- Home
- Entertainment
- Prema Entha Madhuram: సుబ్బు, పద్దులకు కాల్ చేసిన ఆర్య.. రాగసుధకు టెన్షన్.. అనుకు సర్ప్రైజ్?
Prema Entha Madhuram: సుబ్బు, పద్దులకు కాల్ చేసిన ఆర్య.. రాగసుధకు టెన్షన్.. అనుకు సర్ప్రైజ్?
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం ( Prema Entha Madhuram)సీరియల్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం. రాగసుధ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి సుబ్బు, పద్దు ల ఇంట్లో గడి పెట్టుకుంటుంది. అలా రాగసుధను (Raga sudha) చూసినా సుబ్బు, పద్దులు ఆశ్చర్యపోతారు.

ఆ తర్వాత పద్దు, రాగసుధను (Ragasudha) ఈ రోజంతా ఎక్కడికెళ్లావ్ అని అడిగితే తెలిసిన వాళ్లతో వెళ్లాను అని అబద్దం చెబుతుంది. మరోవైపు ఆర్య, అనుని కళ్ళలోకి కళ్లు పెట్టి చూసుకుంటూ అందంగా డెకరేట్ చేసిన బెడ్ రూమ్ ను చూపించి మరో సర్ప్రైజ్ ఇస్తాడు. అది చూసిన అను (Anu) ఎంతో ఆనంద పడుతుంది.
మరోవైపు రాగ సుధ (Raga sudha), సుబ్బు పద్దు లు పడుకున్నప్పటికీ ఇంకా పడుకోకుండా జరిగిన ఘటన గురించి ఆలోచించుకుంటూ అలానే కూర్చుని ఉంటుంది. ఈ లోగో సుబ్బు (Subbu) లేచి ఇంకా ఎందుకు పడుకోలేదు అమ్మ అని అడుగుతాడు. రాగసుధ నిద్రపట్టడం లేదని చెప్పగా అను, ఆర్య ల వెడ్డింగ్ ఆల్బమ్ చూపిస్తాడు.
ఇక రాగసుధ (raga sudha), ఆ ఆల్బమ్ లో ఆర్య ఫోటో చూసేలోపు పద్దు లేచి వాళ్ళిద్దరు ఇంకా పడుకోకుండా ఉన్నందుకు ఫన్నీగా కోపంతో విరుచుకు పడుతుంది. దాంతో సుబ్బు (Subbu) , రాగసుధ లు ఆల్బమ్ ను క్లోజ్ చేస్తారు.
మరోవైపు ఆర్య బెడ్ రూమ్ లో పడుకొని లేచే లోపు అను (Anu) కనిపించదు. దాంతో ఆర్య ఇల్లు మొత్తం వెతుకుతాడు ఎక్కడా అను కనిపించదు. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక ఆర్య వాళ్ళ మమ్మీ కి కాల్ చేసి కనుక్కోవాలి అనుకొని కాల్ చేస్తాడు. కానీ ఇంతలో ఆర్య (Arya) వాళ్ళ మమ్మి కి వేరే టాపిక్ చెబుతాడు.
ఆ తర్వాత ఆర్య, సుబ్బు (Subbu) కి కాల్ చేస్తాడు. సుబ్బు వంట పనిలో బిజీగా ఉండగా పద్దును కాల్ లిఫ్ట్ చెయ్ అంటాడు. పద్దు (Paddu) హడావిడిలో నాకు కుదరదు అని విరుచుకు పడుతుంది.
ఇక సుబ్బు (Subbu) , రాగసుధను కాల్ లిఫ్ట్ చెయ్ అమ్మా.. అంటాడు. దాంతో రాఘసుధ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళుతుంది మరి ఈ క్రమంలో రాగసుధ (Raga sudha) ఫోన్ లిఫ్ట్ చేస్తుందో.. స్క్రీన్ పై ఉన్న నేమ్ చూసి టెన్షన్ పడుతుందో రేపటి భాగంలో చూడాలి.