Brahmamudi: వదినని మరింత రెచ్చగొడుతున్న రుద్రాణి.. కోడల్ని నెట్టేసిన అపర్ణ!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకుని అపార్థం చేసుకుంటున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపర్ణ. ఈరోజు నుంచి నేను జడ పదార్థంలో ఇంట్లో ఉంటాను. అందరూ నన్ను వెలివేయండి ఉంటుంది. అలా అంటావేంటి మమ్మీ అంటాడు రాజ్. మాట్లాడొద్దు రాజ్, ముఖ్యంగా నువ్వే నాతో మాట్లాడొద్దు. ఎప్పుడైతే భార్యని వెనకేసుకొస్తూ తల్లిని తప్పుపట్టావో అప్పుడే మన బంధం మసకబారిపోయింది.
ఇప్పుడు నీ భార్యకి రత్న సింహాసనం వేయించి వింజామరలు వేయించు. నీ తల్లి ఒక మూలన కూర్చొని అన్ని చూస్తూ ఉంటుంది అంటూ ఎంతో బాధగా మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. మరోవైపు స్వప్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది కనకం. కానీ ఎంతకీ లైన్ కలవకపోవడంతో చిరాకు పడిపోతూ ఉంటుంది. వెళ్ళిన దగ్గర సిగ్నల్ లేదేమో అంటాడు కృష్ణమూర్తి.
ఉన్నప్పుడు తనే కాల్ చేయొచ్చు కదా అంటుంది కనుక. నువ్వు దానిని బంగారు బొమ్మ లాగా పెంచావు, అది నిన్ను మట్టి బొమ్మలాగా చూస్తుంది అంటూ కృష్ణమూర్తి కావ్యకి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన కావ్య మాట్లాడుతూ ఉంటే గొంతుక ఏంటి అలా ఉంది ఇంట్లో అంతా బానే ఉంది కదా అని అడుగుతాడు కృష్ణమూర్తి.
అంతా బానే ఉంది నాన్న, నేను ఒక పది నిమిషాల్లో బయలుదేరుతాను అంటుంది కావ్య. వద్దమ్మా అందుకే ఫోన్ చేశాను. రాత్రి వర్షానికి బొమ్మలు ఆరలేదు ఇప్పుడు పెయింటింగ్ వేయటానికి అవ్వదు అంటాడు కృష్ణమూర్తి. సరే అని ఫోన్ ఫోన్ పెట్టేస్తుంటే కనకం స్వప్న గురించి అడగమని కృష్ణమూర్తికి చెప్తుంది. అప్పుడు కృష్ణమూర్తి అక్క ఫోన్ చేసిందా అని అడుగుతాడు. లేదు నాన్న నేను చేసినా లైన్ కలవడం లేదు అని చెప్పడంతో ఫోన్ పెట్టేస్తాడు.
మరోవైపు కోపంలో ఉన్న అపర్ణ దగ్గరికి వెళ్లిన రుద్రాణి నిన్ను చూస్తే జాలిగా ఉంది. ఇన్నాళ్ళు మహారాణి లాగా ఉండే దానివి. ఎప్పుడూ నీ మాటే చెల్లేది. ఇప్పుడు ఆ అధికారాన్ని నీ కోడలు లాగేసుకుంది. అదంతా పక్కన పెట్టు, రాజ్ అసలు భార్యని వెనకేసుకొచ్చి నిన్ను ఇంతలా అవమానిస్తాడు అనుకోలేదు. అయినా నువ్వు అవమానంతో ఇలా నాలుగు గోడల మధ్య కూర్చుంటే నీ కోడలు ఇంకా రెచ్చిపోతుంది అంటూ అపర్ణని మరింత రెచ్చగొట్టి కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి.
మరోవైపు తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఆ తర్వాత తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడబోతే ఆమె వినటానికి ఇష్టపడదు. ఒకసారి నేను చెప్పేది విను మమ్మీ అంటాడు రాజ్. నేను చెప్పేది నువ్వు విన్నావా.. నీ భార్యని వెనకేసుకొచ్చి నన్ను తప్పు పట్టావు. నేను ఏమీ వినటానికి సిద్ధంగా లేను ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ కేకలు వేస్తుంది అపర్ణ. నువ్వు కోపంలో ఉన్నావు, బాధలో ఉన్నావు అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో నాకు నీ కన్నా ఎవరు ఎక్కువ కారు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్.
మరోవైపు కళ్యాణ్ దగ్గరికి వచ్చిన అప్పు ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది. నిన్న అనామిక వచ్చింది అంటాడు కళ్యాణ్. ఎందుకు అంటుంది అప్పు. దెబ్బ తగిలింది కదా అందుకే చూడ్డానికి వచ్చింది అంటాడు కళ్యాణ్. ఇంత చిన్న దెబ్బ తగిలితే ఏకంగా ఇంటికి వచ్చేసిందా.. కొంచెం ఎక్కువ అనిపించట్లేదా అని నవ్వుతుంది అప్పు. దీనికే నవ్వుతుంది అంటే, నేను అనామికని ప్రేమిస్తున్నానని తను నన్ను రిజెక్ట్ చేస్తే అప్పుడు జీవితాంతం నన్ను దెప్పుతూనే ఉంటుంది.
అందుకే నా లవ్ సక్సెస్ అయ్యాక అప్పుకి చెప్పాలి అనుకుంటాడు కళ్యాణ్. ఇంతకీ ఎందుకు రమ్మన్నావో చెప్పు అంటుంది అప్పు. ఏం చెప్పాలో అర్థం కాక కూరగాయలు తెమ్మని ఇంట్లో చెప్పారు. నాకు తెలియదు కదా అందుకే నిన్ను తోడు తీసుకెళ్తామని అంటాడు. సరే పద నేను కూడా కూరగాయలు తేవాలి అనుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు తనకోసం తానే వంట చేసుకుంటూ ఉంటుంది అపర్ణ. అది చూసిన ధాన్యలక్ష్మి బాధపడుతుంది. వదిన బాగా హర్ట్ అయినట్టుగా ఉంది అంటుంది రుద్రాణి. ధాన్యలక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తరువాత రుద్రాణి కావ్య దగ్గరికి వెళ్లి ఏంటి ఇలా చేశావు, మీ అత్తగారు చూడు ఎంత బాధ పడుతుందో అంటూ వెటకారంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత అత్తగారితో మాట్లాడటానికి ఆమె గది దగ్గరికి వెళ్లి మీతో మాట్లాడాలి లోపలికి రావచ్చా అంటుంది కావ్య. కానీ అపర్ణ తన మాట వినిపించుకోకుండా ఆమెని పక్కకి నెట్టేసి తలుపు వేసేసుకుంటుంది. తరువాయి భాగంలో ఒంటరిగా భోజనం చేయబోతున్న అపర్ణని అందరం ఇక్కడ భోజనం చేస్తుంటే, నువ్వెందుకు అక్కడ భోజనం భోజనం చేస్తున్నావు అంటుంది చిట్టి.ఇకమీదట నా వంట నేనే చేసుకొని నా పనులు నేనే చేసుకుంటాను అంటుంది అపర్ణ. అప్పుడు చిట్టి ఆమె ముందు డాక్యుమెంట్స్ పడేసి విడిపోవాలనుకున్నప్పుడు వంటగదిలో మాత్రమే ఎందుకు విడిపోవాలి ఆస్తులు పని చేసుకుని మొత్తంగా విడిపోండి అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు.