Brahmamudi : రాజ్ ని షాకింగ్ కోరిక కోరిన సీతారామయ్య.. కొడుకు ప్రవర్తనకి భయపడుతున్న అపర్ణ!
Brahmamudi : స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తాత ఆరోగ్యం కోసం తపన పడుతున్న ఒక మనవడి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో బయటికి వెళ్తున్న అప్పుని పట్టుకొని గదిలో పెట్టి బంధించేస్తుంది కనకం. తను ఏమైనా చిన్నపిల్ల అనుకున్నావా అంటూ భర్త, తోటి కోడలు మందలిస్తారు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇప్పుడు గాని వదిలితే వెళ్లి ఎవరో తలో పగలగొడుతుంది. అందుకే దాన్ని అలా ఉండని. నువ్వు గాని తలుపు తీసావంటే నిన్ను కూడా లోపల పెట్టి గడియ పెట్టేస్తాను అంటూ తోటి కోడలికి చెప్తుంది కనకం.
మరోవైపు నువ్వు వచ్చిన దగ్గరనుంచి ఇంటిముందు ముగ్గులు, ఇంటి లోపల దీప దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఇల్లు కళకళలాడుతుంది అంటూ కావ్యని మెచ్చుకుంటుంది చిట్టి. అంటే ఇవన్నీ పెద్ద వదిన చేయలేదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నావా అంటుంది అపర్ణ. మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు అంటూ కోప్పడుతుంది అపర్ణ.
ప్రతిదానికి ఎందుకు పెడార్ధాలు తీస్తావు అంటూ మందలిస్తుంది ధాన్య లక్ష్మి. నువ్వు ఇంట్లో ఉంటూనే ఇంట్లో వాళ్ళందరికీ చిచ్చుపెట్టేయాలని చూస్తున్నావు. ఇలా చేయకు అంటూ మందలిస్తుంది చిట్టి. అప్పుడే రాజ్ ఒక గిఫ్ట్ తీసుకుని కిందికి వస్తాడు. ఏంటది అని అందరూ అడుగుతారు. నేను వదిలేసుకుందాం అనుకుంటున్న ప్రాజెక్ట్ ని కావ్య తన డిజైన్స్ తో ఆ కాంటాక్ట్ మనకి వచ్చేలాగా చేసింది.
మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు శాంపిల్ పీసులు రెడీ చేసి పంపించారు. అందుకే ఫస్ట్ పీస్ తనకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు రాజ్. అందరూ ఆనందిస్తారు కానీ కావ్య, అపర్ణ మాత్రం షాక్ అయిపోతారు. నువ్వు చేసిన పూజలకి కన్నయ్య ఈ విధంగా బహుమతి పంపించాడు అని కావ్యతో చెప్తూ.. నీ చేతులతోనే ఆమె మెడలో నక్లిస్ వెయ్యు అని రాజ్ కి చెప్తుంది చిట్టి.
రాజ్ అలాగే చేస్తాడు. బాగా ఎమోషనల్ అయిపోతుంది కావ్య. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. కావ్యకే కాదు నాకు కూడా గిఫ్ట్ కావాలి. మూడు నెలలు తిరిగేసరికి కావ్య తల్లి కాబోతుందని శుభవార్త నాకు వినిపించాలి అంటాడు సీతారామయ్య. తప్పదన్నట్లుగా సరే అంటాడు రాజ్. మళ్లీ షాక్ అవుతారు కావ్య, అపర్ణ. కావ్య అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు గదిలో ఉన్న అప్పు ఎలా అయినా అక్కడి నుంచి బయటపడాలని ట్రై చేస్తుంది.
ఇంతలో కళ్యాణ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. గోడలు దూకే పనిలో ఉన్నాను అంటూ గ్రౌండ్ గురించి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పు. ఆ తర్వాత గోడ దూకి పారిపోతుంది. అప్పు మళ్లీ ఎవరి తల పగలగొడుతుందో వెళ్లి ఆపాలి అనుకుని బయలుదేరుతాడు కళ్యాణ్. మరోవైపు కావ్య దగ్గరికి వచ్చిన చిట్టి ఎందుకమ్మా ఆ కన్నీరు అని అడుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ గారు. ఈరోజు ఇది నా ఇల్లు అనిపిస్తుంది.
ఇప్పటికీ నాకు గుర్తింపు వచ్చింది అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. ఆ మాత్రానికే ఆనంద పడిపోవాలా అంటుంది రుద్రాణి. మీరు నక్లెస్ విలువ చూస్తున్నారు, కానీ నేను ఆయన ప్రేమను చూస్తున్నాను అంటుంది కావ్య. ఇల్లు అన్నాక గొడవలు జరగకుండా ఉండవు. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఇద్దరు సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది చిట్టి.
ఇదంతా చూస్తున్న అపర్ణ కోపంతో రగిలిపోతూ కొడుకుని అక్కడినుంచి తను గదిలోకి తీసుకువెళ్లి ఏంటి ఇదంతా నువ్వు తనని భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది. నిజం చెప్పటానికి ఇష్టపడని రాజ్ నీ ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏది జరగదు. కానీ నేను చేసే ప్రతి పనికి కారణం ఉంటుంది. కొద్ది రోజులు నన్ను చూసి చూడకుండా వదిలేయ్ అంటాడు.
నువ్వు అలా చేస్తే కావ్య నీ మీద ఆశలు పెంచుకుంటుంది అంటుంది అపర్ణ. అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. రాజ్ తనకి తెలియకుండానే పెద్ద తప్పు చేస్తున్నాడు అని భయపడుతుంది అపర్ణ. మరోవైపు ఫ్రెండ్స్ తో కలిసి గ్రౌండ్లో గొడవ పడటానికి వెళుతుంది అప్పు. అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ గొడవ వద్దు లీగల్ గా వెళ్దాము అని వారిస్తాడు.
అయినా అతని మాట పట్టించుకోకుండా గ్రౌండ్ ఖాళీ చేయమంటూ ఎదుటి బ్యాచ్ తో గొడవకి దిగుతుంది అప్పు. ఆ గొడవలో కళ్యాణ్ కి చిన్నగా దెబ్బలు తగులుతాయి. తరువాయి భాగంలో తన ఫోన్ తీసుకుంటున్న కావ్య ని కోప్పడతాడు రాజ్.
కావ్య అక్కడ నుంచి వెళ్ళిపోయాక తనతో ఎంత ప్రేమగా ఉన్నట్టు నటిద్దామనుకున్నా ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది అనుకుంటూ ఆమె వెనకే వెళుతూ ఆమె చీర పట్టుకుంటాడు రాజ్. అప్పటికే కావ్య హాల్లోకి వచ్చేయడంతో అందరూ రాజ్ ప్రవర్తనకి షాక్ అవుతారు. అపర్ణ అయితే కోపంతో రగిలిపోతుంది.