MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Uday Kiran: ఈ ఒక్క సినిమా రిలీజ్‌ అయి ఉంటే ఉదయ్‌ కిరణ్‌ బతికేవాడు.. ఆయన చివర్లో కోరుకున్నది ఇదే

Uday Kiran: ఈ ఒక్క సినిమా రిలీజ్‌ అయి ఉంటే ఉదయ్‌ కిరణ్‌ బతికేవాడు.. ఆయన చివర్లో కోరుకున్నది ఇదే

ఉదయ్‌ కిరణ్‌ సక్సెస్‌ లు లేక, డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఈ ఒక్క సినిమా రిలీజ్‌ అయి ఉంటే ఆయన ఇప్పుడు మన మధ్య ఉండేవారట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 18 2026, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రెండేళ్లకే స్టార్‌ అయిపోయిన ఉదయ్‌ కిరణ్‌
Image Credit : our own

రెండేళ్లకే స్టార్‌ అయిపోయిన ఉదయ్‌ కిరణ్‌

ఉదయ్‌ కిరణ్‌.. లవర్‌ బాయ్‌ అనే పదానికి మారుపేరు. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి మెప్పించాడు. హిట్లు అందుకున్నాడు. వేగంగా స్టార్‌ హీరో అయిపోయాడు. ఆయన హీరోగా పరిచయం అయిన రెండేళ్లలోనే టాలీవుడ్‌లోనే టాప్‌ హీరోగా మారిపోయాడు. ఎవరికీ లేని క్రేజ్‌ ఆయనకు సొంతమైంది. అమ్మాయిల ఫాలోయింగ్‌ అయితే ఊహించడం కష్టమే. ఎంత వేగంగా ఎదిగాడో, అలానే డౌన్‌ అయ్యాడు. చాలా రోజులు సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అయ్యాడు. కానీ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ఒక్క మూవీ రిలీజ్‌ అయితే ఉదయ్‌ కిరణ్‌ ఇప్పుడు మన మధ్య ఉండేవాడట.

26
ఆగిపోయిన ఉదయ్‌ కిరణ్‌ సినిమాలు
Image Credit : our own

ఆగిపోయిన ఉదయ్‌ కిరణ్‌ సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌లో చాలా ఆటుపోట్లు చూశాడు. కానీ తట్టుకోలేకపోయాడనేది ఆయన గురించి తెలిసినవాళ్లు చెప్పే మాట. ఎందుకంటే ఆయన నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయట. ప్రారంభంలో ఓకే చెప్పి మధ్యలోనే ఆపేసేవారట. కొన్ని ప్రారంభోత్సవం చేసి ఆగిపోవడం, మరికొన్ని స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు ఓ మూవీ అయితే ఏకంగా  ఎనభై శాతం షూటింగ్‌ పూర్తయిన తర్వాత పక్కన పెట్టారట. దీని వెనుక కొందరి హస్తం ఉందని అంటుంటారు.

Related Articles

Related image1
MaheshBabu Next Lineup.. `వారణాసి` రిలీజ్‌కి ఇంకా ఏడాది ఉంది, అప్పుడే క్యూలో ఐదు.. మహేష్‌ క్రేజ్‌ వేరే లెవల్‌
Related image2
Supritha: ఆఫర్‌ ఉంది రమ్మని హ్యాండిస్తారు, ఆ పిచ్చి వదలరా.. సురేఖ వాణి కూతురు సుప్రీత బోల్డ్ కామెంట్స్
36
ఆగిపోయిన `ప్రేమంటే సులువు కాదురా`
Image Credit : our own

ఆగిపోయిన `ప్రేమంటే సులువు కాదురా`

కానీ ఈ మూవీ షూటింగ్‌ పూర్తయి రిలీజ్‌ అయితే మాత్రం పెద్ద హిట్‌ అయ్యేదని, ఇప్పుడు ఉదయ్‌ కిరణ్‌ మన మధ్య ఉండేవారని చెప్పారు మ్యూజిక్‌ జోస్యభట్ల. ఉదయ్‌ కిరణ్‌ నటించిన `ప్రేమంటే సులువు కాదురా` సినిమా 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని చివరి దశలో ఆగిపోయింది. ఈ మూవీ పూర్తి అయి విడుదలైతే ఉదయ్‌ కి పెద్ద హిట్‌ అయ్యేదని, ఆ దెబ్బతో సూపర్‌ స్టార్‌గా ఎదిగేవాడని మ్యూజిక్‌ డైరెక్టర్ జోస్యభట్ల వెల్లడించారు. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు తెలియదన్నారు. కానీ ఏదో జరిగిందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత. అంతటి పెద్ద నిర్మాత ఈ మూవీని ఎందుకు ఆపేశారో అర్థం కాలేదన్నారు. 

