MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Anil Ravipudi: తెలివిగా మల్టీస్టారర్ మూవీని రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి, ఆ సినిమా డిజాస్టర్

Anil Ravipudi: తెలివిగా మల్టీస్టారర్ మూవీని రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి, ఆ సినిమా డిజాస్టర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తన కెరీర్ లో జరిగిన ఆసక్తికర సంఘటనలని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ సినిమాని రిజెక్ట్ చేశారట. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 05 2026, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డైరెక్టర్ అనిల్ రావిపూడి 
Image Credit : facebook.com/AnilRavipudiOfficial

డైరెక్టర్ అనిల్ రావిపూడి 

అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. సంక్రాంతి డైరెక్టర్ అనే ముద్ర కూడా పడింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరుస హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి 
Image Credit : Instagram/ shinescreenscinema

వరుస హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి 

పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ తెరకెక్కించిన అన్ని సినిమాలు హిట్స్ అయ్యాయి. మధ్యలో ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశారు. అవి కూడా సక్సెస్ అయ్యాయి. దర్శకుడిగా కంటే ముందుగా అనిల్ రావిపూడి కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. కందిరీగ, ఆగడు లాంటి సినిమాలకు అనిల్ రావిపూడి వర్క్ చేశారు. దర్శకుడిగా పరిచయం అయింది పటాస్ మూవీతోనే. 

35
మల్టీస్టారర్ సినిమా రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి 
Image Credit : Masala Movie

మల్టీస్టారర్ సినిమా రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి 

అంతకంటే ముందుగానే అనిల్ రావిపూడికి దర్శకుడిగా అవకాశం వచ్చిందట. అది కూడా ఏకంగా మల్టీస్టారర్ మూవీ. ఆ సినిమా మరేదో కాదు.. రామ్, వెంకటేష్ నటించిన మసాలా. సురేష్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని ముందుగా అనిల్ రావిపూడికే ఇచ్చారట. కానీ తాను రిజెక్ట్ చేసినట్లు అనిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

45
అలాంటి కథ వద్దనుకున్న అనిల్ 
Image Credit : Asianet News

అలాంటి కథ వద్దనుకున్న అనిల్ 

ముందుగా సురేష్ బాబు గారు డైరెక్టర్ గా అవకాశం ఇవ్వగానే టెంప్ట్ అయ్యా. వెంకటేష్, రామ్ లతో మల్టీస్టారర్ కాబట్టి బావుంటుంది అని అనుకున్నా. కానీ మసాలా సినిమా మాతృక బోల్ బచ్చన్ ని ఆల్రెడీ చూశాను. దీనితో నా తొలి చిత్రం ఇలాంటి కంటెంట్ తో తీయకూడదు.. కొంచెం యాక్షన్ ఉండాలి అనే భావించా. అందుకే ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్లు అనిల్ తెలిపారు. కానీ ఆ చిత్రానికి రచయితగా మాత్రం వర్క్ చేశారు. 

55
రామ్ పోతినేనితో ఆ సూపర్ హిట్ మూవీ మిస్ 
Image Credit : Ram, Anil Ravipudi Combo

రామ్ పోతినేనితో ఆ సూపర్ హిట్ మూవీ మిస్ 

రామ్ తో మరో సినిమా కూడా మిస్ అయినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. రాజా ది గ్రేట్ సినిమాని ముందుగా రామ్ తో అనుకున్నాం. రామ్ అంతకు ముందే హైపర్ అనే యాక్షన్ మూవీ చేశారు. మళ్ళీ యాక్షన్ మూవీ వద్దులే అని రాజా ది గ్రేట్ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. దీనితో అదే కథలో మార్పులు చేసి రవితేజతో తెరకెక్కించినట్లు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image2
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Recommended image3
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Related Stories
Recommended image1
Raasi: నా బాడీ గురించి అసభ్యంగా మాట్లాడింది, కేసు వేద్దామనుకున్నా..అనసూయ పేరెత్తకుండా ఇచ్చిపడేసిన నటి రాశి
Recommended image2
OTT Movies: సంక్రాంతికి ముందే బాలయ్య అభిమానులకు పండగ.. అఖండ 2 తో పాటు ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved