Prema Entha Madhuram: మదన్ లో బయటపడ్డ మరో కోణం.. మాన్సీ బండారం బయటపెట్టిన అంజలి!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. కారణం తెలియకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య కోసం వెతుకుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఈరోజు జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఎస్సై తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు ఆర్య. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి ఫోన్ అంజలికి ఇచ్చేస్తాడు. ఆర్య కి థాంక్స్ చెప్తుంది అంజలి. మళ్లీ మదన్ కి ఫోన్ చేసి ఇప్పటికైనా ఆర్య సార్ గొప్పతనం తెలుసుకో. ఆయనకి నువ్వు థాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఆయనకి అపోజ్ గా ఇంకేమి చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అంజలి.
మరోవైపు పిల్లలిద్దరినీ ముస్తాబు చేస్తూ ఆనందపడుతుంది అను. మీ నాన్న మన పక్కన ఉంటే మన నలుగురం ఎంత సంతోషంగా ఉండే వాళ్ళమో అని పిల్లలకి చెప్పుకుంటూ బాధపడుతుంది. ఆర్య తన దగ్గరికి వచ్చినట్లుగా పిల్లలని ముస్తాబు చేస్తున్నట్లుగా వాళ్లతో ఆడుకుంటున్నట్లుగా బ్రమ పడుతుంది అను. మళ్లీ స్పృహలోకి వచ్చి ఆ ఆనందం, ఆ ప్రేమ మళ్ళీ ఈ జన్మలో పొందగలనో లేదో అనుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
సీన్ కట్ చేస్తే బయటికి వెళ్తున్న ఆర్య కి గుమ్మం ఎదురుగా తలవంచుకొని కనిపిస్తాడు మదన్.అతనిని చూసి అందరూ షాక్ అవుతారు. ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తుంది అంజలి. ఆర్య సర్ క్షమించాను అంటేనే ఇంట్లోకి వస్తాను అంటాడు మదన్. నేను ఎవరికైనా హెల్ప్ చేశాను అంటే వాళ్ళు నా వాళ్ళని అర్థం అంటాడు ఆర్య. ఎమోషనల్ అయిన మదన్ గబగబా వచ్చి ఆర్య కాళ్లు పట్టుకుంటాడు.
నేను మీకు చెడు చేయాలని చూసినా మీరు నన్ను పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేశారు అంటాడు. ఆర్య క్షమించాడని నువ్వు రిలాక్స్ అయిపోవటానికి వీల్లేదు మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పులు చేస్తే ఇండియా నుంచి ఎగ్జిట్ ఏ అంటాడు జెండే. ఇకమీదట అలాంటివి జరగవు అందుకే మీ అందరికీ క్షమాపణ చెప్పుకోవటానికి ఇక్కడికి వచ్చాను అంటూ ఒక రిక్వెస్ట్ అంటాడు మదన్.
ఏంటది అంటాడు ఆర్య. రెండు రోజుల్లో మా పిన్ని వస్తుంది తనకి అంజలి నీరజ్ రెండో భార్య అని తెలియదు. అందుకే తను వచ్చేటప్పటికి నీరజ్ భార్యగా కనిపించాలి అంతేకానీ మాన్సీ కి సవతిగా కాదు అంటాడు మదన్. ఏమీ మాట్లాడకుండా ఆర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎలాంటి లోటు జరగదు తనకి మేమందరం సపోర్ట్ ఉంటాము అని ధైర్యం చెబుతుంది శారదమ్మ. ఈ మాటలు అన్నీ బయటనుంచి వింటుంది మాన్సీ.
అన్న చెల్లెలు ఇద్దరు పర్మినెంట్ గా ఇక్కడే ఉండి పోదాం అనుకుంటున్నట్టున్నారు. ఆల్రెడీ ఒకర్తిని బయటికి పంపించాను. ఇక అంజలిని బయటికి పంపించడం నాకు పెద్ద టాస్క్ ఏమీ కాదు అనుకుంటుంది. అంతలో బయటికి వచ్చిన మదన్ అదంతకురాలికి ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ అయింది నేను పూర్తిగా మారిపోయానని అందరూ నమ్ముతున్నారు అని చెప్తాడు.
ఆగంతకురాలు నవ్వుతూ ఇక ఆర్య కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది అని మదన్ కి చెప్పి సంతోషపడుతుంది. సీన్ కట్ చేస్తే అను విషయం తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అను తిరిగి ఇంటికి రాకూడదు. తను ఇంటికి రాకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మాన్సీ. అనుకోకుండా ఆ మాటలు అంజలి విని మాన్సీ ని ఎవరి గురించి మాట్లాడుతున్నావు నిజం చెప్పమంటూ నిలదీస్తుంది.
నిజం చెప్పకుండా అంజలి మీద కేకలు వేస్తున్న మాన్సీని చేయి పట్టుకుని కిందికి లాక్కువెల్లి నీరజ్ వాళ్లని రమ్మని గట్టిగా అరుస్తుంది అంజలి. ఏం జరిగింది అంటూ అందరూ హాల్లోకి వస్తారు. ఈ మాన్సీ ఎంత పని చేసిందో తెలుసా.. ఆర్య సార్ వస్తే అంతా చెప్తాను అంటుంది అంజలి. ఇంతలోనే ఆర్య, జెండే బయటి నుంచి వస్తారు. వస్తూనే జరుగుతున్న గొడవను చూసి ఏం జరిగింది అని అడుగుతాడు ఆర్య.
అను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం మాన్సీ యే.. తను ఎవరితోనో మాట్లాడడం నేను నా చెవులతో విన్నాను అంటుంది అంజలి. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంజలి అబద్ధం చెప్తుంది అంటుంది మాన్సీ. ఏది అబద్దం అంటూ తను విన్నదంతా చెప్తుంది అంజలి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.