Brahmamudi: కనకం చెప్పింది విని షాకైన రుద్రాణి.. కొడుకుని నిజం చెప్పమంటూ నిలదీసిన అపర్ణ!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తాత ఆరోగ్యం కోసం తపన పడుతున్న ఒక మనవడి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తనతో క్లోజ్ గా మాట్లాడుతున్న కావ్యని చూసి మూడు నెలలు టైం అడిగాను కదా మళ్ళీ ఏంటి ఇవన్నీ అని అడుగుతాడు రాజ్. ఈ పువ్వులు అమ్మమ్మ గారు పెట్టారు,ఈ పాల గ్లాసు చిన్న అత్తగారు ఇచ్చారు అంతేగాని నేనేమీ కావాలని ఇదంతా చేయలేదు, ఈ పాలు తాగేసి ప్రశాంతంగా పడుకోండి అంటుంది కావ్య. మరోవైపు అనామిక ఫోటో చూస్తూ మీ పేరెంట్స్ కి కూడా నన్ను పరిచయం చేసావంటే నేను ఎంత స్పెషలో అర్థమవుతుంది.
అసలు నీ మనసులో నేనున్నానో లేదో తెలుసుకోవడం ఎలా అంటూ ఆలోచనలో పడతాడు కళ్యాణ్. బ్రో కి ఫోన్ చేసి సలహా అడుగుదాం అని చెప్పి అప్పుకి కాల్ చేస్తాడు. నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అంటుంది అప్పు. లేదు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడు నాకు ఒక చిన్న సలహా ఇవ్వు అంటాడు కళ్యాణ్. ఇంతలో అనామిక ఫోన్ రావటంతో అప్పు ఫోన్ కట్ చేసేసి అనామికతో మాట్లాడటం ప్రారంభిస్తాడు కళ్యాణ్.
నా పని చెడగొట్టి వీడు ఇంకెవరితో మాట్లాడుతున్నాడుఅని తిరిగే కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది అప్పు. బీప్ సౌండ్ విన్న అనామిక మీకు ఏదో కాల్ వస్తున్నట్లుగా ఉంది నేను తర్వాత చెయ్యనా అంటుంది. అబ్బే అదేమీ అంత ఇంపార్టెంట్ కాల్ కాదు అంటూ అప్పు కాలనీ రిజెక్ట్ చేసేసి మళ్లీ అనామికతో కబుర్లలో పడతాడు కళ్యాణ్. నా ఫోనే కట్ చేస్తావా మళ్లీ సలహా కోసం నన్ను అడుక్కుంటావు కదా అప్పుడు నీ పని చెప్తాను అని కోపంతో రగిలిపోతుంది అప్పు. మరోవైపు రాహుల్ ని రోడ్డు మీద చూసిన కనకం షాక్ అవుతుంది.
రుద్రాణికి ఫోన్ చేసి రాహుల్ హనీమూన్ వెళ్లాడన్నారు, నాకు ఇక్కడ రోడ్డు మీద కనిపించాడు అంటుంది. ఆ మాటలకి షాక్ అవుతుంది రుద్రాణి. వాడెందుకు ఇక్కడ ఉంటాడు.. అయినా నన్ను అడుగుతున్నారు ఎందుకు, మీ అమ్మాయి తో మీరు రోజు మాట్లాడటం లేదా అని తిరిగి ప్రశ్నిస్తుంది రుద్రాణి. లేదు లేదు మా అమ్మాయి ఈరోజు నాతో మాట్లాడుతుంది, నిన్న కూడా మాట్లాడాను అంటూ అబద్ధం చెప్తుంది. నేనే ఎవరినో చూసి ఎవరో అనుకున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కనకం. తనకి ఫోన్ చేయడం లేనందుకు కూతుర్ని తిట్టుకుంటుంది.
మరోవైపు రుద్రాణి రాహుల్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. పని పూర్తయ్య వరకు ఎక్కడా బయట తిరగవద్దు అని హెచ్చరిస్తుంది. అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాహుల్. మరోవైపు కృష్ణుడి పూజ చేస్తుంది కావ్య. ఇంటిని భజన మందిరం చేసేటట్లుగా ఉంది నీ మనవరాలు అని తల్లితో అంటుంది రుద్రాణి. పండగలు అనేవి ఇంట్లో వాళ్ళందరూ కలవటం కోసమే చేస్తారు. ఈరోజుల్లో కూడా ఈ అమ్మాయి ఇలాంటి పూజలు చేస్తుంటే నిజంగా మెచ్చుకోవాలి.
నీకు ఇష్టం లేకపోతే వెళ్లి నీ గదిలో కూర్చో అంటూ మందలిస్తుంది చిట్టి. రాజ్ కూడా తను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ భార్యని వెనకేసుకొస్తాడు. భర్తలో వస్తున్న మార్పుకి ఆనందిస్తుంది కావ్య. మరోవైపు కనకం వాళ్ళు కూడా కృష్ణుడి పూజ చేస్తూ ఉంటారు. ఈ లోపు అప్పుకి తన ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తే ఉండు వచ్చి వాళ్ళ కాళ్ళు విరగ్గొడతాను అని అక్కడ నుంచి బయలుదేరబోతుంది. కనకం అప్పుని ఆపి ఇంతకుముందు ఒకసారి ఇలాగే చేసి ఇంటి మీదకి గొడవలు తీసుకొచ్చావు, ఇప్పుడు మళ్లీ గొడవకి వెళ్తానంటున్నావు.బయటకు వెళ్ళావంటే కాళ్ళు విరగగొడతాను అంటూ కూతుర్ని గదిలో పెట్టి బంధించేస్తుంది.
తరువాయి భాగంలో బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది కావ్య. నా కాపురం గురించి భయపడ్డాను కానీ నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంది. నేను ఈ ఇంటి కోడల్ని అనే భావన కలుగుతుంది అని చిట్టి తో చెప్పి ఆనందపడుతుంది. అది చూసి అపర్ణ కోపంతో రగిలిపోతుంది కొడుకుని గదిలోకి తీసుకువెళ్లి నీ ప్రవర్తనలో మార్పు కి కారణమేమిటి అని నిలదీస్తుంది. తాతయ్య కోసం ఇలా చేస్తున్నాను అంటూ జరిగిందంతా చెప్తాడు రాజ్.