'రామారావు' టైటిల్ తో బాలయ్య మూవీ, డైలాగ్ మాత్రం వైల్డ్ .. ఎందుకు ఆగిపోయింది ?
బాలకృష్ణ చివరగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో బరిలోకి దిగుతున్నారు. వాల్తేరు వీరయ్య కంటే అద్భుతమైన చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తీశారు అని నిర్మాత నాగవంశీ ఆల్రెడీ హైప్ ఇచ్చారు. ఎలివేషన్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఇన్సైడ్ టాక్. మరి సంక్రాంతికి బాలయ్య ఏ రేజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.
బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాలకృష్ణ చివరగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కూతుర్ని ధైర్యవంతురాలిగా మార్చే పాత్రలో బాలయ్య అదరగొట్టారు. అయితే అంతకు ముందే అనిల్ రావిపూడి బాలయ్యతో ఒక చిత్రం చేయాలనుకున్నారట.
రామారావు అనే టైటిల్ తో కథ కూడా రాసుకున్నారు. బాలకృష్ణ వందవ చిత్రం గా రామారావు చిత్రాన్ని తెరకెక్కించాలని అనిల్ రావిపూడి అనుకున్నారు. దిల్ రాజుతో కలసి బాలయ్యకి స్టోరీ లైన్ చెప్పారు. అప్పటికి కంప్లీట్ స్టోరీ ఫైనల్ కాలేదు. 'నాకు నచ్చని ముఖం చూస్తే మైండ్ లో నరం కట్ అవుతుంది.. ఇలాగే వైల్డ్ గా రియాక్ట్ అవుతా' అనే డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ బాలయ్యకి విపరీతంగా నచ్చేసింది.
కానీ కొన్ని కారణాల వల్ల బాలయ్య వందవ చిత్రం చేయలేకపోయాను. బాలకృష్ణ 100వ చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనిల్ రావిపూడి భగవంత్ కేసరి చిత్రం తెరకెక్కించే అవకాశం వచ్చింది. రామారావు కథలో బాలయ్య పాత్రని పోలీస్ అధికారిగా అనిల్ రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ ని భగవంత్ కేసరిలో పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందట. దీనితో వెంటనే భగవంత్ కేసరిలో బాలయ్య పాత్రని పోలీస్ అధికారిగా మార్చారు.
ఎప్పటికైనా బాలయ్య రామారావు అనే టైటిల్ తో సినిమా చేస్తే అదిరిపోతుంది.తన తండ్రి పేరు కాబట్టి సెంటిమెంట్ గా బావుంటుంది. అయితే ఆల్రెడీ ఆ టైటిల్ తో రవితేజ సినిమా చేశారు.