- Home
- Entertainment
- Prema Entha Madhuram:సుబ్బుకు .. రాగసుధ గురించి అసలు నిజం చెప్పేసిన అను.. షాక్ లో ఫ్యామిలీ?
Prema Entha Madhuram:సుబ్బుకు .. రాగసుధ గురించి అసలు నిజం చెప్పేసిన అను.. షాక్ లో ఫ్యామిలీ?
Prema Entha Madhuram:బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్ ఏంటో తెలుసుకుందాం. ఆర్య ఒక పెద్ద గిఫ్ట్ ను అను ముందు ఏర్పాటు చేసి ఆ గిఫ్ట్ లో ఆర్య (Arya) ఉన్నట్టుగా ఊపిరి ఆడడం లేదు అన్నట్టుగా భయ పెడుతూ ఉంటాడు.

ఇక అను (Anu) భయపడుతూ.. టెన్షన్ లో గిఫ్ట్ ను అసలు ఓపెన్ చేయలేకపోతుంది. ఆర్య మాత్రం నాకు ఊపిరి ఆడటంలేదు. త్వరగా ఓపెన్ చెయ్ అని భయం తో చెప్పినట్టుగా పక్కనుండి కనపడకుండా అరుస్తాడు. ఇక అను.. ఆర్య (Arya) కు ఏమన్నా అవుతుందేమో అని ఆ గిఫ్ట్ ను గట్టిగా చించేస్తుంది.
కానీ ఆర్య (Arya) ఆ గిఫ్ట్ లో ఉండడు పక్కనుంచి నడుచుకుంటూ.. నవ్వుకుంటూ వస్తాడు. ఇక ఆలా ఆట పట్టించ్చినందుకు అను కొంత చిరాకు పడుతుంది. ఇక ఆ పెద్ద గిఫ్ట్ లో ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. చిన్న గిఫ్ట్ అను ఓపెన్ చేసి చూడగా అందులో నారింజ మిఠాయి లు ఉంటాయి. నారింజ మిఠాయిలు గిఫ్ట్ గా ఇచ్చినందుకు అను (Anu) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది.
ఇక ఆ క్రమంలో అను (Anu) , ఆర్యకు ఒక ముద్దు పెట్టి పారిపోతుంది. మరోవైపు మాన్సీ తన భర్త చాక్లెట్ డే రోజున ఎలాంటి గిఫ్ట్ ఇవ్వనందుకు చిరాకు పడుతుంది. దాంతో మాన్సీ వాళ్ళ భర్త ఒక చిన్న వన్ రూపీ చాక్లెట్స్ జేబులోంచి తీసి ఇస్తాడు. దాంతో మాన్సీ (Maansi) మరింత చిరాకు పడుతుంది.
మరోవైపు రఘురామ్ (Raghuram) కొట్టేసిన పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ లు తెచ్చి లత గీతాలకు ఇవ్వబోతు తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. ఒకవైపు అను, రాగసుధ ను కలవడానికి టిఫిన్ సెంటర్ కి వెళ్లి రాగసుధ ను అక్క.. అని అను గట్టిగా కౌగిలించుకుంటుంది. ఈ క్రమంలోనే రాగసుధ ను కలవడానికి ఇన్నేళ్లుగా అను (Anu) ఎంత ప్రయత్నించిందో చెప్పుకుంటుంది.
ఆ తర్వాత రాగసుధ (Raga sudha) కు నాకు రక్త సంబంధం ఉందని చెబుతుంది. అది అర్థం కాని సుబ్బు వివరించి అడగగా.. తను మీకు కూతురు అయిన అప్పుడు నాకు అక్కే అవుతుంది కదా అని చెబుతుంది. ఇక వాళ్ళ అక్క అయినా రాగసుధతో పని చేయించుకుంటునందుకు అను (Anu) వాళ్ళ తండ్రి తల్లిదండ్రులపై విరుచుకు పడుతుంది. ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.