదమ్మ.
 

69
Asianet Image

 వదినమ్మ ని వెతకడంలో అన్ని ప్రయత్నాలు అయిపోయాయి ఏ ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి అని ఆర్యతో చెప్తాడు నీరజ్. మీడియాలో వేయిద్దాము. అప్పుడు అనుకి మన బాధ అర్థం అవుతుంది కచ్చితంగా తిరిగి వస్తుంది అంటాడు ఆర్య. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తను ఇక్కడికి రాదు ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకుంటుంది మాన్సీ.
 

79
Asianet Image

ఆ తర్వాత తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి అను ని ఎలా అయినా మనమే కనిపెట్టాలి. మా బ్రో ఇన్ లా జల్లెడ వేసి మరీ గాలిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అను వాళ్ళకి దొరక్కకూడదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత అంజలి మాటలు తలుచుకొని నాతోనే చాలెంజ్ చేస్తావా.. చూస్తాను అను ఎక్కడికి ఎలా వస్తుందో అని కోపంగా అనుకుంటుంది మాన్సీ. మరోవైపు పిల్లల్ని ముస్తాబు చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంది అను. ఏంటి హడావుడి అని అడుగుతుంది బామ్మ.
 

89
Asianet Image

 పిల్లలకి 21 రోజులు పూర్తయ్యాయి అంటుంది అను. అందుకు ఆనందించిన బామ్మ అయితే నామకరణం చేయాలి కదా అంటుంది. మీకు తెలిసిన పంతులుగారు ఉంటే  తీసుకురండి ఇంట్లోనే నామకరణం చేయిద్దాం అంటుంది అను. ఒక పంతులు గారిని ఏం కర్మ చుట్టుపక్కల పేరంటాలని కూడా తీసుకొని వస్తాను ఈ లోపు నువ్వు పిల్లలకి ఏం పేర్లు పెట్టాలో ఆలోచించుకో అని చెప్పి బయటికి వెళుతుంది బామ్మ.
 

99
Asianet Image

పిల్లల దగ్గరికి వచ్చి ముందుగా ఆర్య దంపతులు అనుకున్న పేర్లు ఆరాధ్య, ఆదిత్య పేర్లు పెట్టడానికి నిశ్చయించుకుంటుంది అను. మీ నానమ్మ వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా జరగవలసింది ఇంత చిన్న ఇంట్లో మీ నామకరణం జరుగుతుంది మీ వైభోగాన్ని దూరం చేసినందుకు నన్ను క్షమించండి అని బాధపడుతుంది అను. మరోవైపు ఇల్లంతా అలంకరించి ఉయ్యాలకి డెకరేషన్ చేసి ఆనందిస్తూ ఉంటారు అంజలి, నీరజ్.  పిల్లలకి గిఫ్ట్లు కొనటం మర్చిపోయాం అంటూ తెగ హడావిడి పడుతూ ఉంటారు. ఇంతలోనే మాన్సీ కిందికి వచ్చి మిమ్మల్ని చూస్తుంటే  ఎప్పుడో జెండే చెప్పిన ఒక సామెత గుర్తొస్తుంది అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories