- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నందుని ఘోరంగా అవమానించి లాస్య కొడుకు.. సంపాదన కోసం అనసూయ కొత్త అవతారం!
Intinti Gruhalakshmi: నందుని ఘోరంగా అవమానించి లాస్య కొడుకు.. సంపాదన కోసం అనసూయ కొత్త అవతారం!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే లక్కీ (Lucky) ఎవరికో అన్యాయం చేసి ఉంటారు అందుకే అలా జరిగింది అని అంటాడు. దాంతో నందు (Nandu) రేయ్ నిన్ను అంటూ విరుచుకు పడతాడు. లక్కీ తన తల్లి చాటిన దాక్కుంటాడు. ఇక నందు ఫ్రెండ్ శేఖర్ వచ్చి నా దగ్గర తీసుకున్న ఇరవై వేలు నాకు అర్జెంట్ గా కావాలి అని వస్తాడు.
శేఖర్ (Shekar) ఒక గంటలో నా డబ్బులు మొత్తం నాకు కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్కీ తులసి ఆంటీని ఏడిపించారు కదా బాగా అయ్యింది. బాడ్ బాయ్ అంటూ కామెంట్ చేస్తాడు. దానికి నందు మరింత కోపం వ్యక్తం చేస్తాడు. మరోవైపు తులసి (Tulasi) పిల్లలతో బంతి ఆట ఆడుతుంది.
ఇక మరోవైపు అనసూయ (Anasuya) చేఫ్ మాస్టర్ కాస్ట్యూమ్స్ వేసుకొని కిచెన్ లో హడావిడి చేస్తూ ఉంటుంది. మరోవైపు నందు ఎలాగో సంపాదన లేదు ఖర్చు లైన తగ్గించుకొని బస్సులో వెళతాను అని లాస్య తో అంటాడు. ఇక లాస్య (Lasya) నా ఒక్కదాని సంపాదనతో ఇల్లు గడవదు నువ్వు కూడా జాబ్ ట్రై చెయ్ అని కోపం పడుతుంది.
మరోవైపు ప్రేమ్ (Prem) తన ఓనర్ ని నాకు అవసరాలు ఉన్నాయి జీతం ఇప్పించండి సార్ అని అంటాడు. నీకు ఉద్యోగమే లేదు జీతం ఏమిటి? అని ఓనర్ అవమాన పరుస్తాడు. ఇక నన్నే మోసం చేశావా అంటూ ఫ్రేమ్ ఓనర్ చొక్కా పట్టుకున్నాడు. దాంతో ప్రేమ్ ను బయటకు గెంటేస్తారు. మరోవైపు తులసి (Tulasi) సరుకుల కోసం వెళ్ళాలి అని అనుకుంటుంది.
తులసి (Tulasi) కిరాణా షాప్ కి వెళ్లి సరుకులు తీసుకుంటుంది. తగిన డబ్బు లేకపోవడంతో తులసి కొన్ని సరుకులు వద్దు అని చెబుతుంది. దాంతో ఆ షాపు ఓనర్ తులసి ను అనేక రకాలుగా అవమానిస్తాడు. ఇక అది గమనించిన ప్రేమ్ (Prem) ఆ షాపు ఓనర్ చొక్కాపట్టుకుని మందలిస్తాడు.
ఆ తర్వాత లాస్య (Lasya) తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి తన ఫ్రెండ్ ని ఒప్పిస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన తన ఫ్రెండ్ మా ఆయన ఒప్పుకోవడం లేదు అని లాస్య కు చెబుతుంది. లాస్య.. తులసి (Tulasi) తనకు మాయమాటలు చెప్పిందని అపార్ధం చేసుకుంటుంది. దాంతో తులసి, లాస్య ల మధ్య క్లాష్ జరుగుతుంది.