ఎన్టీఆర్ తోనే కాదు, చిరంజీవితో కూడా సున్నం పెట్టుకున్న విలన్.. ఆ మూవీ టూవరస్ట్ అంటూ సెటైర్లు
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో హిట్ చిత్రాలు, ఇండస్ట్రీ హిట్ మూవీస్ లో నటించారు. 80, 90 దశకాల్లో చిరంజీవి కెరీర్ తిరుగులేదు అన్నట్లుగా సాగింది. అప్పుడప్పుడూ చిరంజీవి స్పీడుకి బ్రేకులు అన్నట్లుగా కొన్ని ఫ్లాప్ చిత్రాలు పడ్డాయి.
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో హిట్ చిత్రాలు, ఇండస్ట్రీ హిట్ మూవీస్ లో నటించారు. 80, 90 దశకాల్లో చిరంజీవి కెరీర్ తిరుగులేదు అన్నట్లుగా సాగింది. అప్పుడప్పుడూ చిరంజీవి స్పీడుకి బ్రేకులు అన్నట్లుగా కొన్ని ఫ్లాప్ చిత్రాలు పడ్డాయి. ప్రేక్షకులు సినిమా బాగాలేదని చెప్పడం సహజమే. సెలబ్రిటీలే సినిమా బాగాలేదని బహిరంగంగా చెబితే వివాదం అవుతుంది.
కోట శ్రీనివాసరావు ఎంత అద్భుతమైన నటుడో అదే స్థాయిలో అప్పట్లో ఆయన వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. మండలాధీశుడు లాంటి చిత్రాల్లో కోట శ్రీనివాసరావు సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ ఆయన పాత్రల్లో నెగిటివ్ గా నటించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై సెటైరికల్ గా తెరకెక్కించిన చిత్రం అది. ఆ మూవీ తర్వాత కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ అభిమానులకు విరోధిగా మారారు.
కోట శ్రీనివాసరావుపై ఎన్టీఆర్ అభిమానులు అప్పట్లో దాడికి కూడా ప్రయత్నించారు. కానీ కోట.. ఎన్టీఆర్ ని కలిసినప్పుడు తనకి వ్యతిరేకంగా నటించిన పాత్రల గురించి అసలు మాట్లాడలేదట. మీరు అద్భుతమైన నటుడు బ్రదర్ అని ప్రశసించారట. చిరంజీవి సినిమాపై కూడా కామెంట్స్ చేసి కోట అప్పట్లో వార్తల్లో నిలిచారు.
చిరంజీవి, నిరోషా, విజయశాంతి కలసి నటించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ చిత్రం 1991లో విడుదలయింది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కెఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత. కోట శ్రీనివాసరావు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ అందరికీ తెలిసిపోయింది. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు.
కేఎస్ రామారావు ఈ చిత్రం గురించి ఇతరుల ఒపీనియన్ తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీ ఎలా ఉంది అని కోటని అడిగారట. వెంటనే కోట సెటైరికల్ గా ఈ చిత్రంపై జోకులు వేశారు. ఏముందండీ.. అది స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ కాదు.. టూవరస్ట్ పురం పోలీస్ స్టేషన్ అంటూ సెటైర్లు వేశారు. కోట శ్రీనివాస రావు వ్యాఖ్యలు చిరంజీవి చెవిన పడ్డాయి. ఏంటి నా సినిమా గురించి జోకులు వేశావు అని చిరు అడిగారు. ఉన్నవిషయమే కదా చెప్పను అని కోట చిరంజీవితో అన్నారు. దీనితో మెగాస్టార్ నవ్వుకుని సైలెంట్ అయిపోయారట. ఆ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకోలేదు. కోట శ్రీనివాస రావు విలన్ గా, కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు.