- Home
- Entertainment
- ప్రభాస్ హీరోయిన్ దిశా పటాని సంపాదన, కార్లు, ఆస్తులు.. సినిమాలు చేసేది తక్కువే, అన్ని కోట్లు ఎలా వస్తున్నాయి?
ప్రభాస్ హీరోయిన్ దిశా పటాని సంపాదన, కార్లు, ఆస్తులు.. సినిమాలు చేసేది తక్కువే, అన్ని కోట్లు ఎలా వస్తున్నాయి?
ప్రభాస్ హీరోయిన్ దిశా పటానికి 33 ఏళ్ళు నిండాయి. నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న దిశా పటానీ 500 రూపాయలతో ముంబాయి వచ్చి ఇప్పుడు కోట్లకు ఎదిగింది. ఆ కథేంటో చూద్దాం.

ప్రభాస్ `కల్కి 2898 ఏడీ`తో దిశా పటాని పాపులర్
ప్రభాస్‌తో `కల్కి 2898 ఏడీ` చిత్రంలో నటించి పాపులర్ అయిన దిశా పటాని 1992 లో జూన్13న బరేలీలో జన్మించంది. ఆమె మొదట పైలట్ కావాలనుకుంది, కానీ సినిమా రంగంలోకి వచ్చింది.
500 రూపాయలతో ముంబై వచ్చిన దిశా పటాని
దిశా పటాని ముంబై వచ్చినప్పుడు ఆమె జేబులో కేవలం 500 రూపాయలు ఉండేవి. ఆమె కష్టపడి కోట్ల ఆస్తి సంపాదించింది. దిశా దగ్గర 75 కోట్ల ఆస్తి ఉంది.
ఏడాదికి రూ.12కోట్లు సంపాదిస్తున్న దిశా పటాని
దిశా పటాని నెలకు దాదాపు 1 కోటి రూపాయలు సంపాదిస్తుంది. ఆమె వార్షిక ఆదాయం 12 కోట్ల రూపాయలు.
ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటున్న దిశా
దిశా పటాని ఒక్కో సినిమాకి 7 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుంది. సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తుంది. ఒక్కో ప్రకటనకు 3 కోట్లు తీసుకుంటుందని సమాచారం.
దిశా ముంబయిలో లగ్జరీ అపార్ట్ మెంట్
దిశా పటాని ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. దాని ధర రూ.5 కోట్లు. ఆమెకు ఇంకో ఇల్లు కూడా ఉందని టాక్.
దిశా పటాని కార్ కలెక్షన్
దిశా పటాని దగ్గర బ్రాండెడ్ కార్ కలెక్షన్ ఉంది. ఆమె దగ్గర మెర్సిడెస్ బెంజ్ S450, ల్యాండ్ రోవర్, BMW 7 సిరీస్, హోండా సివిక్, షెవర్లె క్రూజ్, ఆడి A6 కార్లు ఉన్నాయని బాలీవుడ్ మీడియా సమాచారం.
తెలుగు మూవీ `లోఫర్`తో హీరోయిన్‌గా పరిచయం
దిశా పటాని 2015లో తెలుగు సినిమా ద్వారానే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన `లోఫర్` సినిమాతో తెరంగేట్రం చేసింది. 2016లో `ఎం.ఎస్. ధోని` సినిమాలో నటించింది.
గతేడాది ప్రభాస్‌తో `కల్కి 2898ఏడీ`లో హీరోయిన్‌గా మెరిసిన విషయం తెలిసిందే. ఇందులో గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె ఇప్పటివరకు 13 సినిమాల్లో నటించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది దిశా.