MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Chiranjeevi Surekha: నువ్వే నా బలం, నీ వల్లనే నేనీ స్థాయిలో ఉన్న.. భార్య సురేఖ బర్త్ డే వేళ చిరంజీవి ఎమోషనల్‌

Chiranjeevi Surekha: నువ్వే నా బలం, నీ వల్లనే నేనీ స్థాయిలో ఉన్న.. భార్య సురేఖ బర్త్ డే వేళ చిరంజీవి ఎమోషనల్‌

మెగాస్టార్‌ చిరంజీవి తన భార్య సురేఖని ఉద్దేశించి ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. ఆమెనే తన బలం అని ప్రకటించారు. తన వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని వెల్లడించారు చిరంజీవి. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 18 2026, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భార్య సురేఖకి చిరంజీవి బర్త్ డే విషెస్‌
Image Credit : X/@KChiruTweets

భార్య సురేఖకి చిరంజీవి బర్త్ డే విషెస్‌

మెగాస్టార్‌ చిరంజీవి భార్య సురేఖ నేడు పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన భార్యని ఉద్దేశించి చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఆమెకి సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ తెలిపారు. అయితే ఇందులో భార్య తన జర్నీలో ఎంతటి కీలక పాత్ర పోషించిందనేది వెల్లడించారు చిరంజీవి. ఆమె వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నట్టు వెల్లడించారు. తాను వర్క్ పై దృష్టి పెట్టడం వెనుక ఆమె పాత్ర ఎంతో ఉందని, కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకుందని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నా హార్ట్ కృతజ్ఞతతో నిండిపోయింది
Image Credit : X/@KChiruTweets

నా హార్ట్ కృతజ్ఞతతో నిండిపోయింది

ఫ్యామిలీలో కలిసిపోవడమే కాదు, బాధ్యతలు తీసుకుందని, కోడలుగా కాకుండా కూతురిలా తమ పేరెంట్స్ ని చూసుకుందని వెల్లడించారు. ఆమె తన బలమని ప్రకటించారు చిరంజీవి. ఆయన చెబుతూ, `ఫిబ్రవరి 20, 1980న మేము వివాహం చేసుకున్న రోజు నుండి నువ్వే నా గొప్ప బలం. ఈ రోజు నీ పుట్టిన రోజును, అలాగే ముందుగానే మన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున, నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.

35
నా విజయ రహస్యం నువ్వే, నా బలం నువ్వే
Image Credit : X/@KChiruTweets

నా విజయ రహస్యం నువ్వే, నా బలం నువ్వే

`నువ్వు మన కుటుంబానికి కేంద్రకం, మా అందరినీ ప్రేమతో బంధించే వ్యక్తివి నువ్వు. నా కుటుంబాన్ని ఆలింగనం చేసుకున్నావు, ప్రతి క్షణంలో వారికి అండగా నిలిచావు. నా తల్లిదండ్రులు నిన్ను సమానమైన ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నట్లే, వారికి నిజమైన కుమార్తె అనిపించుకున్నావు. వారిని అంతే బాగా చూసుకుంటున్నావు. నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే, అది నా ప్రతిభ, కృషి కాదు, "అది నువ్వే". నువ్వు ప్రతి బాధ్యతను ప్రశాంతంగా నిర్వర్తించడం వల్లే నేను పూర్తిగా నా కెరీర్‌పై దృష్టి పెట్టగలిగాను. ప్రతి సంక్షోభంలో, ప్రతి వేడుకలో, మమ్మల్ని కలిపి ఉంచేది నువ్వే. నువ్వు నా భార్య మాత్రమే కాదు, నువ్వే నా బలం, నా సపోర్టింగ్‌ సిస్టమ్‌,  నా శాంతి.

45
నీ వల్లే నేనున్నా- చిరంజీవి
Image Credit : X/@KChiruTweets

నీ వల్లే నేనున్నా- చిరంజీవి

ఈరోజు నీ పుట్టినరోజు త్వరలో మన వివాహ వార్షికోత్సవాన్ని సమీపిస్తున్న తరుణంలో, నేను నా హృదయం నుండి చెప్పాలనుకుంటున్నాను.. నేను మీ వల్లనే ఉన్నాను. నా ప్రేమతో ఎల్లప్పుడూ, ఎప్పటికీ.. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకి జన్మదిన శుభాకాంక్షలు` అని తెలిపారు చిరంజీవి. మొత్తంగా తన క్రెడిట్‌ మొత్తం భార్య సురేఖకి ఇచ్చేశారు చిరంజీవి. అంతేకాదు తన ప్రతి పదంలో ఆమె బాధ్యతని, ఆమెపై తనకున్న ప్రేమని తెలియజేశారు . ఎమోషనల్‌గా ఈ పోస్ట్ పెట్టారు చిరు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు ❤️ 
Happy Birthday to dearest Surekha.

From the day we got married on February 20, 1980, you have been my greatest strength. As we celebrate your birthday today and our wedding anniversary in advance, my heart is… pic.twitter.com/H0J6sE7kTK

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2026

55
`మన శంకర వరప్రసాద్‌ గారు`తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన చిరు
Image Credit : X/@Shine_Screens

`మన శంకర వరప్రసాద్‌ గారు`తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన చిరు

చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇది రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. `సంక్రాంతికి వస్తున్నాం`, `ఓజీ` వంటి చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేసింది. దీంతో చిరంజీవి తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి చూపించారు. ప్రస్తుతం ఆయన బాబీతో సినిమాకి రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో దీన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. వీటితోపాటు ఇప్పటికే నటించిన `విశ్వంభర` మూవీ జులైలో విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌
Recommended image2
Chiranjeevi: డాన్స్‌లో పోటీ ఇచ్చిన హీరోయిన్‌కి చిరంజీవి స్వీట్‌ వార్నింగ్‌.. కెమిస్ట్రీ కోసం ఆరాటం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved