MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Anupama: ఓ వైపు సైకలాజికల్‌ థ్రిల్లర్‌, మరోవైపు `క్రేజీ కల్యాణం`.. అనుపమా పరమేశ్వరన్‌ బర్త్ డే ట్రీట్‌

Anupama: ఓ వైపు సైకలాజికల్‌ థ్రిల్లర్‌, మరోవైపు `క్రేజీ కల్యాణం`.. అనుపమా పరమేశ్వరన్‌ బర్త్ డే ట్రీట్‌

అనుపమా పరమేశ్వరన్‌ నేడు తన 30వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆమె కొత్త సినిమాల అప్‌ డేట్లు వచ్చాయి. ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌తోపాటు `క్రేజీ కల్యాణం` అనే చిత్రాల్లో నటిస్తోంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 19 2026, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనుపమా పరమేశ్వరన్‌ బర్త్ డే స్పెషల్‌
Image Credit : Asianet News

అనుపమా పరమేశ్వరన్‌ బర్త్ డే స్పెషల్‌

అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు విలక్షణ నటిగా మారిపోయింది. గ్లామర్‌ పాత్రలకంటే నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలతో అలరిస్తుంది. గతేడాది ఆమె `పరదా` వంటి కంటెంట్‌ బేస్డ్, ఉమెన్‌ ఓరియెంటెడ్‌ బేస్డ్ మూవీ చేసిన విషయం తెలిసిందే. చాలా సెలక్టీవ్‌గానే వెళ్తోంది, అదే సమయంలో మంచి బలమైన కథలతో వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె కొత్తగా రెండు సినిమాలను ప్రకటించింది. అందులో ఒకటి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కాగా, మరోటి కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ `క్రేజీ కల్యాణం` ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సైకలాజికల్‌ థ్రిల్లర్‌ తో రాబోతున్న అనుపమా పరమేశ్వరన్‌
Image Credit : Asianet News

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ తో రాబోతున్న అనుపమా పరమేశ్వరన్‌

సైకాలజికల్‌ థ్రిల్లర్‌ మూవీ గురించి చూస్తే ఇందులో తనే మెయిన్‌ లీడ్‌గా చేస్తోంది. ఎస్‌కేజీ ఎంటర్టైన్‌మెంట్‌, బెంచ్‌ మార్క్ స్టోరీ టెల్లర్స్ సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నాయి. ఆర్జే షాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివిన్‌ నారంగ్‌, ప్రేరణ అరోరా, కిరణ్‌ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఓ స్టూడియో భాగస్వామ్యంలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. గతంలో అనుపమ–షాన్ కాంబినేషన్‌లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌కు అద్భుత స్పందన రావడంతో.. ఇప్పుడు అదే కాంబోలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

35
మేలో ఈ మూవీ ప్రారంభం
Image Credit : Asianet News

మేలో ఈ మూవీ ప్రారంభం

ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. మూవీ టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. అనుపమ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఇటీవలే 'జటాధర' మూవీని నిర్మించిన ఎస్కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ సంస్థ నిర్మాణంను మరింత విస్తరిస్తోంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.

45
అనుపమా మరో మూవీ క్రేజీ కల్యాణం
Image Credit : Asianet News

అనుపమా మరో మూవీ క్రేజీ కల్యాణం

మరో మూవీ `క్రేజీ కల్యాణం` మూవీ గురించి చూస్తే అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందుతుంది. నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.

55
కీర్తిగా మెరవబోతున్న అనుపమా
Image Credit : Asianet News

కీర్తిగా మెరవబోతున్న అనుపమా

అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ `క్రేజీ కల్యాణం` మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పెళ్లి కూతురిగా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అనుపమ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Uday Kiran: ఈ ఒక్క సినిమా రిలీజ్‌ అయి ఉంటే ఉదయ్‌ కిరణ్‌ బతికేవాడు.. ఆయన చివర్లో కోరుకున్నది ఇదే
Recommended image2
Chiranjeevi Surekha: నువ్వే నా బలం, నీ వల్లనే నేనీ స్థాయిలో ఉన్న.. భార్య సురేఖ బర్త్ డే వేళ చిరంజీవి ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved