- Home
- Entertainment
- Prema Entha Madhuram: మాన్సీ చెంప పగలగొట్టిన అను.. అందరి ముందు మరదలి గుట్టు రట్టు చేసిన ఆర్య!
Prema Entha Madhuram: మాన్సీ చెంప పగలగొట్టిన అను.. అందరి ముందు మరదలి గుట్టు రట్టు చేసిన ఆర్య!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి రేటింగ్ తో అందరి హృదయాలని దోచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ భార్యాభర్తలు ఒక్క మాట మీదే ఉండాలి అనుకునే ఆదర్శ దంపతుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో పానకం తాగుదాం అనుకొని గ్లాస్ అందుకుంటుంది అను. సరిగ్గా అప్పుడే అందులో బల్లి పడుతుంది. భయంతో గ్లాస్ కింద వదిలేస్తుంది అను. అది చూసి షాక్ అవుతుంది మాన్సీ. ఒంగోని గ్లాస్ తీయబోతున్న అనుని చూసి నిండు కడుపుతో అలా వంగుంటే కడుపులో బిడ్డ కడుపులోనే పోవచ్చు అంటుంది. లాగి చెంపమీద కొడుతుంది అను. మనిషి పుట్టుక పుట్టి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా, నీకు వీలైతే తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా దీవించు లేదంటే నోరు మూసుకొని ఊరుకో అంతేకానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే పళ్ళు రాలుతాయి అంటుంది అను.
నన్నే కొడతావా ఇప్పుడే మామ్ ఇన్ లా కి చెప్తాను అంటుంది మాన్సీ. వెళ్లి చెప్పండి మీరు ఇలా అన్నారని తెలిస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఊహించుకోండి. అలాగే మా అమ్మకి తెలిస్తే ఉప్పు, కారం తినిపించి మరీ చంపేస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది అను. నాకే చెమటలు పట్టిస్తావా నీ సంగతి చెప్తాను. జన్మలో ఆ ఇంట్లో అడుగుపెట్టనివ్వను అనుకుంటుంది మాన్సీ. పూజ పూర్తయిన తర్వాత వాళ్ల ఇంటికి బయలుదేరబోతున్న ఆర్య దంపతులను తనతో పాటు తీసుకువెళ్లి వాళ్ళిద్దరికీ కాళ్లు కడిగి పాదపూజ చేస్తాడు నీరజ్.
నాకు చిన్నప్పటినుంచి ఫ్రెండు, నాన్న, అన్న అన్ని మీరే. తప్పటడుగులు వేయించింది అమ్మే కానీ తప్పుడు అడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నది మాత్రం మీరే. అలాంటిది జీవితంలో మొదటిసారి తప్పు చెప్పుడు మాటలు విని మీ ఇద్దరి పట్ల అనుచితంగా ప్రవర్తించి మీ ఇద్దరినీ బాధ పెట్టాను. అందుకే నా కన్నీళ్ళతో మీ కాళ్లు కడుగుతున్నాను అనుకోని నన్ను క్షమించండి అంటూ కన్నీరు పెట్టుకుంటాడు నీరజ్. ఆర్య, నీరజ్ ని దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు. తప్పు పరిస్థితులది కానీ నీది కాదు అంటాడు ఆర్య. ఆ పరిస్థితులకి లోబడటం నాదే తప్పు అందుకే అందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను అంటాడు నీరజ్.
దయచేసి వచ్చి కారు ఎక్కండి మన ఇంటికి వెళ్లి పోదాము అంటూ రిక్వెస్ట్ చేస్తాడు నీరజ్. అలా జరగకూడదు అనుకుంటుంది మాన్సీ. నువ్వు కోరుకున్న మార్పు వచ్చింది కదా రావడానికి ఇంకా ఎందుకు ఆలోచన అంటాడు జెండే. నేను కోరుకున్న మార్పు ఇది కాదు అంటాడు ఆర్య. ద్వేషం నిండిన మనసుల్లో ఆప్యాయత నిండినప్పుడే మా ఇంటికి తిరిగి వస్తాను అంటూ మాన్సీ చూసి ఉంటాడు ఆర్య. నీరజ్ నీ అహాన్ని పక్కనపెట్టి దాదా వదినమ్మలని ఇంటికి రమ్మని చెప్పు అంటూ మాన్సీ ని ఆర్య వాళ్ళ దగ్గరికి లాక్కుని వెళ్తాడు.
