- Home
- Entertainment
- Prema Entha Madhuram: మాన్సీ ని ఇంట్లోంచి బయటికి గెంటేసిన వర్ధన్ ఫ్యామిలీ.. నిరాశతో వెనుదిరిగిన ఆర్య!
Prema Entha Madhuram: మాన్సీ ని ఇంట్లోంచి బయటికి గెంటేసిన వర్ధన్ ఫ్యామిలీ.. నిరాశతో వెనుదిరిగిన ఆర్య!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అత్తింటి వాళ్లని నాన్న ఆగచాట్లు పెట్టి చివరికి తనే ఇంటి నుంచి బయటికి గెంటి వేయబడ్డ ఒక మూర్ఖురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో జోగమ్మ చెప్పింది విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అయితే అను ఇంట్లోంచి వెళ్లిపోవటానికి కారణం కూడా ఖచ్చితంగా మాన్సీ యే అయి ఉంటుంది అంటూ తను ఇంతకుముందు నీతో ఇంకేమైనా నాటకం ఆడించిందా అని జోగమ్మని అడుగుతుంది అంజలి. హాస్పిటల్లో జరిగిందంతా చెప్తుంది జోగమ్మ. ఆ మాటలు విని మరింత కోపంతో రగిలిపోతారు వర్ధన్ కుటుంబ సభ్యులు.
అసలు నువ్వు మనిషివేనా పుట్టగానే తండ్రి బిడ్డల్ని వేరు చేస్తావా అంటుంది అంజలి. అయ్యో ఎంత మోసపోయావు నీ భర్తకి ఏమైనా జరుగుతుందని ఇంట్లోంచి వెళ్ళిపోయావా.. అని బాధపడుతుంది శారదమ్మ. నేను ఇదంతా ఏదో ఆవేశంతో చేశాను సారీ అని శారదమ్మతో చెప్తుంది మాన్సీ. ఆమె మాటలు వినకుండా మానసి చంప చెళ్ళు మనిపిస్తుంది శారదమ్మ. నా కోడలు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం అయ్యావు ఇంటిల్లిపాదిని బాధపెట్టావు.
మేము నీకు ఏమన్యాయం చేసాము అని నిలదీస్తుంది. నీరజ్ రెండో పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు కదా అది నాకు అన్యాయం చేయడమే కదా నా తర్వాత వచ్చిన అనుని నెత్తి మీద పెట్టుకున్నారు ఆఫీసులోనూ ఇంట్లోనూ ఎక్కడ చూసినా తనపెత్తనమే ఇది నాకు చేసిన ద్రోహం కాదా అంటుంది మాన్సీ. ఇంకాపు అంటూ కోపంతో అరుస్తాడు ఆర్య. నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా చూస్తూ ఊరుకున్నాను.
నన్ను ఈ ఇంటికి దూరం చేసినప్పుడు, నన్ను నా తమ్ముడు నుంచి విడదీసినప్పుడు కూడా నిన్ను ఏమి అనలేదు కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పు క్షమించలేనిది నీ మీద చేయి చేసుకున్న కూడా మహా పాపం తక్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి పో అంటాడు ఆర్య.జెండే ని తనతో రమ్మని చెప్పి నేను అనుని తీసుకురావడానికి వెళ్తున్నాను నేను వచ్చేటప్పటికి తను ఎక్కడ ఉండకూడదు అని తల్లికి చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఆర్య.
నీరజ్ మాన్సీ సూట్ కేసులు తెచ్చి విసిరేస్తాడు. మాన్సీని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత మదన్ చెప్పిన అడ్రస్ కి వస్తారు ఆర్య, జెండే. మదన్ చెప్పిన ప్లేసు ఇదే అంటాడు జెండే.కార్ ఆపిన ఆర్య కిందికి దిగి నువ్వు అటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెతుకుతాను అని జెండాకి చెప్పి ఇద్దరు వైపు వెళ్లి వెతుకుతారు. అందరూ వాళ్ళకి తెలియదని చెప్తారు. డిసప్పాయింట్ అయిన ఇద్దరు కారు దగ్గర కలుస్తారు.
అను ఆచూకీ దొరకలేదు అని ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. ఇంతలో బొమ్మలు అమ్ముకునే ఆవిడ వస్తుంది. పిల్లలు ఆడుకోవటానికి పనికొస్తాయి బాబు రెండు బొమ్మలు తీసుకోండి అని అడుగుతుంది. ఆమెని వద్దని చెప్పి వెళ్ళిపోమంటాడు. కానీ ఆర్య బొమ్మలు తీసుకోమని చెప్తాడు. అందులోనే ఆర్య కి ఏదో ఐడియా వచ్చినట్లుగా ఆవిడ దగ్గరికి వెళ్లి నువ్వు ఈ ఏరియాలో బొమ్మలు నమ్ముతారు కదా ఈవిడని ఎక్కడైనా చూసావా అని అను ఫోటో చూపిస్తాడు.
ముందు గుర్తుపట్టలేక చూడలేదు అని చెప్తుంది కానీ తర్వాత గుర్తుపట్టి ఇందాకే నా దగ్గర బొమ్మలు కొన్నారు. వీళ్ళఇల్లు రెండు వీధుల అవతల ఉంది అని చెప్తుంది. ఇల్లు చూపించమంటూ ఆమెని తమతో పాటు తీసుకువస్తారు ఆర్య వాళ్ళు. ఆ ఇంటిని చూసిన ఆర్య షాక్ అవుతాడు. ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను అని జెండే కి చెప్తాడు. ఆనందంగా ఇంట్లోకి వెళ్లిన ఆర్యకి ఇల్లంతా ఖాళీగా కనిపిస్తుంది.ఈ ఇంట్లో కాదేమో అంటాడు జెండే.
లేదు జెండే ఈ ఇంట్లోనే ఉండేవారు నేను ఇంటికి వచ్చాను ఇక్కడే పాపతో ఆడుకున్నాను. ఆ పాప ఎవరు అనుకున్నావు నేను గుడిలో పూజ చేయించాను కదా ఆ పాపే ఆర్య. నా పిల్లల్ని నేను గుర్తు పట్టలేకపోయాను ఎంత దురదృష్టవంతుడిని అయినా అను ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది మనం ఇక్కడికి వస్తున్నట్లు తనకి తెలుసా అంటాడు ఆర్య. ఆ ఛాన్స్ లేదు అంటాడు జెండే.
లేదు మదన్ మనకి చెప్తాడు అని గెస్ చేసి ఉంటుంది. మళ్లీ నాకు ఎదురుపడితే అక్కడ నాకు ప్రమాదమో అని వెళ్ళిపోయింది. ఇదంతా మాన్సీ ఆడించిన నాటకం అని తనకి తెలిస్తేనే కానీ మళ్ళీ వెనక్కి రాదు. తనకి ఈ విషయం తెలియడం ఎలా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు ఆర్య. డిసప్పాయింట్ అవ్వద్దు తను ఇక్కడ ఉన్నట్లు తెలిసింది కదా అలాగే ఎక్కడ ఉన్నా కొద్ది రోజుల్లో మనకి తెలుస్తుంది ఆర్య కి ధైర్యం చెప్తాడు జెండే. మరోవైపు తోపుడు బండమీద సామాన్లు సర్దుకుని ఎటో వెళ్ళిపోతూ ఉంటారు బామ్మ, అను. సీన్ కట్ చేస్తే నిరాశగా ఇంటికే వచ్చిన ఆర్యని ఏం జరిగింది అని అడుగుతుంది శారదమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.