- Home
- Entertainment
- ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్.. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ ఏంటంటే?
ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్.. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ ఏంటంటే?
AR Rahman: ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చాతి నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారట. మరి ఇంతకి ఏమైంది?

AR Rahman
AR Rahman Discharged From Apollo Hospital : 58 ఏళ్ల సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఈరోజు ఉదయం 7.30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. రెహ్మాన్‌కి ఏమైందని కలవరపడ్డారు. అయితే దీనికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రెహ్మాన్ డిశ్చార్జ్ అయ్యారట.
అపోలో ఆసుపత్రి ప్రకటన
కొన్ని పరీక్షల అనంతరం ఏ.ఆర్.రెహమాన్ ఇంటికి తిరిగి వెళ్లారని అపోలో ఆసుపత్రి తెలిపింది. దీనికి ముందు ఛాతీ నొప్పి వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ డీ హైడ్రేషన్ సమస్య వచ్చిందని, దీంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు వైద్యలు తెలిపారు. రొటీన్ చెకప్‌లో భాగంగా కొన్ని టెస్ట్ లు చేసి డిశ్చార్జ్ చేశారట. ప్రస్తుతం ఆయన అరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఏ.ఆర్.రెహమాన్
కొంతకాలం క్రితం రెహమాన్ మాజీ భార్య సాయిరా భానుకు కూడా ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.
ఏ.ఆర్.రెహమాన్ సినిమాలు
సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ చివరిగా `ఛావా` చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పుడు కమల్ హాసన్ సినిమా `థగ్ లైఫ్`కి సంగీతం అందిస్తున్నారు.దీంతోపాటు తెలుగులో రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ `ఆర్సీ16`కి మ్యూజిక్ అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత రెహ్మాన్ తెలుగు మూవీకి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.
read more: AR Rehman: ఛాతి నొప్పితో హాస్పిటల్‌లో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్.. ఇప్పుడెలా ఉందంటే?
also read: అల్లు అర్జున్ అతి నమ్మకమే దెబ్బ కొట్టింది.. `వరుడు` డిజాస్టర్‌కి అసలు కారణం ఇదే!