- Home
- Entertainment
- అనిరుధ్ లవ్ ఎఫైర్స్.. కీర్తి సురేష్, ఆండ్రియా అయిపోయారు, ఇప్పుడు కావ్య మారన్‌తో డేటింగ్ ?
అనిరుధ్ లవ్ ఎఫైర్స్.. కీర్తి సురేష్, ఆండ్రియా అయిపోయారు, ఇప్పుడు కావ్య మారన్‌తో డేటింగ్ ?
సంగీత దర్శకుడు అనిరుధ్ తరచుగా ప్రేమ వ్యవహారాలలో చిక్కుకుంటూ ఉంటారు. ఈసారి కావ్య మారన్ తో ఆయన ప్రేమాయణం గురించి వార్తలు వ్యాపించాయి.

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్‌గా అనిరుధ్ రవిచందర్
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కోలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పాపులర్ అయ్యారు. ఆయన పాటలు విశేష ఆదరణ పొందాయి. నేటి యువతకు బాగా రీచ్ అయ్యాయి. వారిని ఉర్రూతలూగిస్తున్నాయి. అటు క్లాస్ సాంగ్స్ తోపాటు, మాస్ పాటలను అందించడంలోనూ అనిరుధ్ దిట్ట.
దీనికితోపాటు సౌండ్ బాక్సులు పగిలిపోయేంతటి బీజీఎంతో అదరగొడుతున్నారు. సినిమా సక్సెస్‌లో ఆయన బీజీఎం కీలక పాత్ర పోషించేలా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో అనిరుధ్ బిజీఎంలతోనే సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.
Anirudh - Kavya Maran Love Rumours
అనిరుధ్.. విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై లవ్ రూమర్స్ కూడా బాగానే వినిపించాయి. తరచూ లవ్ ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు.
నిర్మాత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ తో ఆయన ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించాయి. కావ్య మారన్ ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమాని అనే విషయం తెలిసిందే.
ఇద్దరూ కలిసి డిన్నర్ కి వెళ్లారని, విదేశాల్లో కలిసి తిరుగుతున్నారని నెటిజన్లు చెబుతున్నారు. అయితే, ఇందులో ఎంత నిజముందో తెలియదు. ఇద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు. కావ్య మారన్ కంటే ముందు అనిరుధ్ చాలా మంది హీరోయిన్లతో లవ్ స్టోరీలు నడిపించినట్టు వార్తలు వచ్చాయి.
మహానటి కీర్తిసురేష్‌తోనూ లవ్ ట్రాక్?
సంగీత దర్శకుడు అనిరుధ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వ్యాపించాయి. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు దీనికి కారణం. వీటిని చూసిన నెటిజన్లు ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం చేశారు.
అయితే, కీర్తి సురేష్ తల్లిదండ్రులు స్పందిస్తూ, ఇద్దరూ మంచి స్నేహితులని, వారి మధ్య ప్రేమ వ్యవహారం కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతేడాది కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడి ఆంటోనీ తట్టిల్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
సింగర్ జోనిటా గాంధీతోనూ అనిరుధ్ లవ్ ఎఫైర్
అనిరుధ్ సంగీతంలో సింగర్ జోనిటా గాంధీ అనేక హిట్ పాటలు పాడారు. వీరిద్దరి కాంబినేషన్ కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అనిరుధ్ తో జోనిటా దిగిన ఫోటోలు వైరల్ కావడంతో, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వ్యాపించాయి.
అయితే, వీరిద్దరూ ఈ వార్తలను పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల జరిగిన అనిరుధ్ సంగీత కార్యక్రమంలో జోనిటా పాల్గొని పాటలు పాడారు.
హీరోయిన్ ఆండ్రియా జెరేమియా
సంగీత దర్శకుడు అనిరుధ్ మొదటగా ఆండ్రియాతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడంతో వీరి ప్రేమ బయటపడింది. ఆ తర్వాత వీరిద్దరికీ బ్రేకప్ అయింది.
ఆండ్రియాతో తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ, తమ మధ్య వయస్సు తేడా కారణంగానే విడిపోయామని అనిరుధ్ చెప్పారు. అనిరుధ్ కంటే ఆండ్రియా ఆరు సంవత్సరాలు పెద్దది. ఇలా వరుసగా లవ్ ఎఫైర్లు నడిపిస్తున్న అనిరుధ్ వాటికి ఎప్పుడు పుల్ స్టాప్ పెడతాడో, ఎవరికి కమిట్ అవుతాడో చూడాలి.