- Home
- Entertainment
- Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Apoorva Remuneration: బిగ్ బాస్ తెలుగు 10 మౌజ్‌లోకి మూడో వారంలో ఎంట్రీ ఇచ్చింది కామనర్ అపూర్వ. ఆమె ఐదో వారంలో ఎలిమినేట్ అయ్యింది. మరి ఆమెకి దక్కిక పారితోషికం ఎంతంటే?

మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10లో ఐదో వారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ తన ప్రయాణాన్ని ముగించుకుంది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి తనదైన ఆటతీరుతో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఆమెకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ దక్కలేదు. దీంతో ఐదో వారంలో హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు అపూర్వ ఎలిమినేషన్‌తో పాటు ఆమెకు అందిన పారితోషికం గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి..
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఈ సీజన్‌లో సాధారణ కంటెస్టెంట్లతో పాటు అగ్ని పరీక్ష 2 ద్వారా ఎంపికైన వారి(కామనర్)కి కూడా అవకాశం కల్పించారు. ఈ క్రమంలో అపూర్వ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెతో పాటు మిథిలేష్ కూడా మూడో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మిథిలేష్ రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌తో హౌస్‌ను వీడగా, అపూర్వ మాత్రం తన ఆటను కొనసాగించింది.
హౌస్‌లోకి వచ్చిన సమయంలో అపూర్వకు కెప్టెన్సీ అవకాశం కూడా దక్కింది. దీంతో ఆమె తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చాలామంది భావించారు. కానీ హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లతో పోటీ, నామినేషన్లు, ఓటింగ్ పరిణామాల మధ్య ఆమె ప్రయాణం ఐదో వారానికే ముగిసింది. ఎలిమినేషన్ అనంతరం హోస్ట్ నాగార్జునతో స్టేజ్‌పై మాట్లాడిన అపూర్వ భావోద్వేగానికి గురైంది.
అపూర్వ పారితోషికం
బిగ్ బాస్ తెలుగు 10లో అపూర్వకు వారానికి సుమారు రూ.75 వేల పారితోషికం అందుతున్నట్లు సమాచారం. కామనర్స్ కి తక్కువ పారితోషికం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అపూర్వకి వారానికి రూ.70-75వేలు దక్కిందట. ఈ లెక్కన ఆమెకి మూడు వారాలకు పారితోషికం ఇస్తే మొత్తంగా రూ.2.25లక్షలు పొందుతుంది. బిగ్ బాస్ షోలో అతి తక్కవ పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్లలో ఒకరిగా అపూర్వ నిలుస్తుంది.