అంటే వీళ్ళు నా వల్లే వెళ్ళిపోయారంటారా, సరే అలాగే అనుకుందాం కానీ ఎందుకు అలా చేశానో మీకు కూడా తెలుసు కదా ఈ అను నన్ను తల్లిని కాకుండా చేసింది. ఒక్క నెల రోజులు వాళ్లు ఇంటికి దూరంగా ఉంటేనే అంత బాధ పడిపోతున్నారు అలాంటిది జీవితాంతం నేను తల్లిని కాలేను నా బాధ మీ ఎవరికీ కనిపించడం లేదా అంటుంది మాన్సీ. ఏదో పొరపాటు జరిగింది ఒక ఆడదాన్ని మాతృత్వాన్ని దూరం చేసే అంత కసాయి దాన్ని కాదు అంటుంది అను. నిప్పుకి చెదలు పట్టవు అనేది ఎంత నిజమో అను తప్పు చెయ్యదు అనేది కూడా అంతే నిజం అంటాడు జెండే.
కరెక్ట్ గా చెప్పావు జెండే నువ్వు ఎన్నిసార్లు అవమానించినా వదినమ్మ నిన్ను ఎన్నోసార్లు వెనకేసుకొచ్చింది అలాంటి తను నీకెందుకు ద్రోహం చేస్తుంది అంటాడు నీరజ్. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అంటుంది మాన్సీ. సీతారాములు సాక్షిగా నేను ఏ నేరము చేయలేదు ఉంటుంది అను. నువ్వు ఎన్ని చెప్పినా ఆ నేరం నువ్వే చేశావు అంటూ గట్టిగా అరుస్తుంది మాన్సీ. ఇంకొకసారి నా భార్య మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదు. నేరం చేయలేదు అనటానికి నీ దగ్గరె సాక్ష్యం ఉంది ఉంటాడు ఆర్య. నా దగ్గర సాక్ష్యం ఉండటం ఏంటి అంటూ కంగారుపడుతుంది మాన్సీ.
నీ ఫోన్ ఇలా ఇవ్వు అంటాడు ఆర్య. ఇది నా పర్సనల్ ఇందులో ఆఫీస్ కి సంబంధించిన మెయిల్స్ అన్ని ఉంటాయి అంటుంది మాన్సీ. అందులోనే అసలు రహస్యం దాగుంది అంటాడు ఆర్య. దాదా అడుగుతున్నాడు కదా ఇవ్వు అంటూ ఆ ఫోన్ లాక్కొని ఆర్యకి ఇస్తాడు నీరజ్. మాన్సీ అప్పట్లో అందరికీ చూపించిన వీడియోని మళ్లీ చూపించి అప్పట్లో మాన్సీ ఇదే మీ అందరికీ చూపించింది కానీ ఇది ఎడిట్ చేసిన వీడియో. ఎడిట్ చేయకముందు వీడియో చూస్తే నిజం ఏంటో మీ అందరికీ తెలుస్తుంది అంటూ ఒరిజినల్ వీడియో చూపిస్తాడు ఆర్య. అది చూసిన నీరజ్, మాన్సీ మీద కోపంతో రగిలిపోతాడు.
అను కోసం నువ్వు ప్రిపేర్ చేసిన ప్రసాదాన్ని బౌల్స్ మారిపోవటం వల్ల నువ్వే తిన్నావు.నీ పాపం నిన్నే తిప్పి కొట్టింది అదే విషయాన్ని అను నీకు చెప్తే దాన్ని ఎడిట్ చేసి నీకు అనుకూలంగా మార్చుకుని అంత డ్రామా క్రియేట్ చేసావు.ఈ విషయం నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగినప్పుడు మెయిల్స్ చెక్ చేస్తుంటే ఇది నా కంటపడింది కానీ నా తమ్ముడి కాపురంలో చిచ్చు పెట్టకూడదని సైలెంట్ గా ఉరుకున్నాను అంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.