'ఓజీ' విషయంలో అంతా ఓకే, అదొక్కటే లోపం.. ప్రొడక్షన్ హౌస్ ని ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఒక విషయంలో ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్ పై ఆగ్రహంతో ఉన్నారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “దే కాల్ హిమ్ OG” ఇప్పటికే భారీ బజ్ సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో $1 మిలియన్ మార్క్‌ను వేగంగా దాటిన తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ సాధించింది. ఓజీ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్ కంటెంట్ టీజర్స్, సాంగ్స్ అవుట్ పుట్ విషయంలో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఒకే ఒక్క లోటు కనిపిస్తుంది. ఆ విషయంలో ప్రొడక్షన్ హౌస్ మీద కోపంగా ఉన్న ఫ్యాన్స్ ఏకిపారేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఓజీ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అయితే ఇంతవరకు హిందీలో ప్రమోషన్స్ మొదలు కాలేదు. ట్రైలర్ ని త్వరగా రిలీజ్ చేయాలనే డిమాండ్ కంటే, హిందీ ప్రమోషన్స్‌ను వెంటనే ప్రారంభించాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ టాప్-నాచ్ క్వాలిటీగా ఉన్నాయని, హిందీ మార్కెట్‌ను ఆకట్టుకునే స్థాయిలో సినిమా ఉందని అభిమానులు నమ్ముతున్నారు. అయితే, ఇప్పటివరకు హిందీలో ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రాకపోవడం తో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల అభిప్రాయం ప్రకారం, “OG” హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలను కలిగి ఉంది. ఆయన గత చిత్రం “హరిహర వీర మల్లు” ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ OG లోని స్టైలిష్ టేకింగ్, కొత్తదనంతో యువతరాన్ని బాగా కనెక్ట్ చేస్తోందని వారు భావిస్తున్నారు. ప్రత్యేకంగా, పవన్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, అది హిందీలో రాకపోవడం పెద్ద లోటుగా భావిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ఆయన కెరీర్ ఇటీవల ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఆయనకున్న ప్రత్యేక అభిమాన వర్గం ఇప్పటికీ బలంగానే ఉంది. తాజా గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీని చూపించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. మేకర్స్ ఆయన పాపులారిటీని హిందీ మార్కెట్‌లో సరిగ్గా ఉపయోగిస్తే, “OG” హిందీలో కూడా మంచి ఓపెనింగ్ సాధించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతిమంగా, సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది అనేది సుజీత్ టేకింగ్, ప్రెజెంటేషన్‌పై ఆధారపడి ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, హిందీ ప్రమోషన్స్ తక్షణమే మొదలవ్వాలని కోరుతున్నారు.