- Home
- Entertainment
- ఘాటి ట్విట్టర్ రివ్యూ: కాటేరమ్మలా అనుష్క ఊచకోత, పెద్ద మైనస్ అదే.. ఈసారైనా డైరెక్టర్ క్రిష్ హిట్టు కొట్టారా
ఘాటి ట్విట్టర్ రివ్యూ: కాటేరమ్మలా అనుష్క ఊచకోత, పెద్ద మైనస్ అదే.. ఈసారైనా డైరెక్టర్ క్రిష్ హిట్టు కొట్టారా
అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి నేడు సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నుంచి వస్తున్న చిత్రం కావడంతో మంచి బజ్ ఉంది. టీజర్, ట్రైలర్స్ లలో అనుష్కని మాస్ అవతారంలో ప్రజెంట్ చేశారు. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్ర యుఎస్ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. మరి అనుష్క శెట్టి యాక్షన్ మూవీ మెప్పించిందా ? ఈసారైనా డైరెక్టర్ క్రిష్ హిట్ అందుకున్నారా అనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
అనుష్క శెట్టి టాలీవుడ్ గ్లామర్ తో పాటు తాను చేసిన సోలో చిత్రాలతో మాస్ ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది. అందుకే నిర్మాతలు అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతుంటారు. డైరెక్టర్ క్రిష్ ఘాటి చిత్రంలో ఒక క్రిమినల్ లెజెండ్ గా ఎలా మారింది అనే కాన్సెప్ట్ తో కథ నడిపించారు. ప్రీమియర్ షోల నుంచి ఘాటి చిత్రానికి కాస్త మిక్స్డ్ టాక్ కూడా వస్తోంది.
ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉందని ప్రేక్షకులు ట్వీట్స్ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బావుందని అంటున్నారు. కానీ దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఏమాత్రం ఆకట్టుకోలేదు అని అంటున్నారు. అక్కడక్కడా అనుష్కని ఎలివేట్ చేసేలా కొన్ని మాస్ మూమెంట్స్ పడ్డాయి. అవి బావున్నాయి.
ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అనుష్క శెట్టి రెచ్చిపోయిందట. కొన్ని సన్నివేశాల్లో అనుష్క కాటేరమ్మ కనిపించింది అని, ఊచకోత కోసింది అని ప్రేక్షకులు అంటున్నారు. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. వారి పెర్ఫార్మెన్స్ లు కూడా బాగానే ఉంటాయి.
ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా ఎంగేజ్ చేసే సీన్లు ఉంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే వచ్చింది. మిగిలిన సన్నివేశాలు సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు అని అంటున్నారు. సెకండ్ హాఫ్ అయినా మెరుగ్గా ఉంటుంది అంటుకునే అది కూడా జరగలేదు. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్లు ఎక్కువయ్యాయి. లెన్తీ గా ఉండే యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు బోరింగ్ గా అనిపిస్తాయి.
సాధారణంగా డైరెక్టర్ క్రిష్ ఎంచుకునే కథలు, తెరకెక్కించే విధానం ప్రేక్షకులలో ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. కానీ ఘాటి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. పదునైన డైలాగులు కూడా లేవు. సాగర్ నాగవెల్లి అందించిన మ్యూజిక్ ఏమాత్రం ఇంప్రెసివ్ గా లేదు. మొత్తంగా ఘాటి చిత్రానికి ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే అనుష్క క్రేజ్ తో ఏదైనా మ్యాజిక్ జరగాల్సిందే.