Prema Entha Madhuram: కూతుర్ని కాపాడుకున్న ఆర్య.. అంజలికి మొదలైన కొత్త తలనొప్పులు?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తోటి కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటికీ ఆమెపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న ఒక తోటి కోడలు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఇక్కడనుంచి వెళ్ళిపోదాం అంటూ బామ్మని కంగారు పెడుతుంది అను. వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఈ మందు తప్పనిసరిగా వేయించాలి అని సిస్టర్ చెప్పడంతో బామ్మ అను నీ మందలించి పాపకి వ్యాక్సిన్ వేయించి తీసుకు రమ్మంటుంది. తప్పక సిస్టర్ వెనుక వెళ్తుంది అను.
సిస్టర్ పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. అనుని బయట ఉండమంటుంది. అప్పుడే ఆర్య లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అది గమనించిన మాన్సీ నన్నే కొడతావా ఇప్పుడు చూడు నిన్ను ఎలా టార్చర్ పెడతానో అనుకొని గొంతు మార్చి అను అని గట్టిగా పిలుస్తుంది. ఆ పిలుపుకి ఆర్య ఎలర్ట్ అవుతాడు. అను మాత్రం కంగారు పడి పక్క రూమ్ లో దాక్కుంటుంది.
ఆర్య మళ్లీ వెనక్కి వచ్చి అను ఉందేమో అని వెతుకుతాడు కానీ ఎక్కడ కనిపించకపోవడంతో వెళ్లిపోతూ ఉంటాడు. ఇంతలో సిస్టర్ పాపను తీసుకుని బయటికి వస్తుంది. దాక్కున్న అనుని చూసి అక్కడ ఏం చేస్తున్నారు. నాకు లోపల పేషెంట్ వెయిట్ చేస్తున్నారు పాపని తీసుకోండి అంటుంది. ఆర్య ఇంకా తనకి కనిపించేంత దూరంలో ఉండటంతో ఐదు నిమిషాలు వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది అను.
సరే అయితే ఇక్కడ వీల్ చైర్ లో పెడతాను మీరు తీసుకోండి నేను వెళ్తాను అని గబగబా సిస్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆర్య కూడా టర్నింగ్ తిరిగి పక్కకి వెళ్లిపోతాడు. అను కొంచెం రిలాక్స్ అయ్యి పాపను తీసుకుందాం అనేటప్పటికీ ఆ వీల్ అదుపుతప్పి ముందుకు వెళ్ళిపోతుంది. కంగారుపడిన అను పాప అంటూ అరుస్తూ ముందుకు వెళుతుంది. ఆ వీల్ చైర్ ఫాస్ట్ గా వెళ్లి గోడకి గుద్దుకొని పాప కింద పడిపోబోతుంది.
సడన్ గా ఆర్య చెయ్యి అడ్డుపెట్టి పాపని రక్షిస్తాడు. భయంతో కళ్ళు మూసుకున్న అను పాప కింద పడిపోయిందని అనుకుంటుంది. కానీ పాప ఏడకపోవడం చూసి కళ్ళు విప్పి చూసేసరికి ఆర్య చేతుల్లో ఉంటుంది. ఒక్కసారిగా కంగారు పడిపోతుంది అను. అక్కడ మాన్సీ కూడా ఎక్కడ అను, ఆర్య కలిసిపోతారో అని కంగారు పడిపోతుంది. కానీ సడన్గా బామ్మ వచ్చి పాపని దర్శించినందుకు కృతజ్ఞతలు చెప్పి పాపని ఆర్య చేతిలోంచి తీసుకుంటుంది.
మీకు తనకి ఏదో సంబంధం ఉంది బాబు అందుకే దేవుడు మళ్లీ మళ్లీ కలుపుతున్నాడు అంటుంది. అవును బామ్మ ఉన్న బంధాలను దూరం చేసి లేని బంధాలను కలుపుతున్నాడు ఆ దేవుడు అంటాడు. ఆర్య జాగ్రత్తలు చెప్పి పాపని బామ్మకిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కంగారుగా అక్కడినుంచి బయలుదేరుతారు అను, బామ్మ. అను ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి ఎప్పుడైనా అనుని మిస్ లీడ్ చేయడానికి పనికి వస్తుంది అని చెప్పి అనుని ఫాలో అయ్యి తన ఇల్లు కనుక్కుంటుంది మాన్సీ.
మరోవైపు అంజలికి ఫోన్ చేసి పిన్ని వస్తుంది తనకి ఇంకా నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు అని తెలియదు ఏం సమాధానం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో అని చెప్తాడు మదన్. కంగారుపడిన అంజలి ఏదో ఒకటి చెప్పి అమ్మని ఇక్కడికి రానికుండా చేయు అంటుంది. ఇంతలో మదన్ దగ్గరికి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు. ఈ మాటలు ఫోన్లో నుంచి అక్కడ ఏం జరుగుతుంది అని కంగారుగా అడుగుతుంది.
ఆర్య సార్ మీద కోపంతో ఆయనకి పోటీగా ఇల్లీగల్ గా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది ఇష్యూ అవుతుంది. సేవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు మదన్. అప్పుడే అక్కడికి వచ్చిన నీరజ్ వాళ్ళు ఏం జరిగింది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంజలిని అడుగుతాడు. జరిగిందంతా చెప్తుంది అంజలి. వాడి పొగరుకి తగిన శాస్తి జరిగింది అంటాడు నీరజ్.
అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య నీరజ్ ని మందలించి మనల్ని సాయం అడిగినవాడు శత్రువు అయినా సరే వాడికి సాయం చేయాల్సిందే అని మదన్ కి ఫోన్ చేయమని చెప్తాడు. అంజలి మదన్ కి ఫోన్ చేసి ఇస్తుంది. మదన్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఫోన్ ఎస్ఐకి ఇవ్వు అని చెప్తాడు ఆర్య. ఎస్సైతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు ఆర్య. ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని చెప్తాడు. అంజలి థాంక్యూ చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.