Prema Entha Madhuram: శివంగిలా మారిన అను.. సాక్షాలతో సహా దొరికిపోయిన మాన్సీ?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భార్య పిల్లలను వెతికే క్రమంలో పిచ్చివాడైపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో జోగమ్మలు ఏదో ఒక విషయాన్ని కన్వే చేస్తూ అర్థం లేకుండానే మాట్లాడతారు దీనిని అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం ఏముంది అంటుంది మాన్సీ. ఏమో ఎవరికి తెలుసు ఏ చూపుల వెనుక ఎవరి హస్తం ఉందో. అనుమానం వచ్చినప్పుడు క్లియర్ చేసుకుంటే మంచిది కదా అంటుంది అంజలి. అప్పుడే ఆర్య మన ఎదురింటిలో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫుటేజ్ తీసుకురా అని నీరజ్ ని పంపిస్తాడు.
మరోవైపు అను బాబు కోసం బొమ్మ కొని లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టి బామ్మతో కలిపి పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఎదురింటి నుంచి తెచ్చిన సిసి ఫుటేజీలో జోగమ్మకి సైగలు చేస్తూ కనిపిస్తుంది మాన్సీ.అది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతారు. నేను చెప్పాను కదా సార్ తనే దీని అందరికి కారణం ఫోన్లో మాట్లాడటం కూడా నేను విన్నాను అంటుంది అంజలి.
సీరియస్ అయిన ఆర్య ఇదంతా ఎందుకు చేశావు చెప్పు అంటూ నిలదీస్తాడు. ఈ అంజలి మాటలు నమ్మి నన్ను మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు నేనేదో క్యాజువల్ గా చూశాను అలా అయితే నా పక్కన పనిమనిషి కూడా ఉంది తను కూడా జోగమ్మని మిస్ గైడ్ చేసినట్లేనా అని అడుగుతుంది. ఇంట్లో చీప్ ట్రిక్స్ ప్లే చేసే బుద్ధి, అవసరం నీకు మాత్రమే ఉన్నాయి అంటాడు నీరజ్.
ఆ పని మనిషిని పిలిపించమని శారదమ్మకి చెప్తాడు ఆర్య. శారదమ్మ పిలవడంతో ఆ పనిమనిషి వస్తుంది. ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆర్య. జోగమ్మ ఏదో చెప్తే వింటున్నాను అంతే అని చెప్తుంది పనిమనిషి. అంతేనా నిజం చెప్పు లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని బెదిరిస్తాడు జెండే. వెళ్లిపోయిన పనిమనిషి ఆ జోగమ్మ మా గల్లీలోనే ఉంటుంది తెలిసినావిడ కావటంతో చూశాను అంటుంది పనిమనిషి.
జెండే పది నిమిషాల్లో ఆ నకిలీ జోగమ్మ ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేస్తాడు ఆర్య. సరే అంటూ బయలుదేరుతాడు జెండే. బాగా టెన్షన్ పడుతున్న మాన్సీని చూసి బాగా టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నావు ఈ నాటకం వెనుక నువ్వు ఉన్నావు అని తెలిస్తే మాత్రం పరిస్థితి మామూలుగా ఉండదు ఆర్య. మరోవైపు రౌడీలు అను ఇంటికి వచ్చి తలుపులు బాదుతుంటారు.
ముందు లైట్ తీసుకున్న అను తలుపులు అంత గట్టిగా బాదుతుండటంతో అనుమానంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూస్తుంది. కర్రలతో ఉన్న రౌడీలను చూసి షాక్ అవుతుంది. బామ్మకి పిల్లల్ని అప్ప చెప్పి వెనకనుంచి బయటికి పంపిస్తుంది. ఏం జరిగినా లోపలికి రావద్దు అంటూ తలుపులు వేసేస్తుంది. ఈలోగా రౌడీలు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. ఏంటే పిల్లల్ని మాయం చేసేసావా అంటూ అను దగ్గరికి రాబోతారు రౌడీలు.
అప్పటికే అను చేతిలో ఉన్న కారం తో రౌడీల కళ్ళల్లో కొడుతుంది. మంటతో బాధపడుతున్న రౌడీలని గ్యాస్ పైప్ తో చావ చితక్కొడుతుంది. తర్వాత గ్యాస్ లీక్ చేసి ఆ సిలిండర్ ని రౌడీల వైపు తోసేస్తుంది. అగ్గిపెట్టి చేత్తో పట్టుకొని వెలిగించబోతుంటే భయంతో పరుగులు తీస్తారు రౌడీలు. మరోవైపు జోగమ్మని తీసుకొని వస్తాడు జెండే. ఇదంతా ఎందుకు చేసావు అని అడుగుతాడు ఆర్య.
నా భర్త వదిలేసాడు పిల్లల్ని పోషించుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటాను అంటుంది నకిలీ జోగమ్మ. నిన్ను మా ఇంటికి రమ్మని ఎవరు చెప్పారు అని అడుగుతాడు ఆర్య. చెప్పొద్దు అన్నట్లుగా బెదిరిస్తుంది మాన్సీ. అది గమనించిన ఆర్య నువ్వు ఎవరికీ భయపడవలసిన పనిలేదు నిజంగా నువ్వు పిల్లల కోసమే ఈ పని చేసినట్లయితే నీ పిల్లలు చదువు సంగతి నేను చూసుకుంటాను నీకు మంచి ఉద్యోగం కూడా ఇస్తాను నిజం చెప్పు అంటాడు ఆర్య.
ఆ మేడమే ఇదంతా చేయించింది అని మాన్సీని చూపిస్తుంది నకిలీ జోగమ్మ. అక్కడ ఉన్న అందరూ షాకైపోతారు. అను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కూడా మాన్సీ యే ఏదో చేసి ఉంటుంది సార్ అంటూ నీతో ఈ ఒక్క నాటకమే ఆడించిందా ఇంకేమైనా ఆడించిందా అని జోగమ్మని అడుగుతుంది అంజలి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.