46
ఉదయ్‌ కిరణ్‌కి లైఫ్‌ వచ్చే మూవీ
Image Credit : our own

ఉదయ్‌ కిరణ్‌కి లైఫ్‌ వచ్చే మూవీ

ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతికృష్ణ కూడా మధ్యలో ఆ మూవీని పూర్తి చేయాలని ప్రయత్నించారట. కానీ సాధ్యం కాలేదని, ఏం జరిగిందో తెలియదన్నారు. జనసేనకి పాటని చేసినప్పుడు జ్యోతి కృష్ణ కలిశాడని, ఆ టైమ్‌లో ఈ ప్రస్తావన వచ్చిందన్నారు. నిర్మాత ఏఎం రత్నం కూడా అనేవారట. ఈ మూవీతో ఉదయ్‌ కిరణ్‌కి మంచి లైఫ్‌ వస్తుందని. కానీ ఏదో జరిగింది, ఉదయ్ కిరణ్‌ కి లైఫ్‌ని తలక్రిందులు చేసిందని జోస్యభట్ల వెల్లడించారు. ఏం జరిగిందో ఏమో గానీ, `ప్రేమంటే సులువు కాదురా` మూవీ విడుదలై, పెద్ద హిట్‌ అయితే మాత్రం ఇప్పుడు ఉదయ్‌ కిరణ్‌ మన మధ్య ఉండేవాడు. ఆయన సినిమాలను మనం ఎంజాయ్‌ చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్‌ హీరోగా రాణించేవారని జోస్యభట్ల తెలిపారు.

56
`అత్తారింటికి దారేదీ` లాంటి మూవీ చేయాలనుకున్న ఉదయ్‌ కిరణ్‌
Image Credit : svcc

`అత్తారింటికి దారేదీ` లాంటి మూవీ చేయాలనుకున్న ఉదయ్‌ కిరణ్‌

 ఇదిలా ఉంటే ఉదయ్‌ కిరణ్‌కి చివర్లో ఒక కోరిక ఉండేది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `అత్తారింటికి దారేదీ` మూవీ పెద్ద హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని చూసి ఇలాంటి మంచి ఫ్యామిలీ మూవీ చేయాలని ఉండేదట. ఈ విషయాన్ని దర్శకుడు వీఎన్‌ ఆదిత్యకి చెప్పారట. అలాంటి కథలు చూడమని, తాను చేస్తానని తెలిపారట. కానీ కొన్నాళ్లకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సెప్టెంబర్‌ 27న `అత్తారింటికి దారేదీ` మూవీ రిలీజ్‌ అయితే, 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

66
ఉదయ్‌ కిరణ్‌ సినిమాలు
Image Credit : facebook.com/UdayKiran.OfficialPage

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలు

సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ్‌ కిరణ్‌.. చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లోకి రావాలనుకున్నారు. `చిత్రం` మూవీతో అవకాశాన్ని దక్కించుకున్నాడు. `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`, `కలుసుకోవాలని` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత `శ్రీరామ్‌`, `హోలీ`, `నీ స్నేహం`, `నీకు నేను నాకు నువ్వు`, `లవ్‌ టుడే`, `ఔనన్నా కాదన్నా`, `వియ్యాల వారి కయ్యాలు`, `గుండె ఝల్లుమంది`, `ఏకలవ్యుడు`, `నువ్వెక్కడుంటే నేనక్కడుంటా`, `జై శ్రీరామ్‌` వంటి చిత్రాల్లో నటించాడు. చివర్లో `చిత్రం చెప్పిన కథ` మూవీ రిలీజ్‌ కావాల్సింది. ఆయన చనిపోవడంతో ఆగిపోయింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah: విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్‌లాక్ ఇస్తా.. తమన్నా కామెంట్స్
Recommended image2
Hero Suhas: స్టార్‌ హీరోయిన్‌ ముందు అవమానించారు, కానీ కీర్తిసురేష్‌తో చేశా.. సుహాస్‌ ఎమోషనల్‌
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 18: అడ్డంగా దొరికిపోయిన సాగర్, ఇంటికొచ్చి రచ్చ చేసిన వనజ
Related Stories
Recommended image1
MaheshBabu Next Lineup.. `వారణాసి` రిలీజ్‌కి ఇంకా ఏడాది ఉంది, అప్పుడే క్యూలో ఐదు.. మహేష్‌ క్రేజ్‌ వేరే లెవల్‌
Recommended image2
Supritha: ఆఫర్‌ ఉంది రమ్మని హ్యాండిస్తారు, ఆ పిచ్చి వదలరా.. సురేఖ వాణి కూతురు సుప్రీత బోల్డ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved