- Home
- Entertainment
- Brahmamudi: తండ్రి ముందు తల్లి గుట్టు బయటపెట్టిన అప్పు.. రివర్స్ అయిన స్వప్న ప్లాన్?
Brahmamudi: తండ్రి ముందు తల్లి గుట్టు బయటపెట్టిన అప్పు.. రివర్స్ అయిన స్వప్న ప్లాన్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదిస్తూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకొని ఆ అబద్ధాన్ని కప్పిపురచడానికి నానా తిప్పలు పడుతున్న ఒక ఆడదాని కథ సీరియల్. ఇక ఈరోజు జూన్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్నని టెస్ట్ చేస్తున్న డాక్టర్ కి ఏదో అనుమానం వస్తుంది. తను ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి అనటంతో చిట్టి వాళ్ళందరూ బయటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత తనని అనుమానంగా చూస్తున్న డాక్టర్ తో మీ అనుమానమే నిజంగా డాక్టర్ అంటుంది స్వప్న. ఎందుకు రాని కడుపుని వచ్చినట్లుగా చెప్పావు.
ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధ పడతారో తెలుసా అంటుంది డాక్టర్. రాహుల్ నన్ను మోసం చేసి వదిలేద్దాం అనుకున్నాడు అందుకే నేను కూడా మోసంతోనే అతన్ని పెళ్లి చేసుకున్నాను అంటుంది స్వప్న. అదంతా నాకు తెలియదు నేను నిజం చెప్తాను అంటుంది డాక్టర్. స్వప్న పీక మీద కత్తి పెట్టుకొని మీరు నిజం చెప్తే నేను చచ్చిపోతాను తర్వాత మీ ఇష్టం అని బెదిరించడంతో బయటికి వచ్చిన డాక్టర్ మీరేమీ కంగారు పడకండి లోపల బేబీకి ఏం జరగలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. తర్వాత స్వప్నతో మాట్లాడుతూ డాక్టర్ కి ఏం చెప్పావు అని అడుగుతుంది. ఏదో ఒకటి చెప్పనులే అంటుంది స్వప్న. ఇలా ఎన్నాళ్ళని మోసం చేస్తావు ఈరోజు డాక్టర్ తో ఏం చెప్పావో నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఒక రోజు ఇంట్లో వాళ్ళకి చెప్పే పరిస్థితి వస్తుంది అంటుంది కావ్య. అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఈ విషయం అబద్ధం అని తెలిసేలోపే నిజం చేసేస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న.
మరో వైపు కాళ్లు పట్టేసిన కళ్యాణ్ ఇంట్లోకి రాలేకపోతాడు.కంగారుగా వచ్చిన ధాన్యలక్ష్మి ఏం జరిగింది అని అడుగుతుంది.ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాను అంటాడు కళ్యాణ్. నీకెందుకు ఫిజికల్ ట్రైనింగ్ అంటాడు ప్రకాష్. రేపు నా భార్యని ఎవరైనా ఏడిపిస్తే ఎలా సేవ్ చేయాలి అందుకే అంటాడు కళ్యాణ్. ఎప్పుడో రాబోయే భార్య కోసం ఇప్పటినుంచే ఆలోచిస్తున్నాడు చూసావా అని భార్యతో వెటకారంగా చెప్తాడు ప్రకాష్.
భార్య రాకముందే ఇంత బాగా ఆలోచిస్తున్నాడంటే వచ్చాక ఇంకా ఎంత బాగా చూసుకుంటాడో అని ఆనందపడుతుంది దాన్యలక్ష్మి. ఇంతలో అప్పు ఫోన్ చేసి డైట్ ప్లానింగ్ చెప్తుంది. మా ఫిజికల్ ట్రైలర్ గుడ్లు తినమని చెప్పింది ఒక పది గుడ్లు ఉడికించు అని తల్లికి చెప్తాడు కళ్యాణ్. అదేంటి నీ ట్రైనర్ లేడీ యా అని అడుగుతాడు ప్రకాష్. అవును అంటాడు కళ్యాణ్. అలా చెప్పు ఇవన్నీ ఆ ట్రైలర్ ని ఇంప్రెస్ చేయడం కోసం అని కొడుకుని ఆటపట్టిస్తాడు ప్రకాష్.
అలాంటిదేమీ లేదు నాన్న తను మగరాయుడు లాంటిది అయినా నేను నా రూమ్ వరకు వెళ్ళలేను ఈ మెట్లు మీదే కూర్చోబెట్టి ఈ పూటకి ఇక్కడ అడ్జస్ట్ అవుతాను అనటంతో అతి కష్టం మీద మెట్ల మీద కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు ప్రకాష్. మరోవైపు తనని కిడ్నాప్ కేసులో విరిగించినందుకు చెల్లెలి మీద విరుచుకుపడుతుంది మీనాక్షి. ఇంతలోనే అప్పు వచ్చి చమన్ లాల్ ని ఎవరో కిడ్నాప్ చేశారట అని చెప్తుంది.
ఆ మాటలకి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరేదో కిడ్నాప్ చేసినట్లు ఎందుకు అలా షాక్ అవుతారు అయినా కిడ్నాప్ చేసిన వాళ్ల మీద దొంగతనం కేసు మర్డర్ కేసు కిడ్నాప్ కేసు బోల్ట్ కేసులు ఉంటాయి వాళ్ళ పని అయిపోయినట్లే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు. కేసుల మాట ఎద్దేసరికి మీనాక్షి భయపడిపోయి చమన్ లాల్ కట్లు విప్పేసి నేను నిన్ను విడిపిస్తాను నామీద కేసు పెట్టకు అంటుంది. కనకం వచ్చి మీనాక్షిని వారిస్తున్నా వినిపించుకోదు ఈ హడావిడిలో కట్లు విప్పుకొని మీ సంగతి చూస్తాను అంటూ బయటికి వచ్చేస్తాడు చమన్ లాల్. అతని వెనకే కనకం వాళ్ళు వస్తారు ముగ్గురు ఎదురుగా ఉన్న కృష్ణమూర్తిని చూసి షాక్ అవుతారు.
పక్కనే ఉన్న అప్పు నేను కిడ్నాప్ అనేసరికి మీ ఇద్దరిలో కంగారు కనిపించింది అందుకే నాన్న తీసుకొని వచ్చాను అంటుంది. అప్పుడు కృష్ణమూర్తి ఏం జరిగింది అని సేటుని అడగటంతో అప్పు సంగతి చెప్పేస్తాడు సేటు. కనకాన్ని మందలించి నీ సంగతి తర్వాత చూస్తాను అంటూ సేటు దగ్గరికి వెళ్లి ఈ తప్పుని క్షమించండి అని రిక్వెస్ట్ చేస్తాడు. నేనెందుకు క్షమించాలి నన్ను పెట్టిన టార్చర్ కి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు సేటు. తరువాయి భాగంలో పాలలో మత్తుమందు కలిపి రాహుల్ ని వశపరచుకోవడానికి ప్లాన్ వేసి పాలలో మత్తుమందు కలిపి పెడుతుంది స్వప్న.
కావ్య కూడా అదే సమయంలో రాజ్ కి ఇవ్వటం కోసం పాలు కలుపుతుంది. రెండు పాల గ్లాసులు తారుమారు అయిపోతాయి. మత్తుమందు కలిపిన పాలు తాగేసిన రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు.