Brahmamudi: రుద్రాణి మీద పగ తీర్చుకున్న అపర్ణ.. కిడ్నాప్ కి గురైన స్వప్న?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. పెళ్ళికి ముందే కాలుజారి కడుపు తెచ్చుకున్న ఇంకా పొగరు తగ్గించుకోని ఒక మూర్ఖురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తన నగలు వేసుకుని వచ్చిన స్వప్నని చూసి షాక్ అవుతుంది మీనాక్షి. అవి నా నగలే అంటుంది. నీవేలే పెద్దమ్మ పెళ్లయిన వెంటనే ఇచ్చేస్తానులే అయినా పెళ్లయిన తర్వాత వీటితో నాకేం అవసరం మా ఆయన నాకోసం డైమండ్ నగలు చేయిస్తాడు అని గొప్పగా చెప్తుంది స్వప్న. పోనీలే పెళ్లయ్యాకైనా నా నగలు నాకు ఇచ్చేయ్ అంటుంది మీనాక్షి.
పెళ్లికి ఎవరిని పిలవలేదా అని అడుగుతుంది స్వప్న. పిలిచే అంత గౌరవం నువ్వు ఎక్కడ మిగిల్చావు నువ్వేమీ కన్యగా పీటల మీద కూర్చోవడం లేదు కడుపుతో కూర్చుంటున్నావు అని కోప్పడతాడు కృష్ణమూర్తి. మరోవైపు బేరర్లం అని చెప్పుకొని రాజ్ ఇంట్లో అడుగు పెడతారు కిడ్నాపర్లు. మిమ్మల్ని ఎవరు పంపించారు ఆల్రెడీ బేరర్లు వచ్చేసారు అని అడుగుతాడు రాజ్.
రాహుల్ అని నోరు జారతాడు ఒక బేరర్. షాక్ అయిపోతాడు రాహుల్. మళ్లీ అంతలోనే సర్దుకొని ఈవెంట్ మేనేజర్ కిరణ్ పంపించాడు అని చెప్తాడు మరొక బేరర్. సరే అని చెప్పి లోపలికి పంపిస్తాడు రాజ్. కిడ్నాపర్లు నేరుగా రాహుల్ దగ్గరికి వెళ్లి నా రసగుల్లా ఎక్కడన్నా అని అడుగుతాడు మైకేల్ మదన కామరాజు. అంతలోనే కార్లు అక్కడికి వచ్చిన స్వప్న వాళ్ళని చూపించి ఇదిగో కారు దిగుతుంది అని చెప్తాడు రాహుల్.
స్వప్నని చూసిన మదన కామరాజు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అదే సమయంలో కారు దిగిన స్వప్నని ఇంటర్వ్యూ కోసం ఎగబడతారు మీడియా వాళ్ళు. సెలబ్రిటీ లా ఫీల్ అయిపోతుంది స్వప్న. ఎక్కడ ఏం మాట్లాడుతుందో అని రాహుల్ కావ్య కూడా కంగారు పడిపోతారు. గబగబా వెళ్లి తనని పెళ్లికూతురు చేయటానికి టైం అవుతుందని చెప్పి స్వప్నని లోనికి తీసుకొని వచ్చేస్తుంది కావ్య.
తనని అలా తీసుకువచ్చినందుకు కావ్య ని తిడుతుంది స్వప్న. వాళ్లు నీ కడుపు సంగతి బయట పెట్టడానికి కూపి లాగుతున్నారు అని చీవాట్లు పెడుతుంది కనకం. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ నా పేరు మాత్రం బయటికి రాకూడదు ఇకమీదట మీకు నాకు సంబంధం లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు రాహుల్. ఇంట్లోకి వస్తున్న స్వప్నని ఆగమని చెప్పి హారతి తీసుకు రమ్మని చెప్తుంది చిట్టి. వెళ్ళు నీ కోడలికి హారతి ఇవ్వు అని రుద్రాణికి వెటకారంగా చెప్తుంది అపర్ణ.
నాకేమీ అలాంటి అలవాటు లేదు అంటుంది రుద్రాణి. ఆరోజు కావ్య ఇంట్లోకి వస్తున్నప్పుడు నన్ను ఎన్ని మాటలు అన్నావు ఇప్పుడు ఏమైంది అని నిలదీస్తుంది అపర్ణ. ఇప్పటికిప్పుడు హారతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటుంది రుద్రాణి. రెడీ అంటూ గుమ్మడికాయ తీసుకొని వస్తాడు మైకేల్ మదన కామరాజు. అతనిని చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అని అడుగుతారు అక్కడున్న వాళ్ళు.
తనని పరిచయం చేసుకుంటాడు మైఖేల్ మదన కామరాజు. ఇక తప్పదన్నట్లు హారతి ఇచ్చి అందర్నీ లోపలికి తీసుకువస్తుంది రుద్రాణి. అందర్నీ ఒక గదిలోకి తీసుకువెళ్తుంది కావ్య. అక్కడ మీనాక్షి వాష్ రూమ్ కి వెళ్తుంది. కృష్ణమూర్తి పని మీద బయటకు వెళ్తాడు. అక్క కోసం కొన్న చీరలు చూపిస్తాను అని కావ్య తల్లిని తీసుకెళ్లబోతుంటే నేను కూడా వస్తాను అంటుంది స్వప్న.
పెళ్లికూతురు మాత్రమే నేను.. పెత్తనం అంతా దాందే అంటూ కావ్య ని ఆడిపోసుకుంటుంది స్వప్న. అదే కనుక నిజం నిరూపించకపోతే ఈపాటికి నువ్వు గుడి దగ్గర మిస్టేక్కునే దానివి దాన్ని పన్నెత్తి మాటంటే పళ్ళు రాలిపోతాయి అంటూ కూతుర్ని హెచ్చరించి వెళ్ళిపోతుంది కనకం. ఒకసారి పెళ్లి అయిపోతే అప్పుడు వీళ్ళ సంగతి చెప్తాను అనుకుంటుంది స్వప్న.
గదిలో ఒంటరిగా ఉన్న స్వప్నని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు మైకేల్ మదన కామరాజు. అప్పుడే వాష్ రూమ్ నుంచి మీనాక్షి రావటంతో అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. తరువాయి భాగంలో స్వప్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పోతారు కిడ్నాపర్లు. గదిలో స్వప్న లేకపోవడంతో కంగారు పడతారు కావ్య వాళ్లు.