MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్య కిచెన్ నుంచి నాగార్జున ఇష్టంగా తెప్పించుకుని తినే ఫుడ్ ఏంటో తెలుసా? చైతూ చెప్పిన సీక్రెట్..

నాగ చైతన్య కిచెన్ నుంచి నాగార్జున ఇష్టంగా తెప్పించుకుని తినే ఫుడ్ ఏంటో తెలుసా? చైతూ చెప్పిన సీక్రెట్..

నటుడిగానే కాకుండా... వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు నాగచైతన్య. రెండు క్లౌడ్ కిచెన్లు రన్ చేస్తూ.. ఫుడ్ బిజినెస్ లో దూసుకుపోతున్నాడు. చైతూ కిచెన్ లో.. నాగార్జునకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 14 2026, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అక్కినేని వారసత్వం..
Image Credit : Asianet News

అక్కినేని వారసత్వం..

అక్కినేని వారసత్వం కేవలం సినీ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా కొనసాగుతున్నాడు నాగచైతన్య. నాగేశ్వరావు స్టార్ట్ చేసిన వ్యాపారాలను నాగార్జున పెంచుతూ వచ్చారు.. ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టి రాణిస్తున్నాడు. నాగార్జున మార్గంలో ఆయన కుమారుడు నాగచైతన్య కూడా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా హోటల్స్ ‌, ఫుడ్ బిజినెస్ రంగంలో నాగచైతన్య తనదైన స్టైల్‌తో ముందుకు సాగుతున్నారు.

26
రెస్టారెంట్ బిజినెస్ లలో తండ్రీ కొడుకులు..
Image Credit : Asianet News

రెస్టారెంట్ బిజినెస్ లలో తండ్రీ కొడుకులు..

నాగార్జున నిర్వహించే రెస్టారెంట్‌లు సాధారణ భారతీయ వంటకాలతో మాత్రమే పరిమితం కావు. కొత్త రుచులను పరిచయం చేయడంలో ఆయన ప్రత్యేకత చూపించారు. అదే విధంగా నాగచైతన్య కూడా సంప్రదాయ రెస్టారెంట్‌లకు భిన్నంగా ఆలోచించి జపాన్‌ స్టైల్‌ వంటకాలను హైదరాబాద్ ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నాగచైతన్య రెండు క్లౌడ్ కిచెన్‌లను ప్రారంభించారు. ఇటీవల ఆయన తన ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Related Articles

Related image1
రష్మిక మందన్న అన్నయ్య అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? నిజమెంత?
Related image2
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
36
నాగచైతన్య మాట్లాడుతూ..
Image Credit : Youtube/Zee Telugu

నాగచైతన్య మాట్లాడుతూ..

''జపనీస్ వంటకాలంటే నాకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ జపనీస్ వంటకాలను రుచి చూడటం నాకు అలవాటు అదే రుచిని హైదరాబాద్ ప్రజలకు కూడా అందించాలని అనిపించింది. అందుకే ఇలా ఫుడ్ బిజినెస్ లోకి వచ్చాను. 

ఫస్ట్ ఓపెన్ రెస్టారెంట్‌గా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా నా ప్లాన్ ను మార్చాల్సి వచ్చింది. ఆటైమ్ లో.. మార్కెట్‌లో క్లౌడ్ కిచెన్‌లకు మంచి అవకాశం ఉందనిపించింది. వెంటనే ‘షోయూ’ అనే క్లౌడ్ కిచెన్ ను స్టార్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.' అన్నారు చైతూ.

46
చైతూ వంట.. శోభిత జడ్జిమెంట్..
Image Credit : Facebook / Naga chaitanya

చైతూ వంట.. శోభిత జడ్జిమెంట్..

తన వంటల గురించి చైతన్య మాట్లాడుతూ.. '' నాకు షూటింగ్ బ్రేక్ దొరికితే.. వెంటనే వంటలు మొదలు పెడతాను. కాస్త ఖాళీటైమ్ దొరికినా సరే.. ఇంట్లో కొత్త వంటకాలను కూడా ప్రయత్నిస్తాను. నేను చేసిన కొత్త వంటకాలను ముందుగా శోభిత రుచి చూసి ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. అది బాగా వర్కౌట్ అయ్యి.. ఆమె సూచనల ఆధారంగా.. క్లౌడ్ కిచెన్ మెనూలో మార్పులు చేస్తాము'' అని నాగచైతన్య చెప్పారు.

56
నాగార్జున ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్..
Image Credit : Asianet News

నాగార్జున ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్..

ఇక నాగార్జునకు పిజ్జాలు అంటే ఎంతో ఇష్టమని నాగచైతన్య వెల్లడించారు. ప్రతి ఆదివారం తన రెస్టారెంట్ ‘స్కూజీ’ నుంచి కొత్తరకం పిజ్జాలు తెప్పించుకుని తింటారని చెప్పారు. ఆయనకు అవంటే చాలా ఇష్టమట. ఇక ‘షోయూ’లో పూర్తిగా జపాన్ స్టైల్ ఫుడ్ అందిస్తుండగా, ‘స్కూజీ’లో యూరోపియన్ తో పాటు కాంటినెంటల్ స్టైల్ వంటకాలను సర్వ్ చేస్తున్నట్లు నాగచైతన్య తెలిపారు.

66
నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే..
Image Credit : instagram/@nagachaitanya

నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే..

సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇటీవల మాట్లాడిన ఆయన, సినిమా చివరి 25 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయని చెప్పారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందు చూడని అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. 

దీనితో పాటు మరోసారి ఓటీటీలో సందడి చేయబోతున్నాడు చైతూ.. గతంతో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దూత వెబ్ సిరీస్ లో నటించిన ఆయన.. ‘దూత 2’ కూడా నటించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
4 నెలల్లో 5 సినిమాలు.. ఒకటే హిట్, 4 డిజాస్టర్లు.. ఆమిర్ ఖాన్ కెరీర్‌లో ఆసక్తికర రికార్డ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దశరథ, కాంచనల మధ్య దూరం పెంచిన పారు- కాంచన ఎమోషనల్-నోరు జారిన జ్యో
Recommended image3
రష్మిక మందన్న అన్నయ్య అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? నిజమెంత?
Related Stories
Recommended image1
రష్మిక మందన్న అన్నయ్య అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